జెస్ట్ వర్సెస్ డిజైర్: ఎమ్‌టి సెడాన్ కార్ల మద్య ముదిరిన పోటి

Posted By:

ఆటో మేటిక్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ప్రస్తుతం ఏ కారు గురించి పలుకరించినా దీని సవ్వడే వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా మొదటి సారిగా టాటా మోటార్స్ వారు తమ జెస్ట్ డీజల్ సెడాన్ కారులో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. ఆ తరువాత ఈ మధ్యనే మారుతి సుజుకి వారు తమ బెస్ట్ సెల్లింగ్ సెడాన్ కారు అయిన డిజైర్ లో ఏఎమ్‌టి ఆప్షన్‌ను అందించారు.

దీనిని కూడా చదవండి: భారతీయ మార్కెట్లో టాప్ 20 బెస్ట్ సెల్లింగ్ కార్లు ఇవే...

అంటే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందిస్తున్న ఈ రెండు డీజల్ కార్ల మధ్య పోటి పెరిగిందన్నమాట. ఈ రెండింటిలో ఒక ఉత్తమ కారు ఎంపిక చేసుకోవడానికి పాఠకుల కోసం జెస్ట్ మరియు డిజైర్ కార్ల మధ్య గల తేడాలను క్రింది కథనంలో పోల్చడం జరిగింది.

ధర

ధర

 • మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఎఎమ్‌టి ధర రూ. 9.56 లక్షలు
 • టాటా జెస్ట్ ఎక్స్ఎమ్ఎ (డీజల్) ధర రూ. 8.37 లక్షలు
 • టాటా జెస్ట్ ఎక్స్‌టిఎ (డీజల్) ధర రూ. 9.29 లక్షలు

అన్ని ధరలు అందాసుగా ఆన్-రోడ్ ఢిల్లీగా ఇవ్వబడ్డాయి.

 స్విఫ్ట్ డిజైర్ డిజైన్

స్విఫ్ట్ డిజైర్ డిజైన్

స్విఫ్ట్ డిజైర్ డిజైన్ స్విప్ట్ హ్యాచ్‌బ్యాక్ మీద ఆధారపడి డిజైన్ చేశారు. వెనుక ఉన్న డిక్కీ డిజైన్ పరంగా బాగానే ఉన్నప్పటకీ ముందు వైపు డిజైన్ చాలా వరకు కామన్‌గా ఉంటుంది. కాని ఇప్పటికి దేశ వ్యాప్తంగా ఉన్న బెస్ట్ సెల్లింగ్ కార్లలో ఈ డిజైర్ సెడాన్ రెండవ స్థానంలో ఉంది.

టాటా జెస్ట్ డిజైన్

టాటా జెస్ట్ డిజైన్

టాటా మోటార్స్ వారి జెస్ట్ కారును ముందు నుండి చూస్తే అత్భుతమైన డిజైన్ కనబడుతుంది. టాటా మోటార్స్ వారు ఇప్పుడు మార్కెట్లోకి అందిస్తున్న కార్లకు చక్కటి డిజైన్ అందిస్తున్నారు. ఇక దీని వెనకున్న డిజైన్‌ను గమనిస్తే సాధారణంగా దర్శనం ఇస్తుంది.

స్విఫ్ట్ డిజైర్ ఇంజన్ వివరాలు

స్విఫ్ట్ డిజైర్ ఇంజన్ వివరాలు

స్విప్ట్ డిజైర్ కారులోని డీజల్ వెర్షన్ 1248 సీసీ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టర్భో ఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 74 బిహెచ్‌పి పవర్ మరియు 190 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 గేర్ బాక్స్ మరియు మైలేజ్

గేర్ బాక్స్ మరియు మైలేజ్

ఇందులో ఇంజన్ 5-స్పీడ్ ఆటో మేటెడ్ గేర్ బాక్స్‌తో అనుసంధానమై ఉంది. డిజైర్ లీటర్‌కు 26.5 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు.

టాటా జెస్ట్ ఇంజన్ వివరాలు

టాటా జెస్ట్ ఇంజన్ వివరాలు

టాటా మోటార్స్ వారు తమ జెస్ట్ కారును కేవలం డీజల్ ఇంజన్ వేరియంట్లో మాత్రమే అందిస్తున్నారు. ఇందులో 1248 సీసీ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 89 బిహెచ్‌‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును.

గేర్ బాక్స్ మరియు మైలేజ్

గేర్ బాక్స్ మరియు మైలేజ్

టాటా మోటార్స్ వారు జెస్ట్ కారులో 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను అందించారు. ఇందులో ఉన్న డీజల్ ఇంజన్ లీటర్‌కు 23 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు.

స్విఫ్ట్ డిజైర్ ఫీచర్లు

స్విఫ్ట్ డిజైర్ ఫీచర్లు

స్విఫ్ట్ డిజైర్ లోని జడ్‌డిఐ వేరియంట్ కారు ఈ ఫీచర్లను కలదు

 • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
 • స్టీరింగ్ వీల్ అడ్జెస్ట్‍‌మెంట్
 • డ్రైవర్ సీటు ఎత్తును సరిచేసుకునే అవకాశం
 • ఎలక్ట్రికల్ గా త్రిప్పగిలగే ప్రక్కటద్దాలు
ఆడియో సిస్టమ్

ఆడియో సిస్టమ్

 • మ్యూజిక్ సిస్టమ్
 • ఎయుఎక్స్,
 • బ్లూ టూత్
 • యుఎస్‌బి కనెక్టివిటి
 • ఫ్యాబ్రిక్ సీట్లు
 టాటా జెస్ట్ ఫీచర్లు

టాటా జెస్ట్ ఫీచర్లు

టాటా జెస్ట్‌లోని టాప్ ఎండ్ వేరియంట్ ఎక్స్‌టిఎ లోని ఫీచర్లు

 • ఆటేమేటిక్ క్లైమేట్ కంట్రోల్
 • అడ్జెస్టబుల్ స్టీరింగ్
 • పవర్ విండోస్
 • పార్కింగ్ సెన్సార్లు
 • ఎలక్ట్రికల్ గా త్రిప్పగిలగే ప్రక్కటద్దాలు
 • డ్రైవర్ సీటు ఎత్తును అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం
ఆడియో సిస్టమ్

ఆడియో సిస్టమ్

 • మ్యూజిక్ సిస్టమ్
 • ఎయుఎక్స్
 • బ్లూటూత్
 • యుఎస్‌బి కనెక్టివిటీ
 • వీటన్నింటిని స్టీరింగ్ వీల్ నుండి నియంత్రించే అవకాశం కల్పించారు.
 కొత్త లైటింగ్ సిస్టమ్

కొత్త లైటింగ్ సిస్టమ్

 • ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్
 • పగటి పూట వెలిగే లైట్లు
 • ఫాలో మి హోమ్ ల్యాంప్స్
 • ముందు మరియు వెనుకవైపున గల ఫాగ్ ల్యాంప్స్
స్విఫ్ట్ డిజైర్‌ జడ్‌‌డిఐ లోని భద్రత ఫీచర్లు

స్విఫ్ట్ డిజైర్‌ జడ్‌‌డిఐ లోని భద్రత ఫీచర్లు

 • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్)
 • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి)
 • డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్
 • ఇంజన్ ఇమ్మొబిలైజర్
 • సెంట్రల్ లాకింగ్
 • స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్
టాటా జెస్ట్‌ ఎక్స్‌టిఎ లోని భద్రత ఫీచర్లు

టాటా జెస్ట్‌ ఎక్స్‌టిఎ లోని భద్రత ఫీచర్లు

 • సెంట్రల్ లాకింగ్
 • ఇంజన్ ఇమ్మొబిలైజర్
 • స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్
 • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్)
 • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి)
 • డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్
తీర్పు:

తీర్పు:

ఫీచర్ల పరంగా టాటా జెస్ట్ లో స్విఫ్ట్ డిజైర్ లో గల ఫీచర్ల కన్నా ఎక్కువే ఉన్నాయి. మరియు డిజైర్ లో ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన డీజల్ ఇంజన్ జెస్ట్‌లో కలదు.

జపాన్ కు చెందిన మారుతి సుజుకి వారి స్విఫ్ట్ డిజైర్ కన్నా దేశీయ వాహన సంస్థ టాటా వారి జెస్ట్ కారు ఎంతో ఉత్తమమైనది. మరి మీరేమంటారు. మీ నిర్ణయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి.

టాటా జెస్ట్ వర్సెస్ మారుతి సుజుకి డిజైర్
English summary
Maruti Suzuki Swift Dzire AMT vs Tata Zest AMT Comparison

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark