'BYD ATTO 3' ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. డిజైన్, ఫీచర్స్ & పర్ఫామెన్స్

చైనా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) గురించి భారతీయ మార్కెట్లో చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు. అయితే కంపెనీ దేశీయ మార్కెట్లో ఇప్పటికే E6 ఎలక్ట్రిక్ MPV ని విక్రయిస్తోంది, కాగా కంపెనీ ఇటీవల ATTO 3 ఎలక్ట్రిక్ SUV విడుదల చేసింది.

BYD కంపెనీ విడుదల చేసిన ATTO 3 (ఆటో 3) కంపెనీ యొక్క లేటెస్ట్ SUV. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, అద్భుతమైన ఫీచర్స్ కలిగి, మంచి రేంజ్ అందించడానికి అనుకూలంగా ఉండే బ్యాటరీ ఫ్యాక్ కూడా పొందుతుంది. ఇటీవల మేము ఈ కొత్త ఎలక్ట్రిక్ SUV ని డ్రైవ్ చేసాము, దీని గురించి తెలుసుకోవాలనుకునే అన్ని వివరాలు ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.. రండి.

BYD ATTO 3 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

BYD Atto 3 ఎక్స్టీరియర్ డిజైన్:

BYD కంపెనీ విడుదల చేసిన కొత్త ATTO 3 ఎలక్ట్రిక్ SUV డ్రాగన్ ఫేస్ 3.0 ఫ్యామిలీ డిజైన్‌ను అనుసరిస్తుంది. కావున ముందు భాగం మొత్తమ్ క్లోజ్ చేయబడి ఉంటుంది. అయితే ఇందులో త్రిభుజాకారణంలో క్రిస్టల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు బ్లూ హైలైట్‌లను పొందుతాయి. అంతే కాకుండా ఇక్కడ విస్తరించి ఉన్న క్రోమ్ మీద BYD అక్షరాలను చూడవచ్చు. కింది భాగంలో ఫ్రంట్ బంపర్‌కి ఇరువైపులా ఎయిర్ ఇన్‌టేక్‌లు కనిపిస్తాయి.

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, ఇక్కడ 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరింత అట్రాక్టివ్ లుక్ ఇస్తాయి. కారుని చూడగానే వెంటనే ఈ అల్లాయ్ వీల్స్ మన దృష్టిని ఆకర్శించేలా రూపొందించబడి ఉన్నాయి. ఇక సి-పిల్లర్ మీద స్కేల్-వంటి ఎలిమెంట్స్ మరింత మంచి లుక్ ఇస్తుంది. అదే సమయంలో 'రూప్ రైల్స్' డోర్స్ కి కొంత పైన కొంచెం ఉబ్బెత్తుగా వెనుక వరకు విస్తరించి ఉంటాయి.

BYD ATTO 3 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

కొత్త BYD Atto 3 యొక్క వెనుక భాగంలో సొగసైన లైట్‌బార్ విస్తరించి ఉంటుంది. ఇది LED టైల్‌లైట్. దీనికి కొంచెం పైన క్రోమ్‌లో పూర్తి చేయబడిన బ్రాండ్ పేరు చూడవచ్చు. అంతే కాకుండా ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ మూడవ బ్రేక్ లైట్ మరియు బంపర్‌పై తక్కువగా ఉండే రివర్సింగ్ లైట్స్ వంటి వాటిని కూడా ఇక్కడ చూడవచ్చు. వెనుక వైపు Atto 3మరియు EV అనే బ్యాడ్జెస్ కూడా ఉన్నాయి.

BYD Atto 3 ఇంటీరియర్ మరియు ఫీచర్స్:

BYD Atto 3 ఎక్స్టీరియర్ డిజైన్ మాత్రమే కాదు, ఇంటీరియర్ డిజైన్ మరింత అద్భుతంగా ఉంటుంది. క్యాబిన్‌లోకి ప్రవేశించిన వెంటనే మీరు తప్పకుండా మీరు అమితంగా ఆకర్శించబడతారు. క్యాబిన్ మొత్తమ్ ఫోమ్ మెటీరియల్‌తో తయారు చేయబడినట్లుగా కనిపిస్తుంది. క్యాబిన్‌లో చాలా వరకు రెడ్ కలర్ స్టిచ్చింగ్ మరియు యాక్సెంట్స్ చూడవచ్చు. ఇందులో AC వెంట్స్ (డంబెల్-స్టైల్) చాలా కొత్తగా అనిపిస్తాయి. ఎయిర్‌క్రాఫ్ట్ కంట్రోలర్ లాంటి గేర్ లివర్, గ్రిప్ స్టైల్ డోర్ హ్యాండిల్ మొదలైనవన్నీ ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి.

BYD ATTO 3 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇందులోని సీట్లు మంచి నిష్పత్తిలో ఉండటం వల్ల చాలా కంఫర్ట్ గా అనిపిస్తాయి, భారీగా ఉండే పనోరమిక్ సన్‌రూఫ్ మీకు మరింత గొప్ప అనుభూతిని అందిస్తుంది. వెనుక సీట్లు కూడా అనుకూలంగా ఉంటాయి, కానీ సరైన అండర్ తై సపోర్ట్ లేదని అనిపిస్తుంది. ఎలక్ట్రిక్ కార్లలో చాలా వరకు అండర్ తై సపోర్ట్ చెప్పుకోదగినదిగా ఉండదు. హెడ్‌స్పేస్‌ కూడా ఆటో 3 లో కొంత తగ్గించబడి ఉంటుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద 12.8 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే ఒక బటన్‌ను నొక్కినప్పుడు ల్యాండ్‌స్కేప్ నుండి పోర్ట్రెయిట్ మోడ్‌కి తిరుగుతుంది. ఇది ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కి సపోర్ట్ చేస్తుంది. ఇక డ్రైవర్ డిస్ప్లే కొంత చిన్నడిగానే ఉంటుంది. అయినప్పటికీ వాహనం గురించి కావలసిన సమాచారం అందిస్తుంది. కానీ డిస్ప్లే చిన్నదిగా ఉండటం వల్ల డేట్ కోసం కొంత సేపు మెల్లగా చూడాల్సి ఉంటుంది.

అంతే కాకుండా ఇందులో వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, NFC కార్డ్ కీ మరియు ఓపెనింగ్ హైట్ మెమరీ ఫంక్షన్‌ కలిగి ఉన్న ఆటోమేటిక్ టెయిల్‌గేట్ వంటి అనేక ఇతర ఫీచర్‌లు ఇందులో అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్ డిసెంట్ కంట్రోల్‌ వంటి సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ADAS ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

BYD Atto 3 పర్ఫామెన్స్ మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్స్:

BYD Atto 3 ఎలక్ట్రిక్ SUV లో తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం దాని పర్ఫామెన్స్. కావున ఇందులో ఎలాంటి బ్యాటరీ ఉపయోగించారు, ఇది ఎంత రేంజ్ అందిస్తుంది, ఛార్జింగ్ మరియు టాప్ స్పీడ్ వంటి వివరాలను తెలుసుకోవాల్సి ఉంటుంది.

BYD Atto 3 బ్లేడ్ లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. ఈ బ్లేడ్ బ్యాటరీ ప్యాక్ 60.48kWh కెపాసిటీ కలిగి ఉంటుంది. కావున ఇది ఒక ఛార్జ్ తో గరిష్టంగా 521 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని ARAI చేత ధృవీకరించబడింది. అయితే వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఎలాంటి రేంజ్ అందిస్తుంది అని తెలుసుకోవడానికి మాకు ఇంకా కొంత సమయం పడుతుంది.

ఎందుకంటే మేము ఈ ఎలక్ట్రిక్ SUV యొక్క రేంజ్ వాస్తవ ప్రపంచంలో ఇంకా టెస్ట్ చేయలేదు. ఆటో 3 ఎలక్ట్రిక్ SUV యొక్క ఎలక్ట్రిక్ మోటార్‌ 20.1.1 బిహెచ్‌పి పవర్ మరియు 310 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 7.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ వేగం దాని పరిమాణానికి చాలా ఎక్కువ అనే చెప్పాలి.

ఛార్జింగ్ విషయానికి వస్తే, BYD ATTO 3 ఎలక్ట్రిక్ కారు 80kW DC ఫాస్ట్ ఛార్జర్‌ ద్వారా 50 నిముషాల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు. దీన్ని బట్టి చూస్తే ఛార్జింగ్ పరంగా కూడా వాహన వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు. ఇది మొత్తం మూడు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్. ఈ మూడు డ్రైవింగ్ మోడ్స్ మధ్య పెద్దగా వ్యత్యాసం కనిపించదు.

పరిమాణం పరంగా BYD Atto 3 వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ SUV పొడవు 4,455 మిమీ, వెడల్పు 1,865 మిమీ, ఎత్తు 1,615 మిమీ, వీల్‌బేస్ 2,720 మిమీ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 175 మిమీ వరకు ఉంటుంది. BYD Atto 3 మంచి సస్పెన్షన్ సెటప్ కలిగి ఉండటం వల్ల ఎలాంటి రోడ్డులో అయినా సజావుగా ముందుకు దూసుకెళ్తుంది. ఏదేమైనా రిలాక్స్డ్ పద్దతిలో డ్రైవింగ్ చాలా ఉత్తమంగా ఉంటుంది.

అటో 3 ఎలక్ట్రిక్ SUV యొక్క నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. కావున బ్రేకింగ్ సిస్టం అద్భుతంగా ఉంటుంది. క్యాబిన్ లోపల NVH లెవెల్స్ కూడా ఉత్తమంగా ఉంటాయి. కావున బయట నుంచి ఎక్కువ శబ్దం లోపలి వచ్చే అవకాశం లేదు. ఎక్కువ వేగంలో కొంత శబ్దం రావడం మీరు ఇందులో గమనించవచ్చు. అయినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండే అవకాశం లేదు. మొత్తం మీద పర్ఫామెన్స్ మరియు డ్రైవింగ్ చాలా అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.

BYD Atto 3 పై మా అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో విడుదలైన BYD Atto 3 మంచి డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. అంతే కాకుండా ఒక ఛార్జ్ తో మంచి రేంజ్ అందిస్తుందని కూడా ద్రువీకరించబడింది. కావున ఇప్పటికీ ఈ SUV 1,500 బుకింగ్స్ పొందగలిగింది. అయితే భారదేశంలో ఈ ఎలక్ట్రిక్ SUV కోసం ఛార్జింగ్ మరియు డీలర్‌లు/సర్వీస్ సెంటర్‌లు రెండూ లేకపోవడంతో కొనుగోలుదారులను కొనుగోలు చేయడానికి కొంత ఆలోచిస్తున్నారు.

అయితే ఈ ఎలక్ట్రిక్ SUV డ్రైవ్ చేయాలనుకునే ఆసక్తికలిగిన కస్టమర్లు మాత్రం ఇవన్నీ లెక్క చేయకుండా ధైర్యంగా కొనుగోలు చేయడానికి ముండదు వేస్తున్నారు. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు భారతీయ మార్కెట్లో ఆశించిన స్థాయిలో మంచి అమ్మకాలు పొందాలంటే తప్పకుండా కంపెనీ దానికి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పకుండా కంపెనీ దీని గురించి కొంత ఆలోచించాలి.

Most Read Articles

English summary
Byd atto 3 first drive review design features and driving impressions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X