రెనో క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి వర్సెస్ మారుతి సుజుకి ఆల్టో కె10 ఏఎమ్‌టి

Written By:

మారుతి సుజుకికు చెందిన బెస్ట్ సెల్లింగ్ కారు ఆల్టో, అంతే కాదు దేశ వ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ మరియు ప్రతి నెలలో టాప్10 బెస్ట్ సెల్లింగ్ కార్లలో అన్నింటిలో ఇదే ముందు ఉంటోంది. అయితే దీని పునాదులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రెనో ఇండియా వారు మార్కెట్లోకి అందించిన క్విడ్ బుకింగ్స్‌లోను మరియు అమ్మకాల పరంగా చరిత్రను సృష్టించాయి.

అయితే ఈ తరుణంలో అమ్మకాల పరంగా జోరు పుంజుకోవడానికి మారుతి తమ కె10 కారులో ఆటోమేటిక్‌ గేర్ బాక్స్‌ను అందించింది. దీనిని ఆసరాగా చేసుకుని రెనో తమ క్విడ్ కారును కూడా 1.0-లీటర్ మరియు ఆటోమేటిక్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు.

విడుదల చేసిన అనతి కాలంలోనే విజయం సాధించిన రెనో క్విడ్ వారి కారు మరియు ఎన్నో ఎళ్ల కాలంగా విజయంలో ఉన్న మారుతి సుజకి వారి ఆల్టో కార్ల మధ్య పరస్పరం పోటీ తీవ్రమైంది. మీకు ఇందులో ఏది బెస్ట్ అనే సందేహం ఉంటే ఈ శీర్షికను తప్పుకుండా చదవాల్సిందే.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
క్విడ్ 1.0 ఏఎమ్‌టి డిజైన్

క్విడ్ 1.0 ఏఎమ్‌టి డిజైన్

రెనో మొదట్లో అందించిన క్విడ్ 800సీసీ కారుకు మరిన్ని మెరుగులు ఈ క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి వర్షెన్‌గా అందిచారు. కాని దానితో పోలిస్తే ఇది ఆకర్షణీయంగానే ఉంది. ప్రక్క వైపుల గల డోర్లకు ప్రత్యేకమైన ప్యానెల్1.0 మరియు ఈజీ-ఆర్ బ్యాడ్జి పేర్లను అందించారు.

ఆల్టో కె10 ఏఎమ్‌టి డిజైన్

ఆల్టో కె10 ఏఎమ్‌టి డిజైన్

మారుతి సుజుకి సాధారణ ఆల్టో కె10 కన్నా దీనిని చక్కగా డిజైన్ చేసింది. దీనికి ముందు వైపు ఉన్న హెడ్ ల్యాంప్స్ ఎంతో ఆకట్టుకుంటాయి, దీనికి తోడు ముందు వైపు ఫ్రంట్ గ్రిల్‌ పరిమాణం కూడా కొంచెం పెంచారు. మొత్తానికి దీని ఇంటీరియర్ కూడా బాగా విశాలంగా ఉండే విధంగా డిజైన్ చేశారు.

క్విడ్ ఏఎమ్‌టి ఇంజన్ వివరాలు

క్విడ్ ఏఎమ్‌టి ఇంజన్ వివరాలు

రెనో ఇండియా తమ క్విడ్ ఏఎమ్‌టి వెర్షన్‌లో 1.0-లీటర్ కెపాసిటి గల స్మార్ట్ కంట్రోల్ ఎఫీషియన్సీ గల ఇంజన్‌ను అందించారు.

క్విడ్ ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్

క్విడ్ ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్

రెనో క్విడ్ 1.0-లీటరక్ ఏఎమ్‌టి కారులోని ఇంజన్‌కు 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ను అందించారు, ఈ గేర్‌బాక్స్‌ను రెనో ఫార్ములావన్ ఇంజనీర్ల బృందం రూపొందించింది.

ఆల్టో కె10 ఏఎమ్‌టి ఇంజన్ వివరాలు

ఆల్టో కె10 ఏఎమ్‌టి ఇంజన్ వివరాలు

మారుతి సుజుకి వారి ఆల్టో కె10 ఆటో గేర్‌ షిప్ట్ కారులో 1.0-లీటర్ మూడు సిలిండర్ల కె-నెక్ట్స్ ఇంజన్ కలదు.

ఆల్టో కె10 ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ వివరాలు

ఆల్టో కె10 ఏఎమ్‌టి ట్రాన్స్‌మిషన్ వివరాలు

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు మారుతి సుజుకి 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసందానించారు. ఇది దాదాపుగా 67 బిహెచ్‌పి పవర్ మరియు 90 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేయును.

క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి ఫీచర్లు

క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి ఫీచర్లు

 • డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
 • క్రోమ్ ఫినిష్ గల ఎయిర్ వెంట్స్
 • మొదటిసారిగా 7-అంగుళాల తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ
 • న్యావిగేషన్ వ్యవస్థ
 • 300-లీటర్ల లగేజ్ స్పేస్
ఆల్టో కె10 ఏఎమ్‌టి ఫీచర్లు

ఆల్టో కె10 ఏఎమ్‌టి ఫీచర్లు

 • గేర్ షిఫ్ట్ డిజిటల్ డిస్ల్పే
 • ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో వచ్చే ఏడాదిలో రానుంది.
 • అయితే సాదారణ ఆల్టో కె10 లో ఉన్న అన్ని ఫీచర్లతో పాటు ఇవి రానున్నాయి.
భద్రత

భద్రత

2017 నుండి భారత్‌లో విడుదలయ్యే ప్రతి కారులో కూడా ముందు వైపు రెండు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్‌ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో రానున్నాయి. అయితే రెనో క్విడ్ ఈ ఫీచర్లను అందించనున్నారు.

ఆల్టో కె10 భద్రత

ఆల్టో కె10 భద్రత

మారుతి సుజుకి వారు తమ ఆల్టో కె10 ఆటోగేర్‌షిఫ్ట్ వేరియంట్లో రెండు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లను 2017 లో విడుదల చేసే కె10 లో అందివ్వనున్నారు.

ధర వివరాలు

ధర వివరాలు

 • మారుతి ఆల్టో కె10 ఆటోగేర్‌షిఫ్ట్ ధర రూ. 4.06 లక్షల నుండి ప్రారంభం కానుంది.
 • రెనో క్విడ్ 1.0-లీటర్ ఏఎమ్‌టి ధర దాదాపుగా 3.10 నుండి 3.90 లక్షల మధ్య ఉండవచ్చు(ఇంకా విడుదల కాలేదు)
 • గమనిక: ఇచ్చిన ధరలు ఎక్స్ షోరూమ్‌ (ఢిల్లీ) గా ఉన్నాయి.
తీర్పు

తీర్పు

ఇప్పటికీ మారుతి సుజుకి ఆల్టో కార్లనే ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. మార్కెట్లో అగ్రభాగాన కొనసాగుతున్న అల్టో కారుతో క్విడ్ పోటి అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అందులో కూడా యువత కొత్త దనం కోరుకుంటోంది. అందులో భాగంగానే క్విడ్ కారును ఎక్కువ మంది కోరుకుంటున్నారు. మేము కూడా క్విడ్ కారునే ఎంపిక చేస్తాం.

English summary
Renault Kwid 1.0 AMT Vs Maruti Suzuki Alto K10 AMT Comparison
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark