2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

జాగ్వార్ - బ్రిటన్‌కు చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం ఇండియన్ మార్కెట్లోకి జాగ్వార్ ఎక్స్ఇ ఎంట్రీ-లెవల్ సెడాన్ కారును 2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పో సమయంలో పరిచయం చేసింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత జాగ్వార్ ఎక్స్ఇ స్పోర్ట్స్ సెడాన్ కారుకు పలు లగ్జరీ ఎలిమెంట్లను జోడించి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో రీలాంచ్ చేసింది.

సరికొత్త 2020 జాగ్వార్ ఎక్స్ఇ కారులో డిజైన్ మరియు ఫీచర్ల పరంగా ఎన్నో మార్పులు జరిగాయి. సాంకేతికంగా జాగ్వార్ ఎక్స్ఇ బానెట్ కింద బిఎస్-6 వెర్షన్ లేటెస్ట్ ఇంజన్ కూడా వచ్చింది.

2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

2020 జాగ్వార్ ఎక్స్ఇ కారును టెస్ట్ డ్రైవ్ చేసే అవకాశం డ్రైవ్‌స్పార్క్ తెలుగు టీమ్‌కు లభించింది. పాత మోడల్‌తో పోల్చుకుంటే డ్రైవింగ్ పర్ఫామెన్స్, హ్యాడ్లింగ్ మరియు ఓవరాల్ కార్ ప్యాకేజీ పరంగా చూసుకుంటే మార్కెట్లో ఉన్న జర్మన్ బ్రాండ్స్ బిఎమ్‌డబ్ల్యూ, మెర్సిడెస్-బెంజ్ మరియు ఆడీ మోడళ్లతో పోటీ పడుతుందో లేదే ఇవాళ్టి రివ్యూలో చూద్దాం రండి..

2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

డిజైన్ & స్టైలింగ్

జాగ్వార్ ఎక్స్ఇ నిజానికి ఇండియన్ లగ్జరీ సెడాన్ కార్లలోకెల్లా బెస్ట్-లుకింగ్ కార్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ మరియు రియర్ డిజైన్‌లో పలు గుర్తించదగిన మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త మార్పలతో జాగ్వార్ ఎక్స్ఇ మరింత స్పోర్టివ్‌గా కనబడుతోంది.

2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

ఫ్రంట్ డిజైన్‌తో స్టార్ట్ చేస్తే, మెయిన్ హెడ్ ల్యాంప్‌తో కూడిన అత్యంత పలుచటి స్లిమ్ హెడ్ ల్యాంప్స్ సెట్, ఇంటిగ్రేటెడ్ J-ఆకారంలో ఉన్న డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్ వచ్చాయి. ఇవి డైనమిక్ టర్న్ ఇండికేటర్స్‌లా పనిచేస్తాయి. విశాలమైన ఫ్రంట్ గ్రిల్ మధ్యలో ఉన్న జాగ్వార్ లోగో ఎంతో అట్రాక్టివ్‌గా ఉన్నాయి.

2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

సైడ్ డిజైన్ విషయానికి వస్తే, చూడటానికి 2016 వెర్షన్ స్టైల్లోనే ఉంది. కొత్త డిజైన్ చేసిన 17-ఇంచుల అల్లాయ్ వీల్స్ స్టాండర్డ్‌గా లభిస్తున్నాయి. షోల్డర్ లైన్స్ మరియు క్రీస్ లైన్స్ ఈ లగ్జరీ సెడాన్‌‌కు స్పోర్టివ్ తత్వాన్ని పెంచాయి.

2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

రియర్ డిజైన్ చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ, 2020 మోడల్‌లో కొన్ని మార్పులు జరిగాయి. రీ-డిజైన్ చేసిన ఎల్ఈడీ టెయిల్ లైట్లు, అప్‌డేటెడ్ బంపర్లు, బంపర్ క్రింది భాగంలో ఎయిర్ ఢిఫ్యూజర్ వచ్చాయి.

2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్‌లో మోడల్ పేరు, ఇంజన్ టైప్ మరియు పవర్ ఔట్‌పుట్ వంటి వివరాలను కారుకు ఎడమవైపు క్రోమ్ ఫినిషింగ్ అక్షరాలతో ఇచ్చారు. మేము టెస్ట్ డ్రైవ్ చేసిన మోడల్ "P250 SE", ఇందులో ఎస్ఇ వేరియంట్ పేరు మరియు P250 అంటే 250బిహెచ్‌పి పవర్ అని అర్థం.

2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

ఇంటీరియర్

జాగ్వార్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్ ఇంటీరియర్‌లో కీలక మార్పులు జరిగాయి. ఇంటీరియర్‌లోకి వెళ్లగానికి లగ్జరీ స్టైలింగ్స్, ఎలిమెంట్స్ మరియు ఫీచర్లు స్వాగతం పలుకుతాయి. మునుపటి మోడల్‌తో పోల్చితే లగ్జరీ టచెస్ బాగానే పెరిగాయి. లగ్జరీ ఫీలింగ్ పెంచేందుకు జాగ్వార్ టీమ్ తీవ్రంగా శ్రమించిందని చెప్పాలి.

2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

2020 జాగ్వార్ ఎక్స్ఇ క్యాబిన్ పూర్తిగా కొత్తగా మారిపోయింది. క్యాబిన్ లేఔట్ మరియు ఇంటీరియర్ మెటీరియల్స్ క్వాలిటీ అంశాల మరింత మెరుగయ్యాయి. డ్రైవర్ సీట్లోకి వెళితే, స్లిమ్ముగా, లైట్ వెయిట్‌తో అప్‌డేట్ చేసిన స్టీరింగ్ వీల్, దీని మీద ఇతర లగ్జరీ కార్లలో చూసినటువంటి టచ్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ వచ్చింది.

2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

స్టీరింగ్ వీల్ చుట్టూ ప్రీమియం లెథర్ ఫినిషింగ్ అందించారు. మధ్యలో సిల్వర్ కలర్ హైలెట్స్ చూడొచ్చు. స్టీరింగ్ వీల్ వెనకాలే ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ రకరకాల ఫంక్షన్లు మరియు మల్టిఫుల్ ఇన్ఫర్మేషన్ డ్రైవర్‌కు ఎంతగానో సహకరిస్తుంది.

2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

పక్కనే ఉన్న సెంటర్ కన్సోల్ దగ్గరకు వస్తే, 2020 జాగ్వార్ ఎక్స్ఇలో రెండు డిజిటల్ డిస్ల్పేలు ఉన్నాయి. పైనున్న స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కోసం అయితే కిందనున్న స్క్రీన్ క్లైమేట్ కంట్రోల్స్ కోసం పనిచేస్తుంది. అదే విధంగా ఫ్యాన్ స్పీడ్ మరియు క్యాబిన్ ఉష్ణోగ్రతలు కంట్రోల్ చేసేందుకు రోటరీ నాబ్ క్లైమేట్ కంట్రోలర్ కూడా ఉంది.

2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

2020 జాగ్వార్ ఇక్స్ఎల్ కారులో వచ్చిన మరో ముఖ్యమైన అప్‌డేట్, పిస్టల్-గ్రిప్ గేర్ లీవల్. ఇది మునుపటి పాప్-అప్ రోటరీ గేర్‌నాబ్ స్థానాన్ని భర్తీ చేసింది. గేర్ రాడ్ ఇప్పుడు మరింత స్లిమ్‌‌గా మారిపోయింది, క్యాబిన్ ఇంటీరియర్‌‌కు చక్కటి లగ్జరీ ఫీల్ తెప్పించింది. నార్మల్, ఇకో మరియు స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్స్‌లో కారును డ్రైవ్ చేయొచ్చు, ఇందుకోసం సెంటర్ కన్సోల్ మీద రోటరీ నాబ్ ద్వారా మోడ్స్ సెలక్ట్ చేసుకోవచ్చు. గేర్ లీవర్ పక్కనే ఇంజన్ స్టార్ట్/స్టాప్ చేసే పుష్-బటన్ అందించారు.

2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

సీటింగ్ మరియు రియల్ ఫీలింగ్ విషయానికి వస్తే, ఇక్కడ కూడా పలు అప్‌డేట్స్ జరిగాయి. అన్ని సీట్లను లెథర్ అప్‌హోల్‌స్ట్రేతో ఫినిష్ చేశారు. సీటింగ్ కంఫర్ట్ విషయంలో ఈ లెథర్ కీలక పాత్ర పోషిస్తుంది. కాళ్లు మరియు తల ప్రదేశంలో చక్కటి స్పేస్‌‌తో పాటు కూర్చున్నపుడు తొడలకు సీటుకు మధ్య మంచి సపోర్ట్ అందించారు.

2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లను ఎలక్ట్రిక్ పవర్ ద్వారా సుమారు 10-రకాలుగా అడ్జెస్ట్ చేసుకోవచ్చు. టాప్ ఎండ్ వేరియంట్లో డ్రైవర్ మరియు ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లకు అందించిన హ్యాండ్ సపోర్టర్ (లంబార్)ను 4-మార్గాలలో ఎలక్ట్రిక్ పవర్‌తో అడ్జెస్ట్ చేసుకోవచ్చు.

2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

వెనుక వరుస సీట్ల విషయానికి వస్తే, జాగ్వార్ ఎక్స్ఇ అద్భుతమైన కంఫర్ట్ అందించింది. సీట్ల కుషనింగ్, హెడ్ రూమ్, లెగ్ రూమ్ మరియు అండర్-థై సపోర్ట్ వంటివి చక్కగా అందివ్వడం జరిగింది. సెంట్రల్ ఆర్మ్ రెస్ట్ అదనపు సౌకర్యాన్ని కల్పించింది.

2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్‌లో కప్-హోల్డర్స్ చాలా ప్రదేశాల్లో అందించారు. డోర్ ప్యానల్స్‌లో పెద్ద వాటర్ బాటిళ్లు సులభంగా ఇమిడిపోతాయి. సెంటర్ కన్సోల్ మరియు సెంట్రల్ ఆర్మ్ రెస్ట్ మీద కప్ హోల్డర్స్ వచ్చాయి. ఫ్రంట్ సీట్లకు వెనుక వైపు మరియు సెంట్రల్ ఆర్మ్ రెస్ట్ కింది వైపున గ్లోవ్ బాక్సులు కూడా ఉన్నాయి.

2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

చివరగా స్టోరేజ్ స్పేస్ విషయానికి వస్తే, సరికొత్త 2020 జాగ్వార్ ఎక్స్ఇలో 455-లీటర్ల లగేజీ స్పేస్ కలదు. ఈ సెడాన్‌లో రియర్ సీట్లను పూర్తిగా మడిపేయవచ్చు. దీంతో లగేజీ స్పేస్ మరింత పెరుగుంది. జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్ కొలతలు ఉన్నాయి.

Length (mm) 4691
Width (mm) 2075
Height (mm) 1416
Wheelbase (mm) 2835
Boot Space (Litres) 455
2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

వేరియంట్లు, ఫీచర్లు మరియు సేఫ్టీ

2020 జాగ్వార్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్ కారులో ఎన్నో అదనపు కంఫర్ట్, సేఫ్టీ మరియు ఇంటీరియర్ ఫీచర్లు కొత్తగా పరిచయం అయ్యాయి. సరికొత్త జాగ్వార్ ఎక్స్ఇలో వచ్చిన కొన్ని కంఫర్ట్ మరియు కన్వీనియెన్స్ ఫీచర్లు..

2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు
 • సిగ్నేచర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ జోడింపుతో వచ్చిన ప్రీమియం ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్
 • రెయిన్ సెన్సింగ్ విండ్ స్క్రీన్ వైపర్లు
 • ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ మరియు ఫోల్డ్ చేసుకునే సౌకర్యం గల సైడ్ మిర్రర్లు
 • పడిల్ ల్యాంప్స్
 • హీటెడ్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్లు
 • 17-ఇంచుల అల్లాయ్ వీల్స్
 • పానరొమిక్ సన్‌రూఫ్
 • కీలెస్ ఎంట్రీ
 • 10-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
 • ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్ సపోర్ట్
 • డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్
 • 10-దిశలలో ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే ఫ్రంట్ సీట్లు
 • డ్రైవర్ కోసం మెమోరీ సీట్లు
 • ఇంటరాక్టివ్ డ్రైవర్ డిస్ల్పే
 • వైర్ లెస్ ఛార్జింగ్
 • 2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

  2020 జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్‌లోని సేఫ్టీ ఫీచర్లు

  • ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్
  • ఆరు ఎయిర్ బ్యాగులు
  • ప్యాసివ్ ఫ్రంట్ హెడ్ రిస్ట్రైన్స్
  • ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్లు
  • పెడస్ట్రేన్ కాంటాక్ట్ సెన్సింగ్
  • ఆల్ సర్ఫేస్ ప్రొగ్రెస్ కంట్రోల్
  • హిల్-లాంచ్ అసిస్ట్
  • డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్
  • ట్రాక్షన్ కంట్రోల్
  • క్రూయిజ్ కంట్రోల్
  • ఇంటెలిజెంట్ స్టాప్/స్టార్ట్
  • 2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

   ఇంజన్ పర్ఫామెన్స్ మరియు డ్రైవింగ్ అనుభవం

   2020 జాగ్వార్ ఎక్స్ఇ రెండు ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. అవి 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.0-లీటర్ డీజల్. మేము టెస్ట్ డ్రైవ్ చేసిన వేరియంట్లో 2.0-లీటర్ కెపాసిటీ గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ వచ్చింది. 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 247బిహెచ్‌పి పవర్ మరియు 365ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

   2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

   2020 జాగ్వార్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడితే, అన్ని సందర్బాల్లో వీలైనంత ఎక్కువ పవర్‌నిచ్చింది. సిటీ లేదా హైవే ఏ మార్గాన్ని ఎంచుకున్నా అన్ని యాంగిల్స్ నుండి సౌకర్యవంతమైన డ్రైవ్ మరియు బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ఇంజన్ రెస్పాన్స్ కూడా చాలా స్మూత్‌గా ఉంది.

   రోడ్డు తీరును బట్టి డ్రైవింగ్ స్పీడ్ చాలా వరకు తగ్గుతూ.. పెరుగుతూ ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో అవసరానికి తగ్గ పవర్ డెలివరీ చేస్తూ ఏ మాత్రం నిరుత్సాహపరచు. మలుపుల్లో మంచి రోడ్ గ్రిప్ మరియు అద్బుతమైన హ్యాండ్లింగ్ లక్షణాలు కలిగి ఉంది, డ్రైవింగ్ చేస్తున్నపుడు మన డ్రైవింగ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.

   2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

   స్టీరింగ్ వీల్ రెస్పాన్స్‌కు కచ్చితంగా ఫిదా అయిపోతారు, ఎలాంటి కఠినమైన మలుపునైనా అత్యంత సునాయసంగా అధిగమించడంలో ఈ స్టీరింగ్ వీల్ అద్భుతమైన పనితీరు కనబరిచింది. యాక్సిలరేషన్ పెంచినపుడు, వెనువంటనే కారును అటు ఇటు మళ్లిస్తున్నపుడు కూడా అద్భుతంగా పనిచేసింది.

   ప్రారంభంలో ఇంజన్ కాస్త ఇబ్బందిపడుతున్నట్లు అనిపిస్తుంది, కానీ ఒక్కసారి స్పీడ్ అందుకుంటే ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా దూసుకెళ్తుంది.

   2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

   కారును స్పోర్డ్ మోడ్‌లో డ్రైవ్ చేస్తున్నపుడు 8-స్పీడ్ గేర్‌బాక్స్ అంతగా సహకరించలేదు, గేర్‌-షిప్టర్ కూడా కాస్త ఇబ్బందికరంగానే అనిపించింది. ఇంజన్ ల్యాగ్ కారణంగా యాక్సిలరేషన్ హార్డ్‌గా చేయాలనిపించే ఫీల్ వస్తుంది. బిఎమ్‌డబ్ల్యూ 3సిరీస్ మరియు మెర్సిడెస్ బెంజ్ సీ-క్లాస్ కార్లతో పోల్చుకుంటే గేర్-షిఫ్టర్ గేర్లు చేంజ్ చేయడానికి కాస్త టైమ్ తీసుకుంటున్నట్లు అనిపించింది.

   2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

   2020 జాగ్వార్ ఎక్స్ఇ ఓవరాల్ రివ్యూ విషయానికి వస్తే, డ్రైవ్ చేయడానికి ఇదొక ఫన్ కారు. ప్రతి సందర్భంలో అద్బుతమైన ఫీల్ అండ్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. సిటీ ట్రాఫిక్ రోడ్ కండీషన్స్ నుండి ఫ్లాట్ హైవే రోడ్ల వరకూ మనల్ని ఎక్కడా తగ్గనివ్వదు. ఇంజన్ రెస్పాన్ మాత్రం ఎంతో స్మూత్‌గా ఉంది.

   Variables Petrol Diesel
   Engine (cc) 1997 1999
   Power (bhp) 247 @ 5500rpm 177 @ 4000rpm
   Torque (Nm) 365 @ 1500rpm 400 @ 1750rpm
   Transmission 8-Speed AT 8-Speed AT
   2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

   ధర, పోటీ మరియు కలర్ ఆప్షన్స్

   2020 జాగ్వార్ ఎక్స్ఇ రెండు విభిన్న వేరియంట్లలో లభిస్తోంది. అవి S మరియు SE. ఈ రెండు వేరియంట్లు మళ్లీ పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. 2020 జాగ్వార్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్ ప్రారంభ ధర రూ. 44.93 లక్షలు మరియు టాప్ ఎండ్ SE వేరియంట్ ధర రూ. 46.33 లక్షలు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి.

   జాగ్వార్ ఎక్స్ఇ ఆరు విభిన్న కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. అవి, ఫ్యూజి వైట్, కాల్డెరా రెడ్, ఫిరెంజ్ రెడ్, పోర్టోఫినో బ్లూ, ఈగర్ గ్రే మరియు శాంటోరినో బ్లాక్.

   2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

   2020 జాగ్వార్ ఎక్స్ఇ లగ్జరీ సెడాన్ కారు మార్కెట్లో ఉన్న బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్ మరియు మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ కార్లకు సరాసరి పోటీనిస్తుంది. క్రింది పట్టికలో ఈ మూడు మోడళ్ల మీద ఓ లుక్కేసుకోండి!

   Model/Specs 2020 జాగ్వార్ ఎక్స్ఇ

   బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్

   Engine (cc) 2.0-Petrol 2.0-Petrol 1.5-Petrol
   Power (bhp) 247 258 184
   Torque (Nm) 365 400 280
   Transmission AT AT AT
   2020 జాగ్వార్ ఎక్స్ఇ రివ్యూ: స్పోర్ట్స్ సెడాన్‌కు లగ్జరీ సొగసులు

   డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

   జాగ్వార్ ఎక్స్ఇ డ్రైవ్ చేయడానికి ఎక్సలెంట్ కారు, కొత్తగా వచ్చిన అప్‌‌డేట్స్‌తో మరింత బెస్ట్ అని నిరూపించుకుంది. షార్ప్ రెస్పాన్, స్మూత్ ఇంజన్, అద్భుతమైన కార్నరింగ్‌తో పాటు స్పోర్ట్స్ సెడాన్ కారుకు లగ్జరీ సొబగులు అందించి స్పోర్ట్స్ మరియు లగ్జరీ కార్ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది.

   2020 జాగ్వార్ ఎక్స్ఇ సెడాన్ మార్కెట్లో ఉన్ బిఎమ్‌డబ్ల్యూ 3-సిరీస్, ఆడి ఏ4 మరియు మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్ వంటి జర్మన్ కార్లకు గట్టి పోటీనే ఇస్తుంది.

Most Read Articles

English summary
2020 Jaguar XE Review: Adding Luxury To A Sports Sedan. Read in Telugu.
Story first published: Friday, January 17, 2020, 17:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X