వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్ మోటార్స్

ఇండియన్ మార్కెట్లో వితారా బ్రిజాతో మారుతి మరో విజయాన్ని అందుకుంది. ఆ విజయాన్ని తన వశం చేసుకునేందుకు హ్యుందాయ్ మోటార్స్ మరో ఎస్‌యువిని విడుదల చేయనుంది.

By Anil

కొరియాకు చెందిన దిగ్గజ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఇండియన్ మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి వారి వితారా బ్రిజాకు పోటీగా మిని ఎస్‌యువిని విడుదల చేయనుంది. బ్రిజాకు సరాసరి పోటీని సృష్టించనున్న ఈ ఎస్‌యువిని హ్యుందాయ్ 2019 తొలి సంగంలో పరిచయం చేయనుంది. హ్యుందాయ్ మోటార్స్ తాజాగ దేశీయ మార్కెట్లోకి తమ మూడవ ఎస్‌యువి టక్సన్ ను విడుదల చేసింది.

వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్ మోటార్స్

తాజాగ హ్యుందాయ్ మోటార్స్ తమ టక్సన్ ఎస్‌యువిని విడుదల చేసిన వేదిక మీద హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎమ్‌డి మరియు సిఇఒ మాట్లాడుతూ, 2019 నాటికి చిన్న ఎస్‌యువిని దేశీయ విపణిలోకి విడుదల చేయనున్నట్ల తెలిపాడు. తద్వారా 2019 నాటికి హ్యుందా లైనప్‌లోని ఎస్‌యువిల నాలుగుకు చేరుతుందని ప్రకటించాడు.

వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్ మోటార్స్

తమ నాలుగవ ఎస్‌యువి ఖచ్చితంగా సబ్ నాలుగు మీటర్ల సెగ్మెంట్లో విడుదలవనుంది. తద్వారా ప్రభుత్వానికి తక్కువ ట్యాక్స్ చెల్లింపుతో పాటు వితారా బ్రిజా ఎస్‌యువికి ప్రత్యక్ష పోటీగా నిలబడే అవకాశం ఉంది.

వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్ మోటార్స్

హ్యుందాయ్ మోటార్స్ తమ అప్ కమింగ్ సబ్ నాలుగు మీటర్ల ఎస్‌యువి ధరను 10 లక్షల లోపు ధరతో విడుదల చేసే అవకాశం ఉంది.

వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్ మోటార్స్

హ్యుందాయ్ మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద హెచ్ఎన్‌డి-14 కార్లినొ కాన్సెప్ట్ అనే కాంపాక్ట్ ఎస్‌యువి ఆధారిత వాహనాన్ని ప్రదర్శించింది.

వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్ మోటార్స్

హ్యుందాయ్ వారి నాలుగవ ఎస్‌యువి ఖచ్చితంగా 2019 నాటికి విడుదలైతే అది ఈ కార్లినో కాన్సెప్ట్ రూపాన్ని సంతరించుకోనుంది.

వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్ మోటార్స్

హ్యుందాయ్ వారి నాలుగవ ఎస్‌యువి దాదాపుగా ఈ కాన్సెప్ట్ ఆధారంతో అభివృద్ది కానుంది. ఐ30 హ్యాచ్‌బ్యాక్ మరియు టక్సన్ డిజైన్ లక్షణాలతో హ్యుందాయ్ దీనిని రూపొందించింది. చివరికి ఐ10 ను రూపొందించిన వేదిక మీద ఐ20 మరియు క్రెటా లోని వివియోగించిన మేజర్ పార్ట్స్‌తో నిర్మితమవనుంది.

వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్ మోటార్స్

హైదరాబాద్‌లో ఉన్న హ్యుందాయ్ వారి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో డెవలప్‌ అవుతోంది. మరియు ఇక్కడ హ్యుందాయ్ అభివృద్ది చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ కూడా ఇదే. అయితే దీనికి తోబుట్టువుగా వ్యవహరించే ఐ20 లో వినియోగించిన ఇంజన్లను పొందడం లేదు.

వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్ మోటార్స్

సాంకేతికంగా ఇందులో 1.0-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. ఇందులోని మూడు సిలిండర్ల ఇంజన్ గరిష్టంగా 120బిహెచ్‌పి వరకు పవర్ ఉత్పత్తి చేయును.

వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్ మోటార్స్

హ్యుందాయ్ తమ నాలుగవ ఎస్‌యువిలో మ్యాన్యువల్ మరియు ఆటోమేటెడ్ ట్రాన్స్‌మిషన్ (ఏఎమ్‌టి) ల అనుసంధానంతో వచ్చే అవకాశం ఉంది.

వితారా బ్రిజాకు పోటీని సృష్టిస్తున్న హ్యుందాయ్ మోటార్స్

  • ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన హ్యుందాయ్ టక్సన్
  • మిలిటరీ రైళ్ల గురించి.. మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్..

Most Read Articles

English summary
Hyundai To Launch Maruti Suzuki Vitara Brezza Rival in 2019
Story first published: Tuesday, November 15, 2016, 16:09 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X