ఐడియస్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించిన నిస్సాన్

By Anil

నిస్సాన్ మోటార్స్ స్వయంప్రతి పత్తి తో ఈ ఎలక్ట్రిక్ కారును ఆ విష్కరించింది. భవిష్యత్తులో ఉద్గార రహిత విద్యత్ వాహనాలను తయారు చేయడం మీద నిస్సాన్ దృష్టి సారించింది. మరియు భవిష్యత్తులో కారు మరియు డ్రైవర్ మద్య చైతన్యవంతమైన సంభందం కల్పించేందుకు పలు రకాల టెక్నాలజీలను పరిచయం చేస్తోంది. అందులో భాగంగానే ఈ ఐడియస్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారును టోక్యో మోటర్ షోలో దీనిని ఆవిష్కరించింది.
Also Read: జపాన్ అణు విపత్తు యొక్క విషయాలు-నిర్ఘాంతపోయే సత్యాలు

నిస్సాన్ ఐడియస్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ కారు యొక్క మరిన్ని విశేషాలు క్రింద గల స్లైడర్‌ల ద్వారా తెలుసుకుందాం రండి.

 అనుభూతి :

అనుభూతి :

నిస్సాన్ ఐడియస్ కాన్సెప్ట్ కారు డ్రైవర్‌కు విభిన్న అనుభుతిని ఇస్తుంది. దీనిని రాబోయే కాలానికి అనుగుణంగా సృష్టించారు. డ్రైవర్ వాహనాన్ని నడపాలని నిర్ణయించుకున్నప్పుడు, ఈ ఎలక్ట్రిక్ కారు డ్రైవర్ యొక్క సొంత శైలి మరియు అతని ప్రాధాన్యతలను అనుకరిస్తుంది.

మ్యాన్యువల్ డ్రైవ్ మోడ్ :

మ్యాన్యువల్ డ్రైవ్ మోడ్ :

మ్యాన్యువల్ డ్రైవ్ మోడ్ లో నిస్సాన్ ఐడియస్ కాన్సెప్ట్ కారు నిరంతరం డ్రైవర్ కు సహాయంలో ఉంటుంది. ఒక వేళ కారు ప్రమాదానికి గురైనప్పుడు అక్కడి నుండి తప్పించుకోకుండా డ్రైవర్ కు సహాయం చేస్తుంది.

 ఇంటీరియర్ :

ఇంటీరియర్ :

నిస్సాన్ ఐడియస్ కాన్సెప్ట్ కారులో అత్యదిక బూట్ స్పేస్ కలదు దీని వలన ఇందులో నలుగురు పెద్దలు అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. అవసరాన్ని బట్టి ఇందులో రెండు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి అవి పైలట్ మోడ్ మరియు మ్యాన్యువల్ మోడ్. పైలట్ మోడ్ ఎంచుకున్నప్పుడు ఇంస్ట్రుమెంట్ ప్యానెల్ సీట్లకు మద్యలోకి వస్తుంది. దీనిని పిడి కమాండర్ పిలుస్తారు

ఎక్స్‌టీరియర్ :

ఎక్స్‌టీరియర్ :

నిస్సాన్ కంపెనీ వారు దీని బాహ్య భాగాన్ని అందంగానే కాదు ఎంతో భద్రంగా ఉండే విధంగా కూడా తయారు చేశారు. ఐడియస్ కాన్సెప్ట్ కారు ఎక్స్‌టీరియర్ వెండి లైనింగ్‌తో రూపొందించారు. దీనిని నడుపుతున్నప్పుడు పాదచారులు గాని సైకిల్ తొక్కుతున్న వారు గాని దీనికి అతి సమీపంగా వచ్చినప్పుడు డ్రైవర్‌కు సూచనలు పంపుతుంది.

ఐడియస్ కాన్సెప్ట్ కారుకు సంభదించిన మరిన్ని విషయాలు పక్కనున్న వీడియో ద్వారా తెలుసుకోగలరు.

దూర ప్రాంత ప్రయాణాల కోసం ఇవి టెక్నాలజీ :

దూర ప్రాంత ప్రయాణాల కోసం ఇవి టెక్నాలజీ :

ఐడియస్ కాన్సెప్ట్ కారులో ఎక్కువ కెపాసిటి గల 60 కిలో వాట్ పర్ అవర్ బ్యాటరి కలదు. ఇది మీకు దూరక ప్రాంత ప్రయాణాలకు ఎంతో ఉపయోగపడుతుంది.

ఇతర ఫీచర్లు :

ఇతర ఫీచర్లు :

ఇందులో పైలట్ డ్రైవింగ్ మోడ్ ఉన్నప్పుడు దీని స్మార్ట్ ఫోన్ లేదా ట్యాబ్లెట్ తో ఆపరేట్ చేయవచ్చు. మరియు వైర్ లెస్ ఛార్జింగ్ వంటి సదుపాయాలు కూడా ఇందులో ఉన్నాయి.

మరిని విశేషాలు క్రింది వాటి నుండి తెలుసుకోండి
  • మా బలం...! మాకు గర్వకారణం...!! దేశీయంగా తయారైన మిలిటరీ వాహనాలు-ప్రత్యేక సేకరణ
  • బుగైటి కారును సొంతం చేసుకోవాలని ఉందా?
  • అత్యంత ఆకర్షణీయమైన ఫెరారి కార్ల గురించి మీ కోసం.

Most Read Articles

English summary
Nissan Motor Co., Ltd. has unveiled the Nissan IDS Concept at the Tokyo Motor Show.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X