20 ఏళ్ల పాటు మార్కెట్లో కొనసాగిన స్కోడా ఆక్టావియా

By Anil

స్కోడా ఆటో ఇండియాలోకి ఎన్ని ఉత్పత్తులను అందించింది అంటే వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. అందులో ఆక్టావియా సెడాన్ ఒకటి. స్కోడా తమ ఆక్టావియాను అందుబాటులోకి తెచ్చి ఎన్ని రోజులు అయ్యిందో తెలుసా ? ఏకంగా 20 ఏళ్ల కాలం గడిచిపోయింది.

స్కోడా ఆక్టావియా

రెండు దశాబ్దాల క్రితం విడుదలైన స్కోడా ఆక్టావియా ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో అందుబాటులో ఉంది. మొదటి ఆక్టావియా సెడాన్ సెప్టెంబర్ 3, 1996న విడుదలైంది. ఇన్నేళ్ల కాలంలో కేవలం నాలుగైదు ఉత్పత్తులనే అందుబాటులో ఉంచింది అనే అనుమానం చాలా మందికే కలిగి ఉంటుంది. వీరి ఉత్పత్తులు చాలా ఖరీదైన, విలాసవంతమైనవి.

స్కోడా ఆక్టావియా

సిజెక్ రిపబ్లిక్ మాతృ సంస్థ అధ్యక్షుడు వక్లావ్ హావెల్ మొదటి సారిగా స్కోడా ఆక్టావియా ఉత్పత్తిని ప్రారంభించాడు. అంతే కాకుండా మలదావ్ బోస్లేవియాలోని ప్లాంటులో ఆక్టావియాలతో పాటు మరిన్ని ఇతర ఉత్పత్తులను కూడా ఉత్పత్తి చేసే వారు.

స్కోడా ఆక్టావియా

ప్రస్తుతం చైనా, ఇండియా, రష్యా మరియు కజకిస్తాన్ లలో స్కోడా తమ ఆక్టావియా సెడాన్‌లను ఉత్పత్తి చేస్తోంది.

స్కోడా ఆక్టావియా

స్కోడా ఆటో తమ మొదటి ఆక్టావియాను విడుదల చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 50 లక్షల యూనిట్ల వరకు అమ్ముడుపోయాయి.

స్కోడా ఆక్టావియా

అంతర్జాతీయ మార్కెట్లో ఈ స్కోడా ఆక్టావియా రెండు బాడీ స్టైళ్లలో అందుబాటులో ఉన్నాయి. అవి సెలూన్ మరియు ఎస్టేట్.

స్కోడా ఆక్టావియా

ఇన్నేళ్ల కాలంలో స్కోడా కేవలం సెలూన్ స్టైల్ ఆక్టావియాను మాత్రమే ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. అయితే ఎస్టేట్ స్టైల్ గల ఆక్టావియాను ఎప్పుడు విడుదల చేస్తారో అనే దాని మీద ఆశలు కూడా లేవు.

స్కోడా ఆక్టావియా

ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్కోడా ఆక్టావియా ఒక డీజల్ మరియు రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. అవి 2.0-లీటర్ డీజల్, 1.4-పెట్రోల్ మరియు 1.8-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లు.

స్కోడా ఆక్టావియా

ట్రాన్స్‌మిషన్‌ల పరంగా డీజల్ ఇంజన్ ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌లలో, 1.4-లీటర్ ఇంజన్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అదే విధంగా 1.8-లీటర్ ఇంజన్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ గల ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి.

స్కోడా ఆక్టావియా

ప్రారంభ వేరియంట్ స్కోడా ఆక్టావియా ధర రూ. 17.01 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్‌)గా మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 23.11 లక్షలు ఎక్స్ షోరూమ్ (ముంబాయ్‌)గా ఉన్నాయి. స్కోడా ఆక్టావియాకు సంభందించిన మరియు ఇండియాలోకి స్కోడా విడుదల చేయనున్న ఉత్పత్తుల గురించి పూర్తి వివరాల కోసం డ్రైవ్‌స్పార్క్‌ తెలుగుతో కలిసి ఉండండి.

స్కోడా ఆక్టావియా

  • దేశీయంగా ఎగరనున్న మహీంద్రా విమానాలు
  • మీ కారులో ఏసి ని వినియోగిస్తున్నారా ?
  • తలతిక్క డ్రైవర్లందరూ ఇక్కడే ఉన్నారంట జాగ్రత్త మరి...!!

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
Skoda Octavia Has Been In Continuous Production For 20 Years
Story first published: Tuesday, September 6, 2016, 17:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X