2016 ఆర్థిక సంవత్సరంలో పది వరెస్ట్ సెల్లింగ్ కార్లు

By Anil

ప్రతి మాసం మరియు ప్రతి ఏడాది కూడా గరిష్టంగా అమ్మకాలు సాధించిన టాప్-10 కార్లు గురించి ప్రత్యేక కథనాలు చదువుతుంటారు కదా . దీని వలన ఎక్కువ మంది ఇవే కార్లను ఎంపిక చేసుకోవడానికి ఆస్కారముంది. అయితే అతి తక్కువ అమ్మకాలు సాధించిన కార్ల గురించి తెలుసుకున్నారా ? వీటితో మనకేంటి పని అనుకునేరు. ఈ జాబితా ద్వారా మనం బై మిస్టేక్‌ కూడా ఇలాంటివి ఎంచుకోకుండా ఉండేందుకు సహాయపడతాయి.

గడిచిన 2016 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 7.8 శాతం వరకు వృద్దిని సాధించినప్పటికీ, ఇండియన్ మార్కెట్లో కొన్ని ఉత్పత్తుల అమ్మకాలు డీలాపడ్డాయి. గత ఏడాది నుండి నూతన కార్ల మార్కెట్లోకి విడుదల కావడం ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో అతి తక్కువ అమ్మకాలు సాధించిన కార్ల గురించి క్రింది కథనం ద్వారా అందిస్తున్నాము ఓ లుక్కేసుకోండి.

10. వోక్స్‌వ్యాగన్ జెట్టా

10. వోక్స్‌వ్యాగన్ జెట్టా

2016 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తీసిన చిట్టాలో అతి తక్కువ అమ్మకాలు సాధించిన కార్లలో పదవ స్థానంలో ఉంది వోక్స్‌వ్యాగన్‌కు చెందిన జెట్టా. 1940 యూనిట్ల అమ్మకాలతో 10 శాతం వృద్దిని కోల్పోయింది.

09. ఫియట్ అవెంచురా

09. ఫియట్ అవెంచురా

ఫియట్ వారి అవెంచురా హ్యాచ్‌బ్యాక్ కారు 1906 యూనిట్లు అమ్మకాలు జరిపింది అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఫలితాలతో పోల్చుకుంటే 22 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. అయినప్పటికీ తక్కువ అమ్మకాలు సాధించిన కార్ల జాబితాలో ఇది తొమ్మిదవ స్థానంలో ఉంది.

08. రెనో పల్స్

08. రెనో పల్స్

రెనో వారి క్విడ్ కారుకు పై స్థానంలో మార్కెట్లో అందుబాటులో ఉన్న బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కారు పల్స్ గత ఆర్థిక సంవత్సరంలో 1712 యూనిట్లు అమ్ముడుపోయి. 26 శాతం తక్కువ వృద్దిని సాధించింది.

07. హ్యుందాయ్ ఎలంట్రా

07. హ్యుందాయ్ ఎలంట్రా

హ్యుందాయ్ మోటార్స్ వారి ఎలంట్రా సెడాన్ కారు గత ఆర్థిక సంవత్సరం ఫలితాల్లో 1708 యూనిట్లు అమ్మకాల జరిపి 42 శాతం తిరోగమన వృద్దితో ఏడవ స్థానంలో నిలిచింది.

06. షెవర్లే సెయిల్ యువిఎ

06. షెవర్లే సెయిల్ యువిఎ

షెవర్లే సెయిల్ యువిఎ కారు 1507 యూనిట్ల అమ్ముడుపోయి 64 శాతం తిరోగమన వృద్దిని సాధించింది, అంతకు ముందు ఏడాదిలో సెయిల్ యువిఎ కారు ఈ జాబితాలో లేదు, కేవలం గత ఏడాదిలో తక్కువ అమ్మకాలు సాధించి ఆరవ స్థానంలో నిలిచింది.

05. ఫియట్ లీనియా

05. ఫియట్ లీనియా

ఫియట్ వారి లీనియా సెడాన్ కారు 1447 యూనిట్లు అమ్మకాలు సాధించి 37 శాతం తక్కువ వృద్దిని నమోదు చేసుకుని ఈ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచింది.

04. షెవర్లే క్రూయిజ్

04. షెవర్లే క్రూయిజ్

షెవర్లే సంస్థకు గత ఆర్థిక సంవత్సరం పెద్దగా కలిసి రాలేదు అన్ని చెప్పవచ్చు. షెవర్లే వారి ఎక్కువ ఉత్పత్తులు ఈ జాబితోలు చేరాయి. అందులో క్రూయిజ్ కారు ఏడాది మొత్తానికి 935 యూనిట్లు మాత్రమే అమ్మకాలు జరిపి 33 శాతం వృద్దిని కోల్పోయింది.

03. రెనో స్కాలా

03. రెనో స్కాలా

రెనో వారి మరొక ఉత్పత్తి స్కాలా సెడాన్, ఇది గత ఆర్థిక ఏడాది అమ్మకాలలో కేవలం 830 యూనిట్లు మాత్రమే అమ్మకాలు జరిపింది. వృద్ది పరంగా చూస్తే 44 శాతం నష్టపోయింది.

02. వైబ్

02. వైబ్

మహీంద్రా అండ్ మహీంద్రా వారి ఏకైక ఉత్పత్తి వైబ్ కారు ఈ టాప్-10 జాబితాలో స్థానం దక్కించుకుంది. ఏడాది మొత్తానికి కేవలం 609 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. అంతకు ముందు ఏడాది అమ్మకాలతో పోల్చుకుంటే సగానికి పైగా తక్కువ అమ్ముడయ్యాయి.

01. రెనో ఫ్లూయెన్స్

01. రెనో ఫ్లూయెన్స్

గడిచిన 2016 ఆర్థిక సంవత్సరం కార్ల అమ్మకాలలో అతి తక్కువ అమ్ముడుపోయిన కార్ల జాబితాలో ఉన్న మొదటి కారు రెనో ఫ్లూయెన్స్ కేవలం 113 కార్ల అమ్మకాలు మాత్రమే జరిపింది. వృద్ది పరంగా చూస్తే 51 శాతం తిరోగమనంలో ఉంది.

మరిన్ని కథనాల కోసం....

గడిచిన 2016 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక అమ్మకాలు సాధించిన టాప్-10 కార్లు

ఇండియన్ మార్కెట్లో 150 సెగ్మెంట్లో అత్యధిక మైలేజ్ ఇవ్వగల టాప్-10 బైకులు

మరిన్ని కథనాల కోసం....

నాగసాకి మరియు హిరోషిమా నగారలను నాశనం చేసిన విమానం బోయింగ్ బి-29 గురించి ఆసక్తికరమైన విషయాలు

ఇండియన్ సెలబ్రిటీలు కార్లను ఇలా కస్టమైజ్ చేయించుకుంటారా ?

Most Read Articles

English summary
Ten least selling cars in FY16
Story first published: Tuesday, April 19, 2016, 12:25 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X