కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

కాంపాక్ట్ ఎస్‌యూవీ.. ఇప్పుడు కారు కొనుగోలుదారులు ఎక్కువగా ఇష్టపడే సెగ్మెంట్ ఇది. ఒకప్పుడు మొదటిసారిగా కారు కొనుగోలు చేసే వారు తక్కువ ధర కలిగిన బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్‌లకే అధిక ప్రాధాన్యత ఇచ్చే వారు. అయితే, ఇప్పుడు వారి అభిప్రాయం మరియు అభిరుచి రెండూ మారిపోయాయి. కాస్తంత ధర ఎక్కువైనా పర్వాలేదు కొంటే అన్ని ఫీచర్లతో కూడిన సౌకర్యవంతమైన కాంపాక్ట్ ఎస్‌యూవీనే కొనాలనేది వారి వాదన. కస్టమర్ల అభిరుచికి తగినట్లుగానే కార్ కంపెనీలు కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో వివిధ రకాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఇప్పుడు ఈ విభాగంలో దేశంలోనే అత్యధిక డిమాండ్ కలిగిన విభాగంగా మారింది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో దాదాపు ప్రతి ఆటోమొబైల్ కంపెనీ కూడా ఒక ఉత్పత్తిని విక్రయిస్తోంది. ఈ విభాగంలో దక్షిణ కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ నుండి లభిస్తున్న ఏకైక మోడల్ హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue). ఇది తొలిసారిగా మే 2019లో భారత మార్కెట్లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారత మార్కెట్లో కాంపాక్ట్ ఎస్‌యూవీలు అత్యధికంగా డిమాండ్ ఉండేది. వెన్యూ రాకతో ఈ విభాగంలో పోటీ మరింత బలంగా మారింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్ విపరీతంగా అభివృద్ధి చెందడం ప్రారంభించింది మరియు హ్యుందాయ్ వెన్యూ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యుందాయ్ కార్లలో ఒకటిగా మారింది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

వెన్యూ కారు సాధించిన విజయం కారణంగానే హ్యుందాయ్ అనేక సార్లు 'టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ బ్రాండ్స్' జాబితాలో నిలిచింది. హ్యుందాయ్ మార్కెట్లోకి వచ్చిన మూడేళ్ల కాలంలోనే మూడు లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఒక్క భారతదేశంలోనే 2.5 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. మిగిలిన 50,000 యూనిట్లు విదేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. ఈ విజయాన్ని ఇలానే కొనసాగించేందుకు హ్యుందాయ్ ఇప్పుడు కొత్త 2022 మోడల్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

కేవలం రూ. 7.53 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతోనే మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఇటీవలే మా డ్రైవ్‌స్పార్క్ బృందం టెస్ట్ డ్రైవ్ చేయడం జరిగింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ కొత్త డిజైన్ మరియు స్టైలింగ్ తో పాటుగా అనేక కొత్త ఫీచర్లను కూడా కలిగి ఉంది. అయితే, ఈ కొత్త ఫీచర్లు పెద్ద మార్పును తీసుకువచ్చాయా? మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి మేము ఈ కారుని హైదరాబాద్‌లో టెస్ట్ డ్రైవ్ చేశాము. ఈ కారుకి సంబంధించి పూర్తి రివ్యూని ఈ కథనంలో చూద్దాం రండి.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

2022 హ్యుందాయ్ వెన్యూ - డిజైన్ మరియు శైలి

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూలో ఎక్కువగా మార్పులు జరిగింది ఈ విషయంలోనే. ఫ్రంట్, సైడ్స్, రియర్ మరియు ఇంటీరియర్ డిజైన్‌లో చేసిన మార్పుల కారణంగా ఇది చాలా రిఫ్రెష్డ్ గా కనిపిస్తుంది. వెన్యూ ఓవరాల్ డిజైన్ సిల్హౌట్‌లో పెద్దగా మార్పు ఉండదు, ఇది బాక్సీ టైప్ లో ఉంటుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొత్తగా చేసిన డిజైన్ మార్పులు చాలా సరళంగానే ఉంటాయి. అయినప్పటికీ, అవి భారీ ప్రభావాన్ని చూపాయి మరియు హ్యుందాయ్ వెన్యూ పాత మోడల్‌తో పోలిస్తే చాలా భిన్నంగా కనిపిస్తుంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

కొత్త హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ రిఫ్రెష్ చేయబడిన ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది, ఇందుకు ప్రధాన కారణం దానిలోని రిఫ్రెష్డ్ ఫ్రంట్ గ్రిల్ డిజైన్. హ్యుందాయ్ దీనిని 'పారామెట్రిక్ జ్యువెల్ గ్రిల్' అని పిలుస్తోంది. ఈ విశాలమైన గ్రిల్, ప్రత్యేకించి మీరు చాలా తక్కువగా ఉన్న బ్లింగ్‌ను ఇష్టపడే వారైతే మీకు అద్భుతంగా కనిపిస్తుంది. ఈ గ్రిల్ డార్క్ క్రోమ్ ఇన్‌సర్ట్‌లను పొందుతుంది మరియు ఇది కారుకి మంచి ఫ్యాన్సీ లుక్‌ని తెచ్చిపెడుతుంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

హెడ్‌ల్యాంప్ డిజైన్‌లో పెద్దగా మార్పు లేదు, ఇది ఇప్పటికీ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ ఫీచర్‌నే పొందుతుంది. అయితే, ఈ ఫ్రంట్‌లో కూడా కొన్ని చిన్నపాటి మార్పులు ఉన్నాయి. స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ ఎగువ భాగం ఇప్పుడు మందంగా మరియు మరింత పొడవుగా ఉంటుంది. ఫలితంగా, ఇది ఇప్పుడు గ్రిల్ ఎలిమెంట్‌కు కనెక్ట్ చేయబడినట్లుగా కనిపిస్తుంది. స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ దిగువ సగభాగం కూడా కొద్దిగా రిఫ్రెష్ చేయబడింది. అయితే, దాని డిజైన్ మాత్రం అలాగే ఉంటుంది. క్రోమ్ సరౌండ్‌లు ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో భర్తీ చేయబడి ఉంటాయి.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

కొత్త వెన్యూలోని హెడ్‌ల్యాంప్ సెటప్ ఇప్పుడు లో బీమ్ మరియు హై బీమ్‌లను నిర్వహించడానికి ఎల్ఈడి ప్రొజెక్టర్ మరియు రిఫ్లెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కూడా కలిగి ఉంటుంది. ఇకపోతే, ఫ్రంట్ బంపర్ కూడా రీడిజైన్ చేయబడి ఉంటుంది మరియు ఇప్పుడు దాని హారిజాంటల్ లైన్స్ మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్‌తో చాలా సరళంగా కనిపిస్తుంది. స్కిడ్ ప్లేట్ చివరలు నలుపు రంగులో ఫినిష్ చేయబడి ఉంటాయి మరియు ఇది సైడ్ ప్రొఫైల్‌లో బాడీ క్లాడింగ్‌ను కలిగి ఉన్నట్లు కనిపించేలా చేస్తుంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

ఇందులో పాత టర్బైన్-స్టైల్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ ఇప్పుడు ప్రీమియం మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్‌తో భర్తీ చేయబడ్డాయి. అవి కారు యొక్క మొత్తం డిజైన్ మరియు స్టైలింగ్‌ను మరింత మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా, ఇవి వెన్యూని వాస్తవంగా కంటే కొంచెం పెద్దదిగా కనిపించేలా చేస్తుంది. వెనుక వైపున, కొత్త హ్యుందాయ్ వెన్యూ ప్రీమియం అప్పీల్‌ను సరికొత్త స్థాయికి తీసుకెళ్లేలా కనెక్ట్ చేయబడిన టెయిల్ ల్యాంప్‌ సెటప్ ఉంటుంది. వెనుక బంపర్ కూడా రీడిజైన్ చేయబడింది మరియు ముందు బంపర్‌ మాదిరిగానే హారిజాంటల్ లైన్స్ ని కలిగి ఉంటుంది. పై భాగంలో షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు రూఫ్ రెయుల్స్ ఉంటాయి.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

2022 హ్యుందాయ్ వెన్యూ - కాక్‌పిట్ మరియు ఇంటీరియర్

హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ మోడల్ యొక్క క్రోమ్ డోర్ హ్యాండిల్‌ను పట్టుకొని డోర్ ఓపెన్ చేయగానే, కొత్త డ్యూయల్-టోన్ బ్లాక్ అండ్ ఐవరీ థీమ్‌తో ఫినిష్ చేయబడిన ఇంటీరియర్ క్యాబిన్ మీకు స్వాగతం పలుకుతుంది. కొత్త డ్యూయల్-టోన్ థీమ్ పాత సింగిల్-టోన్ గ్రే థీమ్‌ను భర్తీ చేస్తుంది కాబట్టి కారు లోపల అనుభూతి కొత్తగా అనిపిస్తుంది మరియు ఎలివేట్ చేయబడినట్లుగా ఉంటుంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

కొత్త వెన్యూ 2022 మోడల్ లో క్యాబిన్ లేఅవుట్ పరంగా అయితే పెద్దగా ఏమీ మారలేదు. అయితే అక్కడక్కకా కొన్ని మార్పులు చేయబడ్డాయి. డ్రైవర్ ముందు భాగంలో మౌంటెడ్ కంట్రోల్‌లతో కూడిన ప్రీమియం ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. దాని వెనుక భాగంలో ఫుల్ కలర్ TFT MIDతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. ఇది డ్రైవర్ ఉపయోగించుకోవడానికి చాలా రకాల సమాచారాన్ని ప్రదర్శిస్తుంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

డాష్‌బోర్డ్‌లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ దాని 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్. ఇది వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఫీచర్‌లను కలిగి ఉంటుంది. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కి మీ స్మార్ట్‌ఫోన్‌ను జత చేయడం చాలా సులువుగా ఉంటుంది మరియు ఒక్కసారి కనెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా మీరు కారులోకి ప్రవేశించిన ప్రతిసారి రీకనెక్ట్ అవుతుంది. అయితే, ఇక్కడ నిరాశపరచే విషయం ఏంటంటే, హ్యుందాయ్ వెన్యూ లాంటి పెద్ద కారుకి ఈ 8 ఇంచ్ డిస్‌ప్లే యూనిట్ చాలా చిన్నదిగా అనిపిస్తుందనేది మా అభిప్రాయం.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

ఇదివరకటి హ్యుందాయ్ వెన్యూ కారులో ఆఫర్ చేసిన అనేక రకాల ఫీచర్లను ఈ కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ కారులో కూడా చూడొచ్చు. వీటిలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ మొదలైనవి చాలానే ఉన్నాయి. అయితే, ఇందులో వైవిధ్యాన్ని కలిగించే కొన్ని కొత్త ఫీచర్లు కూడా ఉన్నాయి. వాటిలో మొదటిది పవర్డ్ డ్రైవర్ సీటు. ఈ ఫీచర్ డ్రైవర్ ప్రయాణాన్ని ఎంతో సౌకర్యవంతంగా మారుస్తుంది. సుదీర్ఘప్రయాణాలను కూడా సునాయాసంగా చేరుకునేందుకు సహకరిస్తుంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

కొత్త హ్యుందాయ్ వెన్యూలో ఆటోమేటిక్ ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్ మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫీచర్ల పరంగా, అలెక్సా మరియు గూగుల్ అసిస్టెంట్ డివైజ్‌ల సపోర్ట్‌ను కోల్పోవడం కొంచెం ఇబ్బందిగా అనిపి్సతుంది. అయితే, హ్యుందాయ్ వెన్యూ వాయిస్ కమాండ్స్ ఫీచర్ ఉంది, దీని సాయంతో మీరు మీ హ్యుందాయ్ కారుకి ఆదేశాలను ఇవ్వవచ్చు. హ్యుందాయ్ బ్లూలింక్ సాఫ్ట్‌వేర్‌ను కూడా అప్‌డేట్ చేసింది మరియు ఇది ఇప్పుడు 60కి పైగా కనెక్టింగ్ ఫీచర్లను అందిస్తుంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

2022 హ్యుందాయ్ వెన్యూ - కంఫర్ట్, ప్రాక్టికాలిటీ మరియు బూట్ స్పేస్

ఈ విషయాలలో హ్యుందాయ్ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. హ్యుందాయ్ ఎల్లప్పుడూ సౌకర్యవంతమైన మరియు ఆచరణాత్మక కార్లను తయారు చేస్తుంది. వెన్యూ, పరిమాణంలో సాపేక్షంగా చిన్నదే అయినప్పటికీ, భారతదేశంలో హ్యుందాయ్ రిటైల్ చేసే అత్యంత ఆచరణాత్మక కార్లలో ఇది కూడా ఒకటి. ఈ కారులోని సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి మరియు పవర్డ్ డ్రైవర్ సీట్ ఇందులో చాలా సౌకర్యంగా ఉంటుంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

కారులోని ఎయిర్ కండిషనింగ్ చాలా శక్తివంతమైనది మరియు ప్రస్తుత వాతావరణానికి చాలా అవసరమైనది. ఇది క్యాబిన్‌ మొత్తాన్ని చాలా త్వరగా చల్లబరుస్తుంది. కొత్త సీటు కారణంగా వెనుక భాగంలో కంఫర్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వెనుక సీటులో మొదటి సారిగా సెగ్మెంట్-ఫస్ట్ 2-స్టెప్ రిక్లైన్ ఫీచర్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఇది వెనుక ప్రయాణీకులకు సౌకర్యాన్ని గరిష్ట స్థాయికి తీసుకువెళ్తుంది. కారులోని సీట్లు చాలా సపోర్టివ్‌గా ఉన్నాయి మరియు హెడ్‌రూమ్, లెగ్ రూమ్ మరియు క్నీ రూమ్ చాలా పుష్కలంగా ఉంటుంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

హ్యుందాయ్ వెన్యూ ప్రాక్టికాలిటీ కూడా చాలా బాగుంది. కారు లోపల ముందువైపు ఉన్న గ్లోవ్‌బాక్స్ చాలా లోతుగా ఉండటమే కాకుండా కూలింగ్ ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో మీరు వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ కూడా పొందుతారు, దీని సాయంతో మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లను వైర్లు అవసరం లేకుండానే చార్జ్ చేసుకోవచ్చు. డోర్ పాకెట్స్ కూడా మంచి స్టోరేజ్ స్థలాన్ని కలిగి ఉంటాయి. ఇక అసలు విషయమైన బూట్ స్పేస్‌ను గమనిస్తే, ఈ కారులో 350 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఎక్కువ స్టోరేజ్ కోరుకునే వారు వెనుక సీట్లను మడచుకోవచ్చు.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

2022 హ్యుందాయ్ వెన్యూ - ఇంజన్ పనితీరు మరియు డ్రైవింగ్ ఇంప్రెషన్‌లు

హ్యుందాయ్ వెన్యూ 2022 మోడల్ లో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. కాబట్టి దాని పనితీరులో కూడా పెద్దగా మార్పులు లేవు. హ్యుందాయ్ వెన్యూ వివిధ రకాల పవర్‌ట్రెయిన్ కాంబినేషన్‌లతో అందుబాటులో ఉంటుంది. మేము పరీక్షించిన కారులో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ అమర్చబడి ఉంది. మేము iMT మరియు DCT గేర్‌బాక్స్‌లు కలిగిన రెండు రకాల వేరియంట్లను నడిపి చూశాము మరియు అవి మునుపటిలాగా డ్రైవ్ చేయడానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

హ్యుందాయ్ వెన్యూలోని ఈ ప్రతక్యేకమైన 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఎల్లప్పుడూ ఒక పెప్పీ ఇంజన్ మరియు డ్రైవ్ చేయడానికి చాలా సరదాగా ఉంటుంది. ఇందులో ఎటువంటి టర్బో లాగ్ లేదు మరియు గరిష్టమైన పనితీరు అందుబాటులో ఉంటుంది. అయితే, ఇది అధిక ఇంజన్ వేగంతో కొద్దిగా శబ్దం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది త్రీ-సిలిండర్ యూనిట్ కాబట్టి శబ్ధం చేయడం దీని స్వాభావిక లక్షణాలలో ఒకటి. ఈ కారులోని DCT (డ్యూయెల్ క్లచ్ ట్రాన్సిమిషన్) ఆటోమేటికే గేర్‌బాక్స్ చాలా వేగంగా ఉంటుంది మరియు గేర్‌లను సజావుగా మారుస్తుంది. ఇందులో కొత్త పాడిల్ షిఫ్టర్‌లను ఉపయోగించడం చాలా సులభంగా అనిపిస్తుంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

ఇక iMT (ఇంటెలిజెంట్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్ ఆప్షన్ విషయానికి వస్తే, ఇదొక క్లచ్ రహిత మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ప్రస్తుత కార్లలో AMT (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) మాదిరిగానే ఉంటుంది. ఒకవేళ మీరు చాలా కాలంగా మాన్యువల్ గేర్‌బాక్స్‌లను నడుపుతుండి, ఒక్కసారిగా iMT కి మారినట్లయితే, దీని జీవన విధానాన్ని అలవాటు చేసుకోవడానికి మీకు కొంత సమయం పడుతుంది. ఇందులో గేర్ షిఫ్టులు మృదువైనవిగా ఉంటాయి మరియు సౌకర్యవంతమైన రైడ్‌ను అందిస్తాయి.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూలో మృదువైన రైడ్ ను అందించడానికి కంపెనీ దీని సస్పెన్షన్ సెటప్ ను కొద్దిగా సర్దుబాటు చేసింది. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు గతుకుల రోడ్లపై గట్టిగా పనిచేస్తుంది. హై-స్పీడ్ వద్ద కుదుపులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాకుండా, కొత్త సస్పెన్షన్ సెటప్ బాడీ రోల్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడింది. ఈ సస్పెన్షన్ సెటప్ నిజానికి మునుపటి మోడల్ కన్నా అద్భుతంగా ఉంది.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

స్టీరింగ్ వీల్ గ్రిప్ బాగుంది మరియు అన్ని కంట్రోల్స్ తో ఇది ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. స్టీరింగ్ వీల్ తేలికైనదిగా ఉంటుంది మరియు తక్కువ వేగంతో ట్రిక్స్ చేయడం సులభంగా ఉంటుంది. అయితే, అధిక వేగంతో కూడా ఇది మంచి బరువును కలిగి ఉంటుంది. ఇది డ్రైవర్‌కు మంచి మొత్తంలో ఫీడ్‌బ్యాక్‌ను అందజేస్తుంది మరియు కార్నరింగ్ చేసేటప్పుడు ఈ విషయాన్ని ఎక్కువగా అనుభూతి చెందవచ్చు.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

చివరిగా ఇందులోని బ్రేక్ ల గురించి చెప్పుకోవాలి. ఈ కారులోని బ్రేక్‌లు చాలా అద్భుతమైనవి మరియు ఇక్కడ ఎటువంటి ఫిర్యాదులకు స్థలం లేదు. ఓవరాల్‌గా, కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడం కొనసాగిస్తూనే ఉందని చెప్పాలి.

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

2022 హ్యుందాయ్ వెన్యూ - సేఫ్టీ మరియు ముఖ్య ఫీచర్లు

హ్యుందాయ్ వెన్యూ మొదటి సారిగా మార్కెట్లో ప్రారంభించబడినప్పుడు, ఈ బుజ్జి ఎస్‌యూవీ కొన్ని ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్‌లతో అందుబాటులోకి వచ్చి. ఇప్పుడు, కొత్త 2022 వెన్యూ ఫీచర్ల జాబితాలోకి మరిన్ని కొత్తవి జోడించబడ్డాయి.

2022 హ్యుందాయ్ వెన్యూ సేఫ్టీ ఫీచర్లు:

- ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు

- డైనమిక్ గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్ పార్క్ అసిస్ట్ కెమెరా

- కార్నరింగ్ హెడ్‌ల్యాంప్‌లు

- ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు

- వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్

- హిల్ అసిస్ట్ కంట్రోల్

- ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్

- టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

2022 హ్యుందాయ్ వెన్యూలో ప్రధానమైన ఫీచర్లు:

- LED లైటింగ్

- యాంబియెంట్ లైటింగ్

- స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్

- 8.0 ఇంచ్ టచ్‌స్క్రీన్

- యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో

- కలర్ MIDతో కూడిన డిజిటల్ క్లస్టర్

- బహుళ డ్రైవ్ మోడ్‌లు

- స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్

- పవర్డ్ డ్రైవర్ సీట్

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

2022 హ్యుందాయ్ వెన్యూ కలర్ ఆప్సన్స్

- టైఫూన్ సిల్వర్

- టైటాన్ గ్రే

- డెనిమ్ బ్లూ

- ఫాంటమ్ బ్లాక్

- పోలార్ వైట్

- ఫైరీ రెడ్

- ఫైరీ రెడ్ విత్ ఫాంటమ్ బ్లాక్ రూఫ్

కొత్త 2022 హ్యుందాయ్ వెన్యూ టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. పాత మోడల్‌కి దీనికి మధ్య పెద్ద తేడా ఏంటంటే..?

చివరిగా ఏం చెబుతారు?

హ్యుందాయ్ వెన్యూ ఈ కొరియన్ బ్రాండ్‌కు భారత మార్కెట్లో చాలా చక్కగా పనిచేసిన కార్లలో ఒకటి. వెన్యూని ఇప్పటి వరకూ చాలా మంది కస్టమర్లు ఆదరించారు మరియు ఇంకా ఆదరిస్తూనే ఉన్నారు. కాబట్టి, కొత్తగా వచ్చిన ఈ 2022 మోడల్ కూడా దాని రిఫ్రెష్డ్ డిజైన్, ఫీచర్లు, ప్రాక్టికాలిటీ, కంఫర్ట్ మరియు డ్రైవింగ్ వంటి అంశాలలో ఇది కొత్త డ్రైవర్లు మరియు అనువజ్ఞులను కూడా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇది నేను చెప్పడం కాదు, ఓసారి మీరు కూడా అనుభూతి చెందాల్సిందే. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడే కొత్త హ్యుందాయ్ వెన్యూ 2022 మోడల్‌ని టెస్ట్ డ్రైవ్ చేసి రండి..!

Most Read Articles

English summary
New 2022 hyundai venue test drive review design features comfort driving impressions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X