ఇండియన్ వెర్షన్ లాంబోర్గినీ హారికేన్ టెక్నికల్ డిటేల్స్

By Ravi

ఇటాలియన్ సూపర్‌కార్ కంపెనీ లాంబోర్గినీ గ్లోబల్ మార్కెట్లలో విక్రయిస్తున్న లేటెస్ట్ సూపర్‌కార్ 'లాంబోర్గినీ హారికేన్' (Lamborghini Huracan) మరికొద్ది నెలల్లోనే భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, ఇండియన్ వెర్షన్ లాంబోర్గినీకి చెందిన కొన్ని సాంకేతిక వివరాలను కంపెనీ వెల్లడి చేసింది. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

గడచిన డిసెంబర్ నెలలో ఉత్పత్తిని నిలిపివేసిన తమ పాపులర్ గల్లార్డో స్థానాన్ని భర్తీ చేసేందుకు లాంబోర్గినీ 'హారికేన్'ను తయారు చేసింది. ఇండియన్ వెర్షన్ లాంబోర్గినీ హారికేన్ ఎల్‌పి 640-4 కారులో 5.2 లీటర్ వి10 ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 8250 ఆర్‌పిఎమ్ వద్ద 610 పిఎస్‌ల శక్తిని, 560 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Lamborghini Huracan India Tech Detail

ఇది స్ట్రాడా, స్పోర్ట్, కోర్సా అనే మూడు డ్రైవింగ్ మోడ్స్‌లో లభిస్తుంది. ఇందులో కోర్సా మోడ్ అత్యంత శక్తివంతమైనది. లాంబోర్గినీ హారికేనే కేవలం 3.2 సెకండ్ల వ్యవధిలో 0-100 కి.మీ. వేగాన్ని, 9.9 సెకండ్ల వ్యవధిలో 0-200 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్టం వేగం గంటకు 325 కిలోమీటర్లు. దేశీయ విపణిలో దీని ధర రూ.3.4 కోట్లు (ఎక్స్-షోరూమ్)గా ఉండొచ్చని అంచనా. ఈలోపుగా లాంబోర్గినీ హారికేన్ టెక్నాలజీకి సంబంధించిన 3డి వీడియోని చూడండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/aJN5BxmclEo?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
Most Read Articles

English summary
The Huracan by Lamborghini will sport a 5.2-litre V10 configured engine. The naturally aspirated engine will produce a mammoth 610 horsepower. It can achieve a top speed of 325 km/h and can accelerate to 100 km/h from standstill in 3.2 seconds.&#13;
Story first published: Monday, August 4, 2014, 11:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X