మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్‌గా పవన్ గోయెంకా

మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్‌గా పవన్ గోయెంకా నియమితులయ్యారు.

By Anil

భారతీయ వాహన పరిశ్రమలో విభిన్న వాహనాలు తయార సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలోని కీలక పదవుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా బోర్డ్ సభ్యులు తీసుకున్న నిర్ణయం ప్రకారం సంస్థ యొక్క ఎక్జ్సిక్యూటివ్ ఛైర్మెన్‌గా ఆనంద్ మహీంద్రా మరియు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా పవన్ గోయెంకా నియమితులయ్యారు.

మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా

దిగ్గజ సంస్థల్లోని కీలక పదవుల్లో సరైన మార్పులు జరగపోతే వాటి పతనం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణగా టాటా మోటార్స్‌ గురించి విమర్శించవచ్చు. అలాంటి పొరబాటు మహీంద్రా అండ్ మహీంద్రాలో చోటు చేసుకోకుండా కీలక పదవులైన మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఒ నుండి రూపాంతర చెందిన ఛైర్మన్ పదవుల్లో ముఖ్య వ్యక్తులను నియమించింది సంస్థ.

మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా

పవన్ గోయెంకాను కీలక పదవిలో నియమించిన తరువాత మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపిన ప్రకటనలో, మహీంద్రా అండ్ మహీంద్రా వరుస వృద్దికి సుమారుగా రెండు దశాబ్దాలు పవన్ తీసుకున్న సరళీకరణ పద్దతులు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపింది. దేశీయ వాహన పరిశ్రమ మీద అంచనా మరియు పరిశ్రమలో చోటు చేసుకుంటున్న మార్పులను అంచనా వేయడంలో పవన్ గోయెంకాకు మంచి అనుభవం ఉన్నట్లు తెలిపింది.

మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా

అమెరికాలోని డెట్రాయిట్ జనరల్ మోటార్స్ కార్ప్‌లో సుమారుగా 14 ఏళ్లు పనిచేసిన పవన్ గోయెంకా 1993 లో మహీంద్రా అండ్ మహీంద్రా లోని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగానికి మేనేజర్‌గా ప్రస్థానం మొదలుపెట్టాడు.

మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా

మహీంద్రా అండ్ మహీంద్రాలోని రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ లో కీలక పోత్ర పోషించాడు. ఇతని ఆధ్వర్యంలోనే మహీంద్రాకు పేరు తీసుకొచ్చిన స్కార్పియో రూపుదిద్దుకుంది. తరువాత 2013 లో మహీంద్రా అండ్ మహీంద్రా బోర్డ్ చేత ఎక్జ్సిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యాడు.

మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా

ఈ సందర్భంగా పవన్ గోయెంకా మాట్లాడుతూ, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా నన్ను ఎంపిక చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు, 23 ఏళ్ల క్రితం ఈ సంస్థలోకి అడుగుపెట్టిన నేను ఈ స్థాయికి ఎదుగుతానన్ని ఊహించలేదని తెలిపాడు. సంస్థ నియమించిన పదవిలో భాద్యతాయుతమైన విధులు నిర్వర్తిస్తానని తెలిపాడు.

మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా

  • విడుదల కంటే ముందుగా సుజుకి ఇగ్నిస్ డెలివరీ !!
  • ఈ నెలలో బజాజ్ క్రటోస్ విఎస్400 విడుదలకు సర్వం సిద్దం
  • మళ్లీ మెరిసిన హీరో మోటోకార్ప్ డాన్ 125 బైక్

Most Read Articles

English summary
Pawan Goenka Appointed As Managing Director Of Mahindra And Mahindra
Story first published: Friday, November 11, 2016, 18:11 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X