2017 ర్యాపిడ్ విడుదలకు వేదిక సిద్దం చేసిన స్కోడా ఇండియా

Written By:

స్కోడా ఆటో ఇండియన్ మార్కెట్లోకి ఫేస్‌లిఫ్టెడ్ ర్యాపిడ్‌ను నవంబర్ 3, 2016 న విడుదల చేయడానికి పూర్తి స్థాయిలో సిద్దమయ్యింది. విడుదలకు సంభందించిన కార్యక్రమాలు వడివడిగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న స్కోడా డీలర్లు 2017కి చెందిన స్కోడా ర్యాపిడ్‌ బుకింగ్స్‌ను ఆహ్వానిస్తున్నారు.

2017 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

స్కోడా ఆటో ఇండియా డీలర్లు 25,000 రుపాయల ప్రారంభ ధరతో 2017 స్కోడా ర్యాపిడ్ బుకింగ్స్‌ను స్వీకరిస్తున్నారు.

2017 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

ప్రారంభంలో స్కోడా పరిచయం చేసిన ఫేస్‌లిప్ట్ ర్యాపిడ్ ప్రోటోటైప్ వేరియంట్లో హెడ్ లైట్ల ఆకృతి పరిచయం అయ్యింది.

2017 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

అయితే ఈ సరికొత్త 2017 ర్యాపిడ్‌లో రేడియేటర్‌కు అధిక గాలి ప్రవాహం కలిగించే విధంగా పెద్ద ఫ్రంట్ గ్రిల్ కలిగి ఉంది. దీనిని ప్రస్తుతం ఉన్న స్కోడా ఆక్టావియాలో గమనించవచ్చు.

2017 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

సరికొత్త ర్యాపిడ్ ముందు భాగం యూరోపియన్ మార్కెట్లో ఉన్న స్కోడా ఫ్యాబియా తరహాలో ఉంది. ఇందులోని టాప్ ఎండ్ వేరియంట్లలో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ మరియు పగటి పూట వెలిగే ఎల్‌ఇడి లైట్లు కలవు.

2017 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

ఈ సరికొత్త 2017 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్‌లో నూతనంగా సంతరించుకున్న మార్పుల్లో ముందు వైపున విశాలంగా ఉన్న బంపర్ ఒకటి. ఇందులోనే ఫాగ్ ల్యాంప్స్‌ను ఇముండిపచేశారు.

2017 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

ఇంటీరియర్ పరంగా ప్రతి వేరియంట్లో కూడా అత్యంత విలాసవంతమైన మరియు లగ్జరీ శైలిని కల్పించేందుకు గాను ఖరీదైన మెటీరియల్స్‌తో తీర్చిదిద్దారు.

2017 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

స్కోడా పరీక్షించిన 2017 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిప్ట్‌లో తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థను అందించారు. అచ్చం ఇలాంటి దానిని వోక్స్‌వ్యాగన్ వెంటో కారులో కూడా గుర్తించవచ్చు.

2017 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

2017 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్‌లో 1.6-లీటర్ సామర్థ్యం గల టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ కలదు.

2017 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 104బిహెచ్‌పి పవర్ మరియు 153ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

2017 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

2017 స్కోడా ర్యాపిడ్ లోని పెట్రోల్ వేరియంట్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానంతో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

2017 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

2017 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్ 1.5-లీటర్ డీజల్ వేరియంట్లో కూడా అందుబాటులో ఉంది. వోక్స్‌వ్యాగన్ అమియో సెడాన్‌లో దీనిని గుర్తించవచ్చు.

2017 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

ఇందులోని శక్తివంతమైన డీజల్ ఇంజన్ సుమారుగా 108బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. అమియోలోని ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లే ఇందులో కూడా రానున్నాయి.

2017 స్కోడా ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్

స్కోడా ఈ 2017 ర్యాపిడ్ ఫేస్‌లిఫ్ట్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తే హోండా సిటి, వోక్స్‌వ్యాగన్ వెంటో, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి వాటితో గట్టి పోటీని ఎదుర్కోనుంది.

 
Read more on: #స్కోడా #skoda
English summary
Read In Telugu: 2017 Skoda Rapid Bookings Begin In India
Story first published: Wednesday, October 26, 2016, 10:33 [IST]
Please Wait while comments are loading...

Latest Photos