పేపర్ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసిన రేంజ్ రోవర్

By Anil

ల్యాండ్ రోవర్ తమ ఖాతాలో రేంజ్ రోవర్‌ను సృష్టించి ఇప్పటికి సరిగ్గా 45 సంవత్సరాలు అవుతోంది. ల్యాండ్ రోవర్‌ వారి లగ్జరీ వాహనాల తయారీకి అసలైన రూపం ఈ రేంజ్ రోవర్. రేంజ్ రోవర్ లగ్జరీ యస్‌యువి లను అందించడంలో ల్యాండ్ రోవర్ ఎంతో సఫలీకృతమైందని చెప్పవచ్చు. ఇలా దాదాపుగా 45 సంవత్సరాల గడిచిన సందర్భంగా ల్యాండ్ రోవర్ సంభరాలు జరుపుకుంటోంది.

అందులో భాగంగానే ల్యాండ్ రోవర్ సంస్థం తన రేంజ్ రోవర్ కారును చైనాలో ఒక పేపర్ బ్రిడ్జి మీద డ్రైవ్ చేసింది. ఈ సందర్భంగా అక్కడి జరగిన మరిన్ని విశేషాలు క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం...

 పేపర్ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసిన రేంజ్ రోవర్

ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటి సారిగా పేపర్ బ్రిడ్జి మీద నడపబడిన మొదటి లగ్జరీ యస్‌యువిగా రేంజ్ రోవర్ పేరుగాంచింది.

 పేపర్ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసిన రేంజ్ రోవర్

ఈ రేంజ్ రోవర్ లగ్జరీ యస్‌యువి పేపర్ బ్రిడ్జ్‌ను ఎక్కేముందు. ముందు వైపు 34.7 డిగ్రీల కోణం మరియు బ్రిడ్జి చివరన 29.6 డిగ్రీల నిష్రమణ కోణం ఉండునట్లు జాగ్రవహించారు. ఇది కేవలం బ్రిడ్జి స్థిరత్వం కోసం ఇలా చేసినట్లు తెలిపారు.

 పేపర్ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసిన రేంజ్ రోవర్

ఈ పేపర్ బ్రిడ్జి పూర్తిగా చేతులతో తయారు చేశారు. అంతే కాకుండా ఈ పేపర్ బ్రిడ్జి కోసం దాదాపుగా 54,390 పేపర్లును ఉపయోగించారు. ఈ పేపర్లు ద్వారా దాదాపుగా ఐదు మీటర్లు పొడవున్న బ్రిడ్జిని రూపొందించారు. అయితే దీనిని పూర్తిగా నిర్మించడానికి మూడు రోజుల సమయం పట్టిందని వివరించారు.

 పేపర్ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసిన రేంజ్ రోవర్

ల్యాండ్ రోవర్ కార్ల తయారీ సంస్థ పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడానికి కారణం తన లగ్జరీ యస్‌‌యువి రేంజ్ రోవర్ ప్రథమ కారణం. అయితే ల్యాండ్ రోవర్ ఈ లగ్జరీ యస్‌యువిని 1970లో పరిచయం చేశారు.

 పేపర్ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసిన రేంజ్ రోవర్

తన మొదటి రేంజ్ రోవర్ వాహనాన్ని సెంట్రల్ అమెరికాలోని డెరీన్ గ్యాప్ లో నడుపడం జరిగింది. తరువాత తన 4X4 డ్రైవ్ వాహనంలో భద్రత కోసం మొదటి సారిగా యాంటి-లాక్ బ్రేక్‌రలను అందించింది

 పేపర్ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసిన రేంజ్ రోవర్

1992 లో తమ రేంజ్ రోవర్ లగ్జరీ వాహనాలలో మొదటి సారిగా ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్‌ను అందించింది.

 పేపర్ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేసిన రేంజ్ రోవర్

2012లో రేంజ్ రోవర్‌లో మొదటి సారిగా అత్యధికంగా అల్యూమినియం‌ను ఉపయోగించారు. అంటే దాదాపుగా 420 కిలోల వరకు సాధారణ స్టీల్ వినియోగం తగ్గిపోయింది.

 మీకు తెలుసా?

మీకు తెలుసా?

సిల్క్ రోడ్ పేపర్ తయారీ దారుల ద్వారా మన దేశంలోకి ఒక ఇస్లాం వ్యక్తి 13 శతాబ్దం కాలంలో పేపర్‌ను పరిచయం చేశాడు.

రేంజ్ రోవర్‌

Most Read Articles

English summary
Range Rover Drives Over A Paper Bridge In China — A World-First!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X