2014 ఆటో ఎక్స్‌పోలో షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్, ట్రైల్‌బ్లేజర్

By Ravi

ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభం కానున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో షెవర్లే కూడా సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. వీటిలో ప్రధానంగా, షెవర్లే బీట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మరియు ట్రైల్‌బ్లేజర్ ఎస్‌యూవీలు స్పెషల్ అట్రాక్షన్‍‌గా నిలువనున్నాయి. జనరల్ మోటార్స్ దాదాపు నాలుగేళ్ల క్రితం షెవర్లే బీట్ హ్యాచ్‌బ్యాక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతున్న షెవర్లే బీట్ కంపెనీకి బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉంది. ఈ మోడల్‌ను ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉంచేందుకు కంపెనీ ఇందులో ఇప్పుడు ఓ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ ఫేస్‌లిఫ్ట్ బీట్‌లో కొత్త బంపర్స్, రీడిజైన్ చేయబడిన హెడ్‌ల్యాంప్స్, కొత్త సైడ్ మిర్రర్స్ వంటి ఎక్స్టీరియర్ మార్పులతో పాటుగా ఇంటీరియర్లలో కూడా మార్పులు ఉండనున్నాయి.


ఆటో ఎక్స్‌పో 2014లో షెవర్లే నుంచి రానున్న రెండవ ఉత్పత్తి ట్రైల్‌బ్లేజర్ ఎస్‌యూవీ. షెవర్లే ట్రైల్‌బ్లేజర్ ప్రస్తుతం జనరల్ మోటార్స్ భారత మార్కెట్లో అందిస్తున్న షెవర్లే కాప్టివా ఎస్‌యూవీ కన్నా పెద్దదిగా ఉంటుంది. కొత్త 2012 ట్రైల్‌బ్లేజర్ ఎస్‌యూవీ 2.5 లీటర్ 2.8 లీటర్ డ్యురామ్యాక్స్ డీజిల్ ఇంజన్‌ ఆప్షన్లలో లభ్యమవుతుంది. 2.5 లీటర్ ఇంజన్ 150 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 350 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగా, 2.8 లీటర్ ఇంజన్ 180 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 480 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.
Chevrolet Trailblazer

షెవర్లే ట్రైల్‌బ్లేజర్ టూ-వీల్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్‌లతో 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌లతో లభ్యమవుతుంది. ఇండియాలో 7-సీటర్ ట్రైల్‌బ్లేజర్ ఎస్‌యూవీ ధర కాప్టివా ఎస్‌యూవీ కన్నా తక్కువగా (రూ.17 లక్షలకు దిగువన) ఉండొచ్చని అంచనా. టొయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవియర్ వంటి ఎస్‌యూవీలకు పోటీగా షెవర్లే ట్రైల్ బ్లేజర్ నిలువనుంది. అంతేకాకుండా, సూపర్‌కార్ అభిమానులు ఈ 2014 ఆటో ఎక్స్‌పోలో షెవర్లే కార్వెట్టె స్టింగ్‌రే సి7 మోడల్‌ను చూడొచ్చు.
Most Read Articles

English summary
We may get a chance to see Chevrolet Beat facelift and Chevrolet Trailblazer SUV at 2014 Indian Auto Expo. General Motors will showcase fleet of new and upgraded car in next month. Stay tuned for more updates.
Story first published: Sunday, January 19, 2014, 22:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X