అన్ని టొయోటా కార్లలో స్టాండర్డ్ ఫీచర్‌గా ఎయిర్‌బ్యాగ్స్!

By Ravi

రానున్న రోజుల్లో భారతదేశంలోని వాహనాల భద్రత విషయంలో ప్రభుత్వం కఠిమైన నిర్ణయాలు తీసుకోనున్న నేపథ్యంలో, కార్ కంపెనీలు ఇప్పటి నుంచే తాము విక్రయిస్తున్న వాహనాల భద్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి.

ఇందులో భాగంగానే, జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ టొయోటా, ఇకపై భారత్‌లో విక్రయించే అన్ని కార్లలోను తప్పనిసరిగా ఎయిర్‌బ్యాగ్స్ ఫీర్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేయాలని నిర్ణయించుకుంది. కంపెనీ ఇప్పటికే తమ ఎతియోస్ సెడాన్, ఎతియోస్ లివా హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో ఎయిర్‌బ్యాగ్స్‌ను తప్పనిసరి చేసింది. కాగా.. ఇప్పుడు బేస్ వేరియంట్ టొయోటా ఇన్నోవా (జి)లో కూడా కంపెనీ ఎయిర్‌బ్యాగ్స్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేయనుంది.

All Toyota Cars To Get Airbags As Standard

బేస్ వేరియంట్లలో కేవలం డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ మాత్రమే లభిస్తుంది. ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ ఉండదు. టొయోటా అందిస్తున్న ఇతర మోడళ్లలో ఇటీవలే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లు వచ్చాయి. కాగా.. టొయోటా ఇన్నోవాలో కూడా త్వరలోనే అప్‌గ్రేడెడ్ వెర్షన్ విడుదల కానుంది. ఈ అప్‌డేటెడ్ ఇన్నోవాలో కొన్ని ప్రధాన కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా, డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ మరియు రియర్ ఏసి వెంట్స్ వంటి ఫీచర్లను కూడా ఆఫర్ చేయనున్నారు.

అన్ని టొయోటా కార్లలో ఎయిర్‌బ్యాగ్స్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా ఆఫర్ చేయటం వలన కార్ల ధరలు కూడా అధికమయ్యే ఆస్కారం ఉంది. ఈ ధరల గురించి కంపెనీ ఎలాంటి ప్రస్థావన చేయకపోయినప్పటికీ, వీటి ధరలు సుమారు రూ.40,000 వరకూ పెరగొచ్చని అంచనా. మరికొద్ది నెలల్లోనే టొయోటా ఇన్నోవాలో ఎయిర్‌బ్యాగ్స్ స్టాండర్డ్ ఫీచర్‌గా లభ్యమయ్యే ఆస్కారం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
As per Autocar magazine, Toyota is going to offer Airbags as standard across its model range. Price could go up by around Rs. 40,000 and base trims may get just the Driver side airbag.
Story first published: Monday, January 5, 2015, 11:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X