మారుతి నుండి శక్తివంతమైన హ్యాచ్‌బ్యాక్ విడుదల ఖరారు

మారుతి సుజుకి తమ బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ను మరింత స్పోర్టివ్‌గా బాలెనో ఆర్ఎస్ రూపంలో మార్కెట్లోకి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. దీని గురించి పూర్తి వివరాలు...

By Anil

మారుతి సుజుకి కార్ల తయారీ సంస్థకు అమ్మకాల పరంగా మంచి సక్సెస్ సాధించి పెట్టిన మోడల్ బాలెనో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్. విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు అత్యుత్తమ అమ్మకాలు సాధిస్తోంది ఈ బాలెనో. అయితే దీనిని స్పోర్టివ్ వేరియంట్లో బాలెనో ఆర్ఎస్ పేరుతో మరో వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేయడానికి మారుతి సిద్దమైంది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

బాలెనో మోడల్ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌కు కొనసాగింపుగా మరింత స్పోర్టివ్ మరియు శక్తివంతమైన బాలెనో ఆర్ఎస్ వేరియంట్‌ను మొదటి సారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించారు. అప్పట్లో దీనిని ఈ ఏడాది పండుగ సీజన్‌లో విడుదలకు సన్నాహాలు చేశారు.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

అయితే పండుగ సీజన్‌లో విపరీతమైన అమ్మకాలు మరియు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉండటం వలన దీనిని విడుదల విడుదలను వాయిదా వేశారు. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఇండియన్ మార్కెట్లో విడుదలకు సిద్దం చేశారు.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

ఈ బాలెనో ఆర్ఎస్ వేరియంట్లో మేజర్ హైలైట్ ఇది 1-లీటర్ సామర్థ్యం గల మూడు సిలిండర్ల బూస్టర్ జెట్ టర్బో ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో రావడం. ఈ ఇంజన్ గరిష్టంగా 111బిహెచ్‌పి వరకు పవర్ ఉత్పత్తి చేయగలదు.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడుపోతున్న బాలెనో వేరియంట్లలో ఈ ఇంజన్ కలదు. అయితే దేశీయంగా విడుదల కానున్న బాలెనో ఆర్ఎస్ వేరియంట్లో ఎలాంటి ట్రాన్స్‌మిషన్ పరిచయం చేస్తారో అనేది తెలియాల్సి ఉంది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ బాలెనో ఆర్ఎస్ వేరియంట్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

ఎక్ట్సీరియర్ పరంగా అగ్రెసివ్ లుక్‌తో బ్లాక్ అల్లాయ్ వీల్స్ సొబగులతో రానుంది. మారుతి ఈ హాట్ హ్యాచ్‌బ్యాక్ లోని అన్ని చక్రాలకు డిస్క్ బ్రేకులను అందిస్తోంది. మరియు ఆర్ఎస్ ట్యాగ్ లైన్‌కి సరపడే ఎక్ట్సీరియర్ డిజైన్ లక్షణాలను సొంతం చేసుకుంది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

ఇంటీరియర్ పరంగా బాలెనో టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ఫా ట్రిమ్‌లో ఉన్న అన్ని ఫీచర్లతో పాటు, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, స్మార్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఎలక్ట్రిక్ అవుట్ సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్ వంటి ఫీచర్లను రానున్నాయి.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

భద్రత పరంగా బాలెనో ఆర్ఎస్ వేరియంట్లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, రివర్స్ కెమెరా మరియు పార్కింగ్ సెన్సార్లు కలవు. మారుతి దీని విడుదలతో దేశీయంగా ఉన్న పర్ఫామెన్స్ హ్యాచ్‌బ్యాక్ శ్రేణిలో ఎంట్రీ ఇవ్వనుంది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

మారుతి బాలెనో ఆర్ఎస్ మోడల్‌ను దీని తోబుట్టువయిన సాధారణ బాలెనో కన్నా ఎక్కువ ధరతో విడుదల కావచ్చు. విపణిలోకి రూ. 8.1 లక్షల ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

మారుతి సుజుకి ఈ బాలెనో ఆర్ఎస్ వేరియంట్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదలైతే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వోక్స్‌వ్యాగన్ పోలో జిటి మరియు ఫియట్ పుంటో ఎవో అబర్త్ వంటి వాటికి పోటీగా నిలవనుంది.

మారుతి సుజుకి బాలెనో ఆర్ఎస్

  • టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో కొత్త కార్లకు స్థానం: మొదటి సారిగా టాటా ఎంట్రీ...!!
  • ఈ దేశాలలో ఆది వారాల్లో ఆ పనులు అస్సలు చేయకూడదంట...!!
  • ఇండియన్ రైల్వేలోకి మరో అరుదైన సర్వీసు

Most Read Articles

English summary
Maruti Suzuki Baleno RS To Be Launched In February 2017
Story first published: Monday, December 12, 2016, 18:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X