ఉద్గార రహిత బస్సులను ప్రారంభించిన ఘనత వీరిదే...!!

నగర రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రారంభించిన భారత దేశపు మొట్ట మొదటి నగరం బెంగళూరు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రారంభించింది.

By Anil

దేశ వ్యాప్తంగా ఉన్న నగరాలలో పచ్చ తోరణానికి నిలువెత్తు నిదర్శనం బెంగళూరు. ఏ వీదిలో అయినా నిలబడి కనుచూపు మేర వరకు చూస్తే భారీ వృక్షాలతో అడవిని తలపిస్తుంది ఈ హరిత నగరం. అయితే ఈ మధ్య కాలంలో రహదారుల విస్తరణ, ట్రాఫిక్ కారణంగా పెరిగిన కాలుష్యంతో వృక్షాలు చచ్చిపోవడం మరియు కొత్త మొక్కల పెంపకం చేపట్టకపోవడం వలన నగరానికి ఉన్న గ్రీన్ సిటీ అనే పేరును కోల్పోయి పరిస్థితి ఎదురవుతోంది.

ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును ప్రారంభించిన బెంగళూరు

అయితే భారత దేశంలో మరే నగరం కూడా చొరవ తీసుకోని విధంగా బెంగళూరు లోని నగర రవాణా సంస్థ ఉద్గార రహిత ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రారంభించింది.

ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును ప్రారంభించిన బెంగళూరు

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ గత ఏడాది ఫిబ్రవరి లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రయోగాత్మకంగా నడిపి చూసింది. ఈ ప్రాజెక్ట్ అన్ని అధికారులను దాటుకుంటూ పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు ఆమోదం పొందడానికి రెండేళ్లు పట్టింది.

ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును ప్రారంభించిన బెంగళూరు

రెండేళ్ల క్రితం బిఎమ్‌టిసి విభాగం ఉద్గార రహిత ఎలక్ట్రిక్ బస్సులను ప్రయోగాత్మకంగా నడిపింది. అయితే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్ట్ అని ఈ ప్రతిపాదనను ఆలస్యం చేసింది ఆ రాష్ట్రం ప్రభుత్వం. అయితే ఎట్టకేలకు ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాయి.

ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును ప్రారంభించిన బెంగళూరు

భారత మహానగరాలలో గరిష్ట సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సు సేవలను ప్రారంభించిన ఏకైక నగరంగా పేరు గడించి ముందు స్థానంలో నిలిచింది.

ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును ప్రారంభించిన బెంగళూరు

పచ్చదనానికి బాగా పేరుగాంచిన బెంగళూరు మహానగరంలో కాలుష్యాన్ని అదుపు చేసే చర్యల్లో ఈ మార్గంగా ప్రభుత్వం ఆలోచించింది. అంతే ఏకంగా 150 బస్సులతో సర్వీసులను ప్రారంభించనుంది.

ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును ప్రారంభించిన బెంగళూరు

బిఎమ్‌టిసి మేనేజింగ్ డైరెక్టక్ ఎక్రూప్ కౌర్ మాట్లడుతూ, ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను ప్రారంబించడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన తరుణంలో సంస్థ ఆ దిశగా కార్యకలాపాలు ప్రారంభించింది తెలిపింది.

ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును ప్రారంభించిన బెంగళూరు

రానున్న కాలంలో ప్రజా నగర రవాణా మొత్తం ఎలక్ట్రిక్ బస్సుల మీదనే ఆధారపడుతుందని ఆమె తెలిపింది.

ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును ప్రారంభించిన బెంగళూరు

పెట్రోల్ మరియు డీజల్ తో నడిచే వాహనాలతో పోల్చుకుంటే ఎలక్ట్రిక్ వాహనాస నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. డీజల్ బస్సులకు కిలోమీటర్‌కు 18 రుపాయలు నిర్వహణ ఖర్చు రాగా ఎలక్ట్రిక్ బస్సుల్లో నిర్వహణ ఖర్చు కిలోమీటర్‌కు 8 రుపాయలుగా ఉంది.

ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును ప్రారంభించిన బెంగళూరు

ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ మీద అమితాసక్తితో ఉన్న బిఎమ్‌టిసి బెంగళూరులో వీటి కోసం ప్రత్యేక డిపోను ప్రారంభించనుంది. ఈ డిపోను నగరంలో తిరిగే బస్సుల యొక్క మరమత్తు మరియు ఛార్జింగ్ అవసరాల కోసం వినియోగించుకోనున్నారు.

ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును ప్రారంభించిన బెంగళూరు

రెండేళ్ల క్రితం నగరంలో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును ప్రయోగాత్మకంగా నడిపి చూసినపుడు నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు దేశీయంగా ఎలక్ట్రిక్ బస్సుల తయారీ జరగడం వలన తక్కువ ధరతో అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి భవిష్యత్తులో సర్వీసులను మరింత పెంచే అవకాశం ఉన్నట్లు బిఎమ్‌టిసి ముఖ్య అధికారి తెలిపారు.

ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును ప్రారంభించిన బెంగళూరు

ప్రక్క రాష్ట్రం కర్ణాటక తరహాలో రెండు తెలుగు రాష్ట్రాల నగర రవాణా సంస్థలు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడితే తక్కువ ఖర్చుతో ఆదాయాల బాట పట్టడమే కాకుండా కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించవచ్చు.

ఎలక్ట్రిక్ బస్సు సర్వీసును ప్రారంభించిన బెంగళూరు

  • సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తు వరకు ప్రయాణించిన ఎలక్ట్రిక్ బస్సు
  • డీజల్‌ బస్సుల్లో ఈ పరికరాన్ని కనెక్ట్ చేస్తే లీటర్ కు 966 కిమీ మైలేజ్

Most Read Articles

English summary
Read In Telugu: Bengaluru To Become Maiden City In India To Launch Electric Buses
Story first published: Wednesday, October 26, 2016, 18:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X