మొబిలియోకి చెక్ పెట్టేందుకు ఎర్టిగాపై భారీ డిస్కౌంట్స్

By Ravi

మరికొద్ది రోజుల్లో హోండా మొబిలియో ఎమ్‌పివి మార్కెట్లో విడుదల కానున్న నేపథ్యంలో, మారుతి సుజుకి డీలర్లు ఆ మోడల్ నుంచి ఎదురు కాబోయే పోటీని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు తమ పాపులర్ ఎమ్‌పివి ఎర్టిగాపై భారీ డిస్కౌంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కారు కోసం రుణం కాదు, కారుంటేనే రుణం!

వాస్తవానికి మారుతి ఎర్టిగాపై ఎలాంటి డిస్కౌంట్లు ఆఫర్ చేయకపోయినప్పటికీ, ఈ సెగ్మెంట్లో కెల్లా అత్యంత సరమైన ధరకే లభిస్తున్న మోడల్ కావటంతో దీని అమ్మకాలు జోరుగానే సాగుతున్నాయి. అయితే, భవిష్యత్తులో ఎదురు కాబోయే పోటీని దృష్టిలో ఉంచుకొని కంపెనీ డీలర్లు దీనిపై తగ్గింపులను మరింత పెంచారు.


హోండా కూడా తమ మొబిలియో ఎమ్‌పివి ఎర్టిగాకు ధీటుగా ప్రవేశపెట్టనుంది. ధర విషయంలో కూడా ఇది టొయోటా ఇన్నోవా కన్నా మారుతి ఎర్టిగాతోనే ఎక్కువగా పోటీ పడనున్నట్లు సమాచారం. ఈ పరిస్థితిని ముందుగానే అధ్యయనం చేసిన మారుతి తమ ఎర్టిగాపై డిస్కౌంట్లను, ప్రోత్సాహకాలను ఆఫర్ చేయటం ద్వారా కస్టమర్లను తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తోంది.

ప్రస్తుతం మారుతి సుజుకి సగటున ప్రతినెలా 5000 యూనిట్ల ఎర్టిగా ఎమ్‌పివిలను విక్రయిస్తోంది. ఈ మోడల్‌పై కంపెనీ సుమారు రూ.70,000 విలువైన ప్రోత్సాహాకాలను అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్సేంజ్ బోనస్, కార్పోరేట్ డిస్కౌంట్స్ కలిసి ఉన్నాయి. సాధారణంగా అమ్మకాలను పెంచుకునేందుకు కంపెనీలు తమ ఉత్పత్తులపై డిస్కౌంట్లు అందిస్తుంటారు.

Honda Mobilio

ఇది కూడా చదవండి: మారుతి కార్లకే అగ్రస్థానం

అయితే, ఇప్పటికే ఎక్కువగా అమ్ముడుపోతున్న ఎర్టిగా వంటి మోడళ్లపై డిస్కౌంట్లను ఆఫర్ చేయటం చూస్తుంటే, ఇది ఖచ్చితంగా పోటీని ఎదుర్కునేందుకే అని స్పష్టం అవుతోంది. మరి ఈ రెండింటిలో మీ ఛాయిస్ ఏంటి.. ఎర్టిగానా లేక మొబిలియోనా?

ఈ వీడియో చూశారా..కెన్ బ్లాక్ బూబ్ఖానా..
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/rMSL4WKT5Uc?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

Most Read Articles

English summary
Maruti Suzuki India is offering massive discounts on its Ertiga MPV to compete with Honda Mobilio. The Ertiga is being offered with a discounts bundle of Rs 70,000 which includes a hefty cash discount, exchange bonus and a corporate discount.&#13;
Story first published: Tuesday, July 22, 2014, 18:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X