2022 అక్టోబర్ నెలలో విడుదలైన కొత్త బైకులు: టీవీఎస్ రైడర్ నుంచి హీరో విడా వరకు..

భారదేశంలో విజయదశమి మరియు దీపావళి పండుగలు రెండూ కూడా ఒకే నెలలో రావడం ఆటో మొబైల్ కంపెనీలకు చాలా వరకు కలిసి వచ్చింది. ఎందుకంటే ఎక్కువంది ఈ పండుగల సమయంలో కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ కారణంగానే వాహన తయారీ సంస్థలు కూడా కొత్త వాహనాలను ఈ సీజన్ లోనే విడుదల చేయడం కూడా జరిగింది.

దేశీయ మార్కెట్లో ఈ నెలలో (2022 అక్టోబర్) విడుదలైన కొత్త బైకులు ఏవి? వాటి ధరలు ఏమిటి? ఇతర వివరాలు ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

2022 అక్టోబర్ నెలలో విడుదలైన కొత్త బైకులు: టీవీఎస్ రైడర్ నుంచి హీరో విడా వరకు..

ఓలా ఎస్ 1 ఎయిర్:

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీలో తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్న 'ఓలా ఎలక్ట్రిక్' ఇటీవల దేశీయ మార్కెట్లో 'ఎస్1 ఎయిర్' అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అధికారికంగా విడుదల చేసింది. ఈ స్కూటర్ ధర రూ. 84,999. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుచేయాలనుకునే కస్టమర్లు రూ. 999 చెల్లించి కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు 2023 ఏప్రిల్ నెలలో ప్రారంభమవుతాయి.

2022 అక్టోబర్ నెలలో విడుదలైన కొత్త బైకులు: టీవీఎస్ రైడర్ నుంచి హీరో విడా వరకు..

ఓలా 'ఎస్1 ఎయిర్‌' (S1 Air) ఒక ఫుల్ చార్జ్ తో 'ఎకో మోడ్' లో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లవరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ హోమ్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి 4:30 గంటల సమయం పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

2022 అక్టోబర్ నెలలో విడుదలైన కొత్త బైకులు: టీవీఎస్ రైడర్ నుంచి హీరో విడా వరకు..

హీరో విడా:

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) 2022 అక్టోబర్ నెలలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'హీరో విడా' (Hero Vida) ను లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 'వి1 ప్రో' (V1 Pro) మరియు 'వి1 ప్లస్' (V1 Plus) అనే రెండు వేరియంట్స్ లో విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్).

2022 అక్టోబర్ నెలలో విడుదలైన కొత్త బైకులు: టీవీఎస్ రైడర్ నుంచి హీరో విడా వరకు..

హీరో విడా స్కూటర్లలో రిమూవబుల్ బ్యాటరీ అందుబాటులో ఉంటుంది. Vida V1 Plus ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 143 కిలోమీటర్లు, Vida V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 165 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. వీటి టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ వరకు ఉంటుంది. హీరో విడా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

2022 అక్టోబర్ నెలలో విడుదలైన కొత్త బైకులు: టీవీఎస్ రైడర్ నుంచి హీరో విడా వరకు..

కీవే ఎస్ఆర్125:

హంగేరియన్ బైక్ తయారీ సంస్థ 'కీవే' (Keeway) భారతీయ మార్కెట్లో 'కీవే ఎస్ఆర్125' (Keeway SR125) లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ధర రూ. 1,19,000 (ఎక్స్ షోరూమ్ - ఇండియా). ఈ బైక్ మొత్తం మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి గ్లోసీ రెడ్, గ్లోసీ బ్లాక్ మరియు గ్లోసీ వైట్ కలర్స్.

2022 అక్టోబర్ నెలలో విడుదలైన కొత్త బైకులు: టీవీఎస్ రైడర్ నుంచి హీరో విడా వరకు..

కొత్త కీవే ఎస్ఆర్125 బైక్ సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, 125సీసీ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 9.7 హెచ్‌పి మరియు 8.2 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ యొక్క మొత్తం బరువు 120 కేజీల వరకు ఉంటుంది, కావున మంచి పర్ఫామెన్స్ అందించడానికి అనుకూలంగా ఉంటుంది. కీవే ఎస్ఆర్125 గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

2022 అక్టోబర్ నెలలో విడుదలైన కొత్త బైకులు: టీవీఎస్ రైడర్ నుంచి హీరో విడా వరకు..

టీవీఎస్ రైడర్ SmartXonnect:

దీపావళి పండుగను పురస్కరించుకుని టీవీఎస్ కంపెనీ భారతీయ మార్కెట్లో రైడర్ 125 బైక్ యొక్క టాప్ వేరియంట్ ని అధికారికంగా విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 99,990 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇందులో SmartXconnect కనెక్టివిటీ టెక్నాలజీ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది బైక్‌ను మొబైల్‌కి కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. కావున దీని ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాయిస్ కమాండ్‌లు, కాల్ అలర్ట్‌లు, మెసేజ్ నోటిఫికేషన్‌లు మరియు మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్లను పొందవచ్చు.

2022 అక్టోబర్ నెలలో విడుదలైన కొత్త బైకులు: టీవీఎస్ రైడర్ నుంచి హీరో విడా వరకు..

టీవీఎస్ రైడర్ 125 బైక్ 124.8 సిసి సింగిల్-సిలిండర్, SOHC ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 11.4 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ 5.9 సెకన్లలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.ఈ బైక్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

2022 అక్టోబర్ నెలలో విడుదలైన కొత్త బైకులు: టీవీఎస్ రైడర్ నుంచి హీరో విడా వరకు..

మోటో మోరిని:

2022 అక్టోబర్ నెలలో 'మోటో మోరిని' నుంచి నాలుగు బైకులు విడుదలయ్యాయి. వీటి ధరలు రూ. 6.89 లక్షల నుంచి రూ. 7.40 లక్షల వరకు ఉన్నాయి. అయితే డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా చాలా అప్డేట్ చెంది రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవి పర్ఫామెన్స్ అందించడంలో కూడా చాలా అద్భుతంగా ఉంటాయి.

2022 అక్టోబర్ నెలలో విడుదలైన కొత్త బైకులు: టీవీఎస్ రైడర్ నుంచి హీరో విడా వరకు..

డుకాటి మల్టిస్ట్రాడా పైక్స్ పీక్ (Ducati Multistrada Pikes Peak):

ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'డుకాటి' (Ducati) దేశీయ మార్కెట్లో గతనెలలో 'మల్టీస్ట్రాడా V4 పైక్స్ పీక్' (Multistrada V4 Pikes Peak) విడుదల చేసింది. ఈ కొత్త బైకు ధర అక్షరాలా రూ. 31.48 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ కొనాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు నవంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

2022 అక్టోబర్ నెలలో విడుదలైన కొత్త బైకులు: టీవీఎస్ రైడర్ నుంచి హీరో విడా వరకు..

డుకాటి మల్టీస్ట్రాడా V4 పైక్స్ పీక్ బైక్ 1,158 సిసి లిక్విడ్ కూల్డ్ 90 డిగ్రీ వి4 ఇంజిన్ అందించడం జరిగింది. కావున ఇది 10,500 ఆర్‌పిఎమ్ వద్ద 170 హెచ్‌పి పవర్ మరియు 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 125 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. డుకాటి మల్టిస్ట్రాడా పైక్స్ పీక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Two wheelers launched in 2022 october from ola s1 air hero vida and more
Story first published: Monday, October 31, 2022, 15:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X