అత్యధిక మైలేజీనిచ్చే క్లాసిక్ సెడాన్‌ను విడుదల చేసిన ఫోర్డ్

Posted By:

ఫోర్డ్ ఇండియా అందిస్తున్న ఫియస్టా క్లాసిక్ సెడాన్‌ పేరును మార్చి, ఈ కారుకు మరిన్ని అదనపు హంగులను జోడించి కొత్తగా మార్కెట్లోకి విడుదల చేసింది. 'ఫోర్డ్ క్లాసిక్' పేరుతో మార్కెట్లో వచ్చిన ఈ కొత్త వేరియంట్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వేరియంట్ క్లాసిక్ ధర రూ.6,86,400 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉండగా, డీజిల్ వేరియంట్ క్లాసిక్ ధర రూ.7,82,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

డీజిల్ వెర్షన్ ఫోర్డ్ క్లాసిక్ టైటానియం వేరియంట్ గరిష్టంగా లీటర్ డీజిల్‌కు 32.38 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) కంపెనీ పేర్కొంది. డీజిల్ వెర్షన్ ఫోర్డ్ క్లాసిక్‌లో 1.4 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 68 పిఎస్‌ల శక్తిని, 160 ఎన్ఎమ్‌ల టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button

పెట్రోల్ వెర్షన్ ఫోర్డ్ క్లాసిక్ మాత్రం ఇదివరకటి మాదిరిగానే లీటరు పెట్రోల్‌కు 21.7 కి.మీ. మైలేజీని ఆఫర్ చేస్తుంది. ఇందులో 1.6 లీటర్ డ్యూరాటెక్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 101 పిఎస్‌ల శక్తిని, 146 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఫోర్డ్ క్లాసిక్‌ టైటానియంలో ఉండే విశిష్టమైన ఫీచర్లు:

* బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్టీరియో సిస్టమ్

* వేగాన్ని బట్టి సౌండ్ తగ్గిపోయేలా ఏర్పాటు చేసిన స్పీడ్ సెన్సింగ్ వాల్యూమ్ కంట్రోల్స్

* డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌‌గా లాక్ అయ్యే డ్రైవ్-అవే లాక్స్

* బీజ్ ఇంటిరీయర్ ట్రిమ్

* సరికొత్త అల్లాయ్ వీల్ డిజైన్

* బాడీ కలర్‌లో ఉండే సైడ్ మిర్రర్స్, బ్లాక్ ఫ్రంట్ గ్రిల్

ఫోర్డ్ క్లాసిక్ టైటానియం సెడాన్ ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో (పాప్రికా రెడ్, పాంథర్ బ్లాక్, డైమండ్ వైట్, చిల్ మెటాలిక్, మూన్ డస్ట్ సిల్వర్, సీ గ్రే), ఇది రెండేళ్లు లేదా 1,00,000 కి.మీ. వారంటీతో లభిస్తుంది.

English summary
The new Ford Classic Titanium diesel model offers a record breaking mileage of 32.28 kmpl. The Classic Titanium diesel is priced at Rs 7.9 lakhs.
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark