టైర్లను ఎప్పుడు మార్చాలో తెలిపే టెక్నాలజీ

Written By:

కొత్తగా కార్లు మరియు బైకులు కొన్నవారికి, వాటి టైర్ల నిర్వహణ పట్ల సరైన అవగాహన ఉండదు. వాటి ఎప్పుడు మార్చాలి అని సందేహంలో చాలా మంది ఉంటారు. వీరి కోసం ఓ పరిష్కారం కనిపెట్టారు శాస్త్రవేత్తలు. టైర్లను ఎప్పుడు మార్చాలి అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఓ టెక్నాలజీ ఆవిష్కరించారు. దీని గురించి పూర్తి సమాచారం.....

టైర్లను ఎప్పుడు మార్చాలో తెలిపే టెక్నాలజీ

ప్రిటెండ్ సెన్సార్‌ను టైర్ల మీద ఏర్పాటు చేయడం ద్వారా టైర్ల కండీషన్ మరియు వాటిని మార్చడం గురించిన వివరాలను డ్రైవర్‌కు తెలియజేసి అలర్ట్ చేస్తుంది.

ఎలా పనిచేస్తుంది?

ఎలా పనిచేస్తుంది?

మెటాలిక్ కార్బన్ నానోట్యూబ్స్ ద్వారా ఈ సెన్సార్లను రూపొందించాడు అమెరికాలోని డ్యూక్ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ సైంటిస్ట్. మెటాలిక్ కండక్టర్లు ఎలక్ట్రిక్ వలయాలతో వ్యవహరించే తీరు ఆధారంగా టైర్ల పనితీరు సెన్సార్లు పసిగడతాయి.

టైర్లను ఎప్పుడు మార్చాలో తెలిపే టెక్నాలజీ

డ్యూక్ యూనివర్శిటీ సహ అధ్యాపకుడు ఆరోన్ ఫ్రాంక్లిన్ మాట్లాడుతూ, "ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో అత్యాధునిక పరిజ్ఞానం వినియోగించబడుతోంది. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త సాంకేతికతలు వాహనం యొక్క మొత్తం పనితీరు మరియు సమాచారాన్ని సేకరిస్తున్నాయి. కానీ వాహనంలో అతి ముఖ్యమైన టైర్ల విషయంలో ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేదు. ఈ లక్ష్యంతోనే ఈ టెక్నాలజీని ఆవిష్కరించినట్లు" చెప్పుకొచ్చాడు.

టైర్లను ఎప్పుడు మార్చాలో తెలిపే టెక్నాలజీ

టైర్ల పనితీరును మరియు వాటిని సమయానికి మార్చాలి అని తెలిపే సెన్సార్లను వివిధ పదార్థాలతో, విభిన్న పద్దతుల్లో తయారు చేయవచ్చు. కానీ ఫ్లెక్సిబుల్ పాలిమిడ్ తెర మీద మెటాలిక్ కార్బన్ నానోట్యూబ్స్ అందివ్వడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపాడు.

టైర్లను ఎప్పుడు మార్చాలో తెలిపే టెక్నాలజీ

ఏరోసోల్ జెట్ ప్రింటర్ ద్వారా ఈ సెన్సార్లను ఎలాంటి పదార్థాల మీదనైనా ప్రింట్ చేయవచ్చు. ఫ్రాంక్లిన్ మాట్లాడుతూ, భారీ మొత్తంలో వీటిని ఉత్పత్తి చేస్తే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావచ్చని వివరించాడు.

టైర్లను ఎప్పుడు మార్చాలో తెలిపే టెక్నాలజీ

అయితే టైర్ల లోపలి వైపు డైరక్ట్ ప్రింటింగ్ చేయడం ఉత్తమేనా అనే సందేహంలో ఉన్నారు. మరిన్ని పరీక్షలు జరిపి డైరక్ట్ ప్రింటింగ్ మెరుగైన పద్దతని తేలితె ఉత్పత్తిని ప్రారంభిస్తామని, లేదంటే మెరుగైన పద్దతి కోసం ప్రయోగాన్ని కొనసాగిస్తానని తెలిపాడు.

టైర్లను ఎప్పుడు మార్చాలో తెలిపే టెక్నాలజీ

టైర్ల పరిస్థితిని అంచనా వేయడమే కాకుండా, టైర్లలో గాలి తగినంత లేకపోయినా, టైర్ల ద్వారా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉన్నా, వెంటనే డ్రైవర్‌కు సమారాన్ని అందిస్తాయి ఈ ప్రింటెడ్ సెన్సార్లు.

డ్రైవ్‍‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‍‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నూతన టెక్నాలజీ ద్వారా ఆటోమోటివ్ పరిశ్రమ కొత్త అంచులను తాకుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. టైర్ల మీద ఉన్న సెన్సార్లు టైర్ల పరిస్థితిని గమనించడం లైఫ్ సేవింగ్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. ప్రత్యేకించి దీని అవసరం ఇండియాలో అధికంగా ఉంది.

English summary
Read In Telugu Printed Sensors Can Tell You When To Change Tyres
Story first published: Monday, June 19, 2017, 16:20 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark