క్లింబర్, రేసర్ అంటూ రెనో క్విడ్ లో మరిన్ని వేరియంట్లు

ఇక మీదట క్విడ్ లైనప్‌లోకి ప్రతి ఏడాది ఒక కొత్త వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు రెనో ఇండియా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. నూతన వేరియంట్లు వివరాలు...

By Anil

ఫ్రెంచ్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ ఇప్పుడిప్పుడే దేశీయం ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో తన ప్రాబల్యాన్ని చాటుకుంటోంది. ప్రారంభంలో డస్టర్ కాంపాక్ట్ ఎస్‌యువితో విజయాన్ని అందుకున్న రెనో ఆ తరువాత విడుదల చేసిన క్విడ్‌ ద్వారా రికార్డులన్నింటిని తిరిగి లిఖించింది. క్విడ్ విజయాన్ని అలాగే కొనసాగించేందుకు. క్విడ్‌ను 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న ఇంజన్‌తో మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో విడుదల చేసింది.

రెనో క్విడ్ కొత్త వేరియంట్లు

రెనో ఇండియా గత ఏడాది సెప్టెంబర్ లో క్విడ్ ద్వారా సక్సెస్‌ ఛాప్టపర్‌ను ప్రారంభించింది. దీని ప్రబావం కొనసాగుతున్నట్లే క్విడ్‌ను 1.0-లీటర్ శక్తివంతమైన ఇంజన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లలో మళ్లీ విడుదల చేసింది.

రెనో క్విడ్ కొత్త వేరియంట్లు

ఏడాది తిరిగేసరికి రెనో ఏకంగా లక్షకు పైగా క్విడ్ కార్లను విక్రయించింది. దీనికి ముఖ్య కారణాలుగా గరిష్ట ఫీచర్లు, డిజైన్, సరసమైన ధర మరియు నాణ్యమైన ఉత్పత్తి వంటి వాటిని చెప్పుకోవచ్చు.

రెనో క్విడ్ కొత్త వేరియంట్లు

అయితే ఇప్పుడు రెనో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణ అధికారు (CEO) మాట్లాడుతూ, ఇక మీద క్విడ్ బ్రాండ్ పేరుతో ప్రతి ఏడాది కూడా ఒక కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపాడు.

రెనో క్విడ్ కొత్త వేరియంట్లు

క్విడ్ ను వివిధ వేరియంట్లో ఏడాదికి ఒకటి చొప్పున విడుదల చేస్తూ భారీ స్థాయిలో లక్ష్యాలని పెట్టుకుంది రెనో. ఈ ఏడాది మొత్తం ఆటోమొబైల పరిశ్రమంలో 5 శాతం వాటాను సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంది. మరియు 2023 నాటికి దేశీయంగా అమ్మకాల పరంగా టాప్ 10 లోని మొదటి మూడులో స్థానాన్ని భర్తీ చేయాలనే ఆలోచనలో ఉంది.

రెనో క్విడ్ కొత్త వేరియంట్లు

రెనో నమ్మిన సత్యం: అంతర్జాతీయ స్టైల్లో దేశీయంగా వాహనాలను అందిస్తే ఈగల తోలుకోవడం గ్యారంటీ. అందుకోస అత్యంత సరసమైన ధరతో. తగినన్ని నాణ్యతా ప్రమాణాల మేళవింపుతో మైలేజ్ మీద దృష్టి పెట్టి సాధారణ మరియు మద్య తరగతి ప్రజలను టార్గెట్ చేసుకుని ఉత్పత్తులు అభివృద్ది చేస్తే విజయం ఖాయం అని రెనో నమ్మింది.

రెనో క్విడ్ కొత్త వేరియంట్లు

అయితే రానున్న కాలంలో రెనో సంస్థ మారుతి దారిలోనే అడుగులు వేయనుంది.

రెనో క్విడ్ కొత్త వేరియంట్లు

క్విడ్ బ్రాండ్ పేరుతో ఏడాదికి ఒకటి చెప్పును నూతన వేరియంట్లను విడుదల చేస్తున్నట్లు రెనో ప్రకటించింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద రెండు ఉత్పత్తులను ప్రదర్శించింది. అంటే భవిష్యత్ మార్కెట్‌పై దూరదృష్టితో వాటిని ప్రదర్శించనట్లు తెలిసింది.

రెనో క్విడ్ కొత్త వేరియంట్లు

ఇక రానున్న రెండేళ్లలో విడుదల కానున్న క్విడ్ వేరియంట్లు క్లిబర్ మరియు రేసర్ అనే పేర్లతో అందుబాటులోకి రానున్నాయని పుకార్లు కూడా పుడుతున్నాయి.

రెనో క్విడ్ కొత్త వేరియంట్లు

అదే ఇంజన్ మరియు డిజైన్ లక్షణాలకు అదనంగా కొన్ని కొత్త ఫీచర్లను జోడింస్తూ ఫేస్‌లిప్ట్ లేదా న్యూ జనరేషన్ అనే మసుగులో ఈ క్విడ్ యొక్క కొత్త వేరియంట్లు విడుదల కానున్నాయి.

రెనో క్విడ్ కొత్త వేరియంట్లు

రెనో క్విడ్ కొత్త వేరియంట్...

రెనో క్విడ్ కొత్త వేరియంట్లు

  • ఈ విమానం వేగం గంటకు 2,335 కిలోమీటర్లు..!!
  • బీహార్ కుర్రాడి అద్బుత సృష్టి: పెట్రోల్, డీజల్, కిరోసిన్ & LPG తో నడిచే బైకు
  • ఎయిర్ ట్రావెల్ గురించి మీకు తెలియని ఇంట్రెస్టింగ్ నిజాలు

Most Read Articles

Read more on: #రెనో #renault
English summary
More Variants Of Renault Kwid To Be Launched In India
Story first published: Thursday, November 17, 2016, 14:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X