ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు బెంగుళూరు పోలీసుల టెక్నిక్

By Ravi

తరచూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని టార్గెట్ చేస్తూ బెంగుళూరు ట్రాఫిక్ పోలీసులు ఓ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నగరంలో రద్దీగా ఉండే జంక్షన్ల వద్ద ట్రాఫిక్ పోలీసుల 3డి కటౌట్లను ఉంచారు. వీటిని దూరం నుంచి చూస్తే నిజమైన ట్రాఫిక్ పోలీసు అధికారి అక్కడ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ టెక్నిక్‌ను స్కేర్‌క్రౌ టెక్నిక్ అంటారు. పేరుకు తగినట్లుగానే ఇది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని, భయపెడుతుందన్నమాట.

బహుశా దేశంలోనే ఈ తరహా విధానాన్ని ఉపయోగించి మొట్టమొదటి నగరం బెంగుళూరు కావచ్చు. దేశంలోని ఇతర నగరాల మాదిరిగానే బెంగుళూరులో కూడా ట్రాఫిక్ పోలీసుల కొరత ఉంది. అయితే, ఈ కార్డ్‌బోర్డ్ కటౌట్ల సాయంతో అధికారులు ఈ సమస్యకు చెక్ పెట్టాలని నిర్ణయించారు.

ఈ విషయంపై బెంగుళూరు పోలీస్ కమీషనర్ ఎమ్ఏ సలీం మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఈ కటౌట్లు చక్కగా ఉపయోగపడుతాయని, వీటి సాయంతో వేగంగ వెళ్లే వారిని నియంత్రించవచ్చని తద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. నిజమైన ట్రాఫిక్ పోలీసుల చిత్రపటాలతో ఈ కార్డ్‌బోర్డ్ కటౌట్లను తయారు చేశారు. దూరం నుంచి గమనిస్తే, ట్రాఫిక్ పోలీస్ అక్కడ నిల్చున్న భావన ప్రయాణికుల్లో కలిగి జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారు. బాగుంది కదూ ఈ టెక్నిక్..!

Bangalore Cops Scarecrow Technique For Traffic Offenders
Most Read Articles

English summary
Cops in the city of Bangalore are probably the first in the world to implement a new scarecrow technique for humans, aimed at keeping traffic offenders at bay. Card board cutouts of traffic cops have been erected at busy intersections across the city of Bangalore.
Story first published: Monday, May 13, 2013, 16:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X