ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

భారత మార్కెట్లో రెనాల్ట్ 2012 లో తిరిగి డస్టర్‌ను విడుదల చేసింది. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ లాంచ్ అయిన తరువాత, ఎక్కువ ప్రజాదరణ పొందడమే కాక, ఎక్కువ అభిమానులను కూడా కలిగి ఉంది. ఎక్కువ ప్రజాదరణను పొందటానికి ప్రధాన కారణం, డస్టర్ ఎటువంటి రహదారులలో అయినా సజావుగా సాగడమే కాకుండా, మంచి స్టైలిష్ డిజైన్ కలిగి ఉంటుంది.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇది దురదృష్టవశాత్తు నిలిపివేయబడింది. ఏదేమైనా మిడ్-సైజ్ ఎస్‌యూవీకి కొన్ని ఫేస్‌లిఫ్ట్‌లు ఉన్నాయి మరియు ప్రస్తుత ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

ఈ ఏడాది ప్రారంభంలో రెనాల్ట్, డస్టర్ కోసం సరికొత్త 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను విడుదల చేసింది. దీనిని 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. కాబట్టి ఈ ఇంజిన్‌ను కలిగి ఉన్న ఈ లేటెస్ట్ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్‌ను డస్టర్ టర్బో అంటారు. మేము రెండు రోజులు కారుతో నగరం చుట్టూ మరియు రహదారులపై నడిపాము. ఇది అన్ని కాస్మొటిక్ డిజైన్స్ తో సరికొత్త డస్టర్ టర్బో చాలా బాగుంది, ముఖ్యంగా ఈ కాస్పియన్ బ్లూ కలర్ స్కీమ్‌లో ఉంది. ఈ కొత్త మిడ్-సైజ్ ఎస్‌యూవీ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

డిజైన్ మరియు స్టైల్ :

రెనాల్ట్ డస్టర్ టర్బో ముందు భాగంలో, గ్రిల్ చుట్టూ మరియు క్రోమ్ కొంత తక్కువ మొత్తంలో ఉంది. ఇప్పుడు టర్బో పెట్రోల్ వేరియంట్‌ను మిగిలిన వాటి నుంచి నాచురల్ గా వేరు చేయడానికి, సంస్థ కారు చుట్టూ రెడ్ ఇన్సర్ట్‌ల రూపంలో కొన్ని కాస్మెటిక్ నవీనీకరణలను చేసింది. కాబట్టి గ్రిల్ యొక్క ఒక క్రోమ్ స్లాట్ రెడ్ కలర్ లో పూర్తయింది, మరియు హాలోజన్ ఫాగ్ లాంప్స్ పైన అదే ఇన్సర్ట్‌లు ఉంటాయి.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

హెడ్‌లైట్ యూనిట్ కొన్ని క్రోమ్ ఆక్సెంట్స్ మరియు లోపలి భాగంలో రెనాల్ట్ బ్యాడ్జ్‌ను కలిగి ఉంది. ఇది కూడా బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఇది లో బీమ్ కోసం ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ మరియు హై బీమ్ కోసం ఏర్పాటు చేసిన రిఫ్లెక్టర్ మరియు రెండూ హాలోజన్ బల్బులను కలిగి ఉంటాయి. ఇప్పుడు డస్టర్ యొక్క డిఆర్ఎల్ టు పీస్ సెటప్ లాగా ఉంటుంది. ఇది చాలా బాగుంది మరియు చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అలా కాకుండా బంపర్ యొక్క దిగువ భాగంలో గ్రే యాక్సెంట్స్ ఉంటాయి. ఇది మొత్తానికి చూడటానికి చాలా బాగుంటుంది.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఈ కారు యొక్క సైడ్ ప్రొఫైల్‌కు వెళ్ళగానే మీ దృష్టిని ఆకర్షించే మొదటి విషయం ఏమిటంటే 17 ఇంచెస్ డ్యూయల్-టోన్, ఫైవ్-స్పోక్ అల్లాయ్ వీల్. మీరు చంకీ రూఫ్ రైల్స్ కూడా పొందుతారు. అంతే కాకుండా దానిపై, మీకు రెడ్ కలర్ లో డస్టర్ బ్యాడ్జ్ ఉంది. మీరు ఇంటిగ్రేటెడ్ ఇండికేటర్‌తో బాడీ కలర్ ORVM లను కూడా పొందుతారు. డస్టర్ 205 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. ఇది ఎటువంటి రహదారులలో అయినా ప్రయాణించడానికి అనుమతిస్తుంది.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

డస్టర్ టర్బో వెనుక భాగంలో నిలువుగా పేర్చబడిన టైల్లైట్‌ను పొందుతుంది, ఇది మధ్యలో ఎల్‌ఈడీ స్ట్రిప్‌ను కలిగి ఉంటుంది. బూట్ మధ్యలో క్రోమ్ లేదా బ్లాక్ కలర్ లో డస్టర్ బ్యాడ్జ్‌ను కలిగి ఉండేది. కానీ ఇప్పుడు ఇది రెడ్ కలర్ లో భర్తీ చేయబడింది. మొత్తంమీద, రెడ్ ఆక్సెంట్స్ కలిగిన డస్టర్ టర్బో, కాస్పియన్ బ్లూ కలర్ మరియు ముందు మరియు వెనుక భాగంలో గ్రే కలర్ ఇన్సర్ట్‌లు అద్భుతంగా కనిపిస్తాయి.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇంటీరియర్స్ & ఫీచర్స్ :

క్యాబిన్ లోపలికి అడుగు పెట్టగానే చాలా విశాలంగా అనిపిస్తుంది. డస్టర్ టర్బో యొక్క ఇంటీరియర్స్ విషయానికి వస్తే ఇవి చాలా ప్రాథమికంగా అనిపిస్తుంది మరియు వెలుపల లాగా లోపలికి కూడా రెడ్ ట్రీట్మెంట్ ఆశించాము. కఠినమైన మరియు మంచి నాణ్యమైన ప్లాస్టిక్ ప్రతిచోటా ఉపయోగించబడింది మరియు డోర్ ప్యానెల్స్‌పై కొన్ని సాఫ్ట్-టచ్ క్లాత్ మెటీరియల్ ఉంది. అందువల్ల ఇంటీరియర్స్ కొంచెం ఖరీదైనవిగా కనిపిస్తాయి. ఇది టర్బో వేరియంట్ కాబట్టి మేము పూర్తి బ్లాక్ ఇంటీరియర్ లేఅవుట్ చూడాలనుకున్నాము.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇకపోతే ఇందులోని సీట్ల విషయానికి వస్తే ముందు రెండు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అంతే కాకుండా డ్రైవర్ సైడ్ హైట్ అడ్జస్టబుల్ కూడా ఉంటుంది. సుదీర్ఘ ప్రయాణంలో సీట్లు మిమ్మల్ని అలసిపోనివ్వకుండా చేస్తాయి. ఏది ఏమైనా ఇది కొంత అసౌకర్యంగా ఉంటుందనే చెప్పాలి.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఫ్లోర్ బెడ్ దాదాపు ఫ్లాట్ గా ఉన్నందున రెండవ వరుసలో ముగ్గురు ప్రయాణీకులను సులభంగా ఉంచవచ్చు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఉంటే అప్పుడు సెంటర్ ఆర్మ్‌రెస్ట్ కూడా లభిస్తుంది. ఏదేమైనా హెడ్‌రూమ్‌కు సంబంధించినంతవరకు ఎటువంటి సమస్య లేదు, కానీ అప్పుడు పొడవాటి కాళ్లు ఉన్న వ్యక్తులు ఉంటే కొంత సమస్య వుండే అవకాశం ఉంటుంది. డస్టర్ RXZ టాప్-ఎండ్ వేరియంట్‌కు సన్‌రూఫ్ లభించిందని మేము భావిస్తున్నాము.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

స్టీరింగ్ వీల్ లెదర్ తో చుట్టబడి ఉండటం వల్ల ఇది చాలా మంచి పట్టుని అందిస్తుంది. వీల్ లో అమర్చిన బటన్లు ఉన్నాయి, కానీ అవి MID స్క్రీన్ లేదా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కాదు. డస్టర్ టర్బోలోని క్లస్టర్ ప్రాథమికమైనది మరియు స్పీడో మరియు ఓడోమీటర్ కోసం అనలాగ్ డయల్‌లను కలిగి ఉంటుంది. ట్రిప్, డిస్టెన్స్ టు ఎంప్టీ, ఫ్యూయెల్ గేజ్ మొదలైన సమాచారాన్ని ఎమ్ఐడి స్క్రీన్ అందిస్తుంది.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ తో పాటు యాంటీ రిఫ్లెక్షన్ స్క్రీన్ కలిగి ఉంది. సిస్టమ్ సెంటర్ కన్సోల్‌లో కొద్దిగా క్రిందికి ఉంచబడుతుంది. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లేని కూడా కలిగి ఉంది. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ క్రింద, ఛార్జింగ్ సాకెట్ ఆటోమేటిక్ స్టార్ట్ / స్టాప్ కోసం బటన్ ఉంటుంది.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇది కారు ఆగిపోయినప్పుడు కారును క్లోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ బ్రేక్ నొక్కితే కారు తిరిగి స్టార్ట్ అవుతుంది. సిటీ స్టాప్ మరియు ట్రాఫిక్ సమయంలో కొంత ఇంధనం ఆదా అయ్యేలా ఇవన్నీ జరుగుతాయి. నిజానికి ఈ ఫీచర్ కొన్నిసార్లు చిరాకు కలిగిస్తుంది, ముఖ్యంగా వేసవికాలంలో కారు ఆగినప్పుడల్లా ఏసి కంప్రెసర్ కూడా కట్ చేయబడుతుంది. కాబట్టి ఆ బటన్ సహాయంతో మీరు ఈ ఫీచర్ నిలిపివేయవచ్చు.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

పవర్ అండ్ హ్యాండ్లింగ్ :

డస్టర్ టర్బోకు కొత్త 1 ‘హెచ్‌ఆర్ 13 '1.3-లీటర్, నాలుగు సిలిండర్, టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 156 బిహెచ్‌పి శక్తిని మరియు 245 ఎన్ఎమ్ పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ నిస్సాన్ జిటి-ఆర్ సూపర్ కార్లో ఉండే సిలిండర్ కోటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుందని చెబుతున్నారు. ఇది అత్యుత్తమ పనితీరు కోసం డ్యూయల్ వేరియబుల్ వాల్వ్ టైమింగ్‌ను కూడా కలిగి ఉంది. ఇంజిన్ 7-స్టెప్ సివిటి ట్రాన్స్మిషన్తో జతచేయబడుతుంది.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇనీషియల్ యాక్సిలేటర్ చాలా స్మూత్ గా ఉంటుంది. టర్బో 1700 ఆర్‌పిఎమ్ నుండి 1800 ఆర్‌పిఎమ్ వరకు ప్రారంభించినప్పుడు, డస్టర్ మీ ముఖం మీద చిరునవ్వును కలిగిస్తుంది. షిఫ్ట్‌లు సున్నితంగా అనిపిస్తాయి మరియు గేర్‌బాక్స్ నగరంలో తన పనిని బాగా చేస్తుంది. ఇప్పుడు కారును మాన్యువల్ మోడ్‌లో మార్చినప్పుడు షిఫ్ట్‌పై స్వల్ప నియంత్రణలను పొందుతారు. మీరు మాన్యువల్ మోడ్‌లో షిఫ్ట్ చేయకపోతే, 5500 ఆర్‌పిఎమ్ రెడ్‌లైన్‌ను తాకిన తర్వాత కారు ఆటోమాటిక్ గా మారుతుంది.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

మాన్యువల్ మోడ్‌లో, షిఫ్ట్‌లు ఆటోమేటిక్ మోడ్ కంటే షార్ప్ గా అనిపిస్తాయి. మీరు ఆటోమేటిక్ మోడ్‌లో కూడా అధిగమించవచ్చు, కాని మాన్యువల్ మోడ్‌లో ఫాస్ట్ ఓవర్‌టేక్‌లు సులభంగా ఉంటాయి. మీరు హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు థొరెటల్ బాగా పనిచేస్తుంది.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ఇప్పుడు కారు యొక్క ప్రధాన భాగం సస్పెన్షన్స్. ఇది మంచి రైడింగ్ మరియు హ్యాండ్లింగ్ అందిస్తుంది. ఇది ఎటువంటి రహదారులలో అయినా చాలా బాగా పనిచేస్తుంది. ఇన్సులేషన్ మరియు ఎన్విహెచ్ స్థాయిలు కూడా చాలా బాగున్నాయి. ఇవి ఇంజిన్ శబ్దం లేదా బయటి శబ్దం క్యాబిన్లోకి ప్రవేశించడానికి అనుమతించవు.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

కారు యొక్క స్టీరింగ్ చాలా కష్టంగా మరియు దృడంగా అనిపిస్తుంది. కారు నిలిచిపోయినప్పుడు కూడా ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. అంతే కాకుండా కారును రివర్స్ చేయడాన్ని యు-టర్న్ తీసుకోవలసి వస్తే, మీరు స్టీరింగ్ వీల్‌ను కొంత కష్టతరంగా నిర్వహిచవలసి ఉంటుంది. ఏదైనా ఇది కొంత కఠినంగా ఉంటుంది.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

మైలేజ్ గణాంకాల విషయానికొస్తే, మేము సరైన మైలేజ్ టెస్ట్ చేయలేకపోయాము, కాని డస్టర్ టర్బో మాన్యువల్ సిక్స్-స్పీడ్ మరియు సివిటి రెండింటికి 16 నుండి 17 కిమీ / లీటర్ అందిస్తుంది అని కంపెనీ పేర్కొంది.

ఇప్పుడే చూడండి.. రెనాల్ట్ డస్టర్ టర్బో ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం :

మేము రెనాల్ట్ డస్టర్ టర్బో ఆర్ఎక్స్జెడ్ [RXZ]వేరియంట్‌ను డ్రైవ్ చేసాము. దేశీయ మార్కెట్లో దీని ధర రూ. 13.56 లక్షలు [ఎక్స్-షోరూమ్]. అదే విభాగంలో ఇతర కార్లలో ఉన్న చాలా ఫీచర్స్ డస్టర్ అందించనందువల్ల ఇది కొంత ఖరీదైనదిగానే అనిపించే అవకాశం ఉంది. కానీ ఇది అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

అంతే కాకుండా ఇప్పుడు ఇది కూడా ఈ విభాగంలో అత్యంత శక్తివంతమైన ఇంజిన్‌తో వస్తుంది. కాబట్టి మీరు మీ రోజువారీ డ్రైవింగ్ కోసం మిడ్-సైజ్ ఎస్‌యూవీ కోసం ఎదురుచూస్తున్నట్లైతే డస్టర్ ఖచ్చితంగా మీకు మంచి ఎంపిక అవుతుంది.

Most Read Articles

English summary
Renault Duster Turbo Frist Drive Review. Read in Telugu.
Story first published: Wednesday, September 30, 2020, 11:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X