2016 జూన్‌లో కొత్త కార్ల మీద ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు

By Anil

ప్రతి నెలలాగే జూన్ కూడా కొత్త కార్ల మీద కొన్ని కొత్త ఆఫర్లను, డిస్కౌంట్లను తీసుకువచ్చింది. ఆటో ఇండస్ట్రీలో అమ్మకాల జోరు పెరగాలంటే తయారీదారులు కనుగొన్న మంత్రం ఆఫర్లు. ఎంతటి వాడైనా ఆఫర్లు అనగానే ఓ చూపు చూస్తాడు. అందుకేనన్నమాట. కొనే వారికి గానీ, అమ్మే వారికి గానీ ఆఫర్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. మరి 2016 జూన్‌లో ఏయే సంస్థ ఏ విధమైన ఆఫర్లను మరియు డిస్కౌంట్లను అందుబాటులో ఉంచాయో క్రింది కథనంలో అందించాము.

నిస్సాన్ మైక్రా

నిస్సాన్ మైక్రా

నిస్సాన్ సంస్థ తక్కువ అమ్మకాలు జరుపుతున్న మైక్రా హ్యాచ్‌బ్యాక్ కారు మీద 40,000 రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. కొంత మంది నిస్సాన్ డీలర్లు వినియోగదారుల కోసం కొన్ని యాక్ససరీలను కూడా ఉచితంగా అందిస్తున్నారు.

నిస్సాన్ మైక్రా గురించి

నిస్సాన్ మైక్రా గురించి

నిస్సాన్ మైక్రా కారు పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంధన వేరియంట్లలో కూడా లభ్యమవుతోంది. ఇందులోని పెట్రోల్ వేరియంట్ 18.44 కిమీలు మరియు డీజల్ వేరియంట్ 23.08 కిమీల మైలేజ్ ఇవ్వగలవు. మైక్రా పెట్రోల్ 6.43 లక్షలు మరియు మైక్రా డీజల్ 7.63 లక్షలు ప్రారంభ ధర ఆన్ రోడ్ (హైదరాబాద్‌)‌గా ఉన్నాయి.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10

హ్యుందాయ్ మోటార్స్ వారి గ్రాండ్ ఐ10 లోని వివిధ రకాల వేరియంట్ల మీద సుమారుగా 40,000 ల రుపాయల వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. విశాలమైన ఇంటీరియర్ స్పేస్ మరియు నాణ్యమైన క్యాబిన్ ఉపకరణాలు మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.

గ్రాండ్ ఐ10 గురించి

గ్రాండ్ ఐ10 గురించి

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. పెట్రోల్ ఐ10 లీటర్‌కు 18.9 కిమీలు మరియు డీజల్ ఐ10 లీటర్‌కు 24 కిమీల మైలేజ్‌ ఇవ్వగలవు. పెట్రోల్ మరియు డీజల్ గ్రాండ్ ఐ10 ధరలు వరుసగా 5.74 మరియు 6.81 లక్షలు ఆన్ రోడ్ (హైదరాబాద్‌)గా ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ పోలో

వోక్స్‌వ్యాగన్ పోలో

వోక్స‌వ్యాగన్ సంస్థ తమ పోలో కారు మీద 30,000 వరకు డిస్కౌంటును ప్రకటించింది. వోక్స్‌వ్యాగన్ తాజాగా ఫేస్‌లిఫ్ట్ రూపంలో కూడా అందుబాటులోకి వచ్చింది. అందులో కూడా ఈ ఆఫర్లు ఉన్నాయి.

పోలో గురించి

పోలో గురించి

వోక్స్‌వ్యాగన్ పోలో రెండు ఇంధన వేరియంట్లలో అందుబాటులో ఉంది. పోలో పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 16.47 కిమీలు మరియు పోలో డీజల్ వేరియంట్ లీటర్‌కు 20.14 కిమీలు మైలేజ్‌ని ఇవ్వగలవు. పోలో పెట్రోల్ మరియు డీజల్ ఆన్ రోడ్ ప్రారంభ ధరలు వరుసగా 6.50 మరియు 8.20 లక్షలు హైదరాబాద్‌గా ఉన్నాయి.

టయోటా కరోలా ఆల్టిస్

టయోటా కరోలా ఆల్టిస్

టయోటా మోటార్స్ ఈ కరోలా ఆల్టిస్ సెడాన్ మీద సుమారుగా 60,000 రుపాయల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

కరోలా ఆల్టిస్ గురించి

కరోలా ఆల్టిస్ గురించి

టయోటా కరోలా ఆల్టిస్ కారులో పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లు కలవు. ఇవి వరుసగా 16.7 మరియు 21.3 కిమీల మైలేజ్ ఇవ్వగలవు. కరోలా ఆల్టిస్ పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్ల ప్రారంభ ఆన్ రోడ్ ధరలు 16.46 మరియు 17.71 లక్షలు (హైదరాబాద్‌)గా

ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ జెట్టా

వోక్స్‌వ్యాగన్ జెట్టా

శక్తివంతమైన వోక్స్‌వ్యాగన్ జెట్టా సెడాన్‌లో ఉత్తమ పనితీరు కనబరిచే డీజల్ ఇంజన్ కలదు. జెట్టా సెడాన్ మీద వోక్స్‌వ్యాగన్ సుమారుగా 60,000 ల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.

జెట్టా గురించి

జెట్టా గురించి

వోక్స్‌వ్యాగన్ జెట్టా లో పెట్రోల్ మరయు డీజల్ వేరియంట్లు కలవు, ఇందులోని పెట్రోల్ 14.69 కిమీలు మరియు డీజల్ 19.33 కిమీలు మైలేజ్ ఇవ్వగలవు. వీటి ప్రారంభ ధరలు పెట్రోల్ జెట్టా 17.91 మరియు డీజల్ జెట్టా 19.31 లక్షలు అన్ రోడ్ (హైదరాబాద్‌)గా ఉన్నాయి.

స్కోడా ఆక్టావియా

స్కోడా ఆక్టావియా

సౌకర్యవంతమైన మరియు ఖరీదైన లగ్జరీ సెడాన్ కార్లకు పెట్టింది పేరు స్కోడా. స్కోడా వారి ఆక్టావియా సెడాన్ లోని మ్యాన్యువల్ వేరియంట్ల మీద 1.25 లక్షలు మరియు ఆటోమేటిక్ వేరియంట్ల మీద 40,000 రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించారు.

స్కోడా ఆక్టావియా గురించి

స్కోడా ఆక్టావియా గురించి

స్కోడా ఆక్టావియాలోని పెట్రోల్ లీటర్‌కు 16.8 మరియు డీజల్ వేరియంట్ లీటర్‌కు 20.6 కిమీలు మైలేజ్‌ ఇవ్వగలవు. వీటి ప్రారంభ ధరలు పెట్రోల్ ఆక్టావియా 20 మరియు డీజల్ ఆక్టావియా 22.25 లక్షలు అన్ రోడ్ (హైదరాబాద్‌)గా ఉన్నాయి.

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా స్కార్పియో

మహీంద్రా వారు తమ బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యువి స్కార్పియో మీద 25,000 రుపాయల వరకు డిస్కౌంట్ ప్రకటించారు.

స్కార్పియో గురించి

స్కార్పియో గురించి

మహీంద్రా స్కార్పియో కేవలం డీజల్ ఇంజన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది సుమారుగా 15.4 కిమీల మైలేజ్ ఇవ్వగలదు. దీని ప్రారంభ వేరియంట్ ధర రూ. 11.05 లక్షలు ఆన్ రోడ్ (హైదరాబాద్‌)గా ఉంది.

షెవర్లే ఎంజాయ్

షెవర్లే ఎంజాయ్

మారుతి సుజుకి వారి ఎర్టిగా ఎమ్‌పివి కారుకు పోటీగా షెవర్లే ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకువచ్చిన ఏంజాయ్ ఎమ్‌పివి వాహనం మీద సుమారుగా 50,000 రుపాయల వరకు డిస్కౌంటును ప్రకటించింది.

ఎంజాయ్ ఎమ్‌పివి గురించి

ఎంజాయ్ ఎమ్‌పివి గురించి

ఎంజాయ్ ఎమ్‌పివి వాహనంలో 13.7 కిమీలు మైలేజ్ ఇవ్వగల పెట్రోల్ మరియు 18.2 కిమీలు మైలేజ్ ఇవ్వగల డీజల్ ఇంజన్‌లను అందించారు. ఎంట్రీలెవల్ ఎంజాయ్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 7.82 మరియు షెవర్లే ఎంజాయ్ డీజల్ వేరియంట్ ధర రూ. 9.49 లక్షలు ఆన్ రోడ్ (హైదరాబాద్‌)గా ఉన్నాయి.

రెనో డస్టర్

రెనో డస్టర్

రెనో ఇండియన్ మార్కెట్లోకి తాజాగా డస్టర్ ఫేస్ లిఫ్ట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయినప్పటికీ ఫేస్‌లిఫ్ట్ కన్నా ముందున్న డస్టర్‌లకు మంచి గిరాకీ ఉంది. అందుకే ఇప్పటికీ ఆ డస్టర్‌లు షోరూమ్‌లో లభిస్తున్నాయి. డస్టర్‌లోని వేరియంట్ల ప్రకారం లక్ష మరియు ఇంకా ఎక్కువగా డిస్కౌంట్లను ప్రకటించారు.

రెనో డస్టర్ గురించి

రెనో డస్టర్ గురించి

రెనో డస్టర్‌లో 13.6 కిలోమీటర్లు ఇవ్వగల పెట్రోల్ మరియు 19.87 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల ఎంట్రీలెవల్ డీజల్ వేరియంట్లు ఉన్నాయి. ఎంట్రీలెవల్ డస్టర్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 10.18 మరియు డస్టర్ డీజల్ వేరియంట్ ధర రూ. 11.12 లక్షలు ఆన్ రోడ్ (హైదరాబాద్‌)గా ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ

2016 జూన్ నెలకు గాను మెర్సిడెస్ బెంజ్ సంస్థ తమ జిఎల్‌ఎ ఎస్‌యువి మీద సుమారుగా 3.5 లక్షల రుపాయల వరకు డిస్కౌంట్లు అందిస్తున్నారు. ఇది పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది.

జిఎల్‌ఎ ధర మరియు ఇతర వివరాలు

జిఎల్‌ఎ ధర మరియు ఇతర వివరాలు

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎలోని పెట్రోల్ వేరియంట్ 13.7 కిమీలు మరియు డీజల్ వేరియంట్ 17.9 కిమీలు మైలేజ్ ఇవ్వగలవు. జిఎల్‌ఎ ఎంట్రీ లెవల్ పెట్రోల్ ధర రూ. 43.65 లక్షలు మరియు డీజల్ వేరియంట్ ధర రూ. 39.87 లక్షలు ఆన్ రోడ్ హైదరాబాద్‌గా ఉన్నాయి.

ఆడి క్యూ3

ఆడి క్యూ3

ఆడి వారి క్యూ3 కారు ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెర్సిడెస్ బెంజ్ మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్‌యువిలకు పోటీగా నిలిచింది. ఈ క్యూ3 ఎస్‌యువి మీద సుమారుగా 3 లక్షలు రుపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించారు.

ఆడి క్యూ3 ఎస్‌యువి గురించి

ఆడి క్యూ3 ఎస్‌యువి గురించి

ఆడి క్యూ3 ఎస్‌యువి కేవలం డీజల్ ఇంజన్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది లీటర్‌కు 17.71 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. క్యూ3 ఎంట్రీ లెవల్ ధర రూ. 36.05 లక్షలు ఆన్ రోడ్ (హైదరాబాద్‌)గా ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5

బవేరియన్ మోటార్ వర్క్స్ , బిఎమ్‌డబ్ల్యూ సంస్థ తమ ఎక్స్5 ఎస్‌యువి మీద గరిష్టంగా ఆరు లక్షల రుపాయల వరకు డిస్కౌంట్ ప్రకటించారు. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు.

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యువి గురించి

బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యువి గురించి

ఈ ఎక్స్5 ఎస్‌యువి పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లలో అందుబాటులో కలదు. ఎక్స్5 పెట్రోల్ ధర రూ. 1.62 కోట్లు మరియు డీజల్ ఎక్స్5 ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ. 67.90 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

మరిన్ని కథనాల కోసం...

బడ్జెట్ కార్ల మీద భారీ ఆఫర్లు

17 సంస్థలకు చెందిన 63 కార్లకు అక్కడ నో ఎంట్రీ

యథా ఇండియన్స్ తధా కార్స్ :) భద్రత గురించి మాట్లాడకండి...!!

Most Read Articles

English summary
New Car Discounts For June 2016
Story first published: Wednesday, June 8, 2016, 14:47 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X