2016 లో విపణిలోకి విడుదలైన అత్యుత్తమ కార్లు

Written By:

2016 సంవత్సరంలో విభిన్న సెగ్మెంట్లలో విభిన్న వేరియంట్లలో సుమారుగా 40 వరకు కొత్త కార్లు విడుదలయ్యాయి. అందులో అత్యంత పోటీతత్వమైన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్, సెడాన్, యుటిలిటి వాహనాలు, క్రాసోవర్లు, ఎస్‌యువిలు, స్పోర్ట్స్ కార్లు మరియు కొన్ని అత్యంత విలాసవంతమైన కార్ల సెగ్మెంట్లలోకి విడుదలయ్యాయి.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

దేశీయంగా ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ది అంతర్జాతీయ పటంలో ఇండియా అతి పెద్ద విపణిగా అవతరిస్తోంది. ఇప్పుడు ప్రపంచ కార్ల తయారీ సంస్థలకు భారత్ అతి ముఖ్యమైన మార్కెట్‌గా నిలిచింది. నేటి కథనంలో 2016 లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన అత్యుత్తమ కార్ల గురించి తెలుసుకుందాం రండి.

టయోటా ఇన్నోవా క్రిస్టా

టయోటా ఇన్నోవా క్రిస్టా

టయోటా కిర్లోస్కర్ ఇండియా దేశీయ విపణిలోకి క్రిస్టా ఎమ్‌పివి ని మే 2016 లో విడుదల చేసింది. మునుపటి ఇన్నోవా ఎమ్‌పివి కన్నా నూతన డిజైన్ శైలి, పనితీరు, ఫీచర్లు మరియు గ్రాండ్‌ వంటి అంశాలన్నింటి చేర్చి క్రిస్టాగా ఆవిష్కరించింది. ఇన్నోవా క్రిస్టా దేశీయ మార్కెట్లోకి విడుదలైన సమయం నుండి 50,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

సాంకేతికంగా 2,694సీసీ సామర్థ్యం ఉన్న పెట్రోల్, 2.393సీసీ సామర్థ్యం ఉన్న డీజల్ మరియు 2,755సీసీ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ వేరియంట్లు కలవు. ఇందులోని 2.6-లీ పెట్రోల్ వేరియంట్ గరిష్టంగా 1637బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ టార్క్, 2.3-లీ డీజల్ వేరియంట్ 147.8బిహెచ్‌పి పవర్ మరియు 343ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా 2.7-లీ డీజల్ వేరియంట్ 171.5బిహెచ్‌పి పవర్ మరియు 360ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివి లోని పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది. ఇండియన్ మార్కెట్లో క్రిస్టా ఎమ్‌పివి ధరలు రూ. 13.85 లక్షల నుండి 20.77 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

మారుతి సుజుకి వితారా బ్రిజా

మారుతి సుజుకి వితారా బ్రిజా

అంతర్జాతీయంగా 2016 ఏడాదిలో క్రాసోవర్ ఎస్‌యువిలకు మరియు కాంపాక్ట్ ఎస్‌యువిలకు మంచి ట్రెండ్ ఉంది. దీనికి అనుగుణంగా సబ్ నాలుగు మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యువిని ఇండియన్ మార్కెట్లోకి మారుతి సుజుకి తమ వితారా బ్రిజాను విడుదల చేసింది. భారతీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ ఈ సెగ్మెంట్లోకి కాస్త ఆలస్యంగానే అడుగేలిసినప్పటికీ అమ్మకాల్లో మంచి విజయాన్ని సాధించింది. ఇప్పటి వరకు 83,000 యూనిట్లు అమ్ముడుపోయాయి.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

మారుతి సుజుకి ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం సరిగ్గా నాలుగు మీటర్ల పొడవులో, అత్యుత్తమ ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ డిజైన్ లతో పాటు అత్యాధునిక ప్రమాణాలు గల ఫీచర్లతో వితారా బ్రిజా ను కాంపాక్ట్ ఎస్‌యువి సెగ్మెంట్లోకి విడుదల చేసింది.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

సాంకేతికంగా వితారా బ్రిజాలో 89బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.3-లీటర్ సామర్థ్యం గల డిడిఐఎస్ డీజల్ ఇంజన్ కలదు. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు. కేవలం 13.3 సెకండ్ల కాల వ్యవధిలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

భద్రత పరంగా వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువిలో స్టాండర్డ్‌గా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ లతో పాటు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, క్రూయిజ్ కంట్రోల్, ఆటో హెడ్ ల్యాంప్స్, మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్లు వంటివి కలవు.

వితారా బ్రిజా ధరలు రూ. 7.19 లక్షల నుండి 9.66 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

టాటా టియాగో

టాటా టియాగో

దేశీయంగా ఉన్న దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలకు తమ టియాగో విడుదల ద్వారా టాటా మోటార్స్ ముచ్చెమటలు పోయించిందని చెప్పాలి. టాటా మోటార్స్ ఏప్రిల్ 2016 లో టియాగో ను విడుదల చేసింది. అనతి కాలంలోనే టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో చోటు సాధించింది. టాటా వారి మొత్తం విక్రయాల్లో టియాగో వాటా 47 శాతంగా ఉందంటే ఏ మేరకు విజయాన్ని సాధించిందో స్పష్టంగా తెలిసిపోతోంది.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

కార్ల దిగ్గజ పరిశ్రమలు ఊహించని రీతిలో టాటా తమ టియాగోలో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, కార్నర్ స్టెబిలిటి కంట్రోల్, హార్మనీ మ్యూజిక్ సిస్టమ్ గల జూకి యాప్, స్మార్ట్ ఆధారిత టర్న్ బై టర్న్ న్యావిగేషన్ సిస్టమ్ వంటి నమ్మశక్యం గాని ఫీచర్లను అందించింది.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

టాటా మోటార్స్ సాంకేతికంగా టియాగోలో అత్యుత్తమ ఇంజన్ ఆప్షన్‌లను ప్రవేశపెట్టింది. అవి, 84బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ రివట్రాన్ పెట్రోల్ మరియు 69బిహెచ్‌పి పవర్ మరియు 140ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 1.05-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

టియాగోలోని పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లకు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

టాటా టియాగో ధరలు రూ. 3.20 లక్షల నుండి 5.71 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

వోక్స్‌వ్యాగన్ అమియో

వోక్స్‌వ్యాగన్ అమియో

విపరీతమైన పోటీ ఉన్న కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లోకి వోక్స్‌వ్యాగన్ ఇండియా తమ శక్తివంతమైన అమియో ను విపణిలోకి విడుదల చేసింది. దేశీయంగా ఉన్న దాదాపు అన్ని దిగ్గజ కార్ల సంస్థ సెగ్మెంట్లో తమ కంటూ ఒక ఉత్పత్తిని విడుదల చేశాయి. మేకిన్ ఇండియా చొరవతో వోక్స్‌వ్యాగన్ అమియో ను దేశీయంగా జూన్ 2016 విడుదల చేసింది. మారుతి సుజుకి డిజైర్ కు గట్టి పోటీగా జర్మనీ కార్ల తయారీ సంస్థ అందుబాటులోకి తెచ్చింది.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

వోక్స్‌వ్యాగన్ ఈ అమియో కాంపాక్ట్ సెడాన్ లో ఫస్ ఇన్ క్లాస్ ఫీచర్లయిన క్రూయిజ్ కంట్రోల్, రెయిన్ సెన్సింగ్ పైవర్లు, యాంటి పించ్ విండోస్, రియర్ వ్యూవ్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు, ఐపోడ్ కనెక్టివిటి గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కూల్డ్ గ్లూవ్ బాక్స్, రియర్ ఏ/సి వెంట్ లతో పాటు స్టాండర్డ్‌గా డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, మరియు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లను అమియోలోని అన్ని వేరియంట్లలో అందించింది.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

ప్రస్తుతం అమియో కాంపాక్ట్ సెడాన్‌లో 74బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్ మరియు 108.6బిహెచ్‌పి పవర్ మరియు 250ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ టిడిఐ డీజల్ ఇంజన్ కలదు.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

అమియోలోని రెండు ఇంధన వేరియంట్లను 7-స్పీడ్ డైరెక్ట్ షిఫ్ట్ గేర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ లేదంటే 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ లలో ఎంచుకోవచ్చు.

వోక్స్‌వ్యాగన్ అమియో ధరలు రూ. 5.24 లక్షల నుండి 9.32 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

రెనో క్విడ్

రెనో క్విడ్

2016 లో టాప్ కార్ లాంచెస్ లో రెనో క్విడ్ ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) ఒక వేరియంట్ అని చెప్పవచ్చు. దేశీయంగా ఉన్న ఎంట్రీ లెవల్ ఆటోమేటిక్ కార్ల సెగ్మెంట్లో అత్యంత ఉత్సాహాన్ని రేకెత్తించింది. క్విడ్ ఆటోమేటిక్ విడుదల ద్వారా క్విడ్ అమ్మకాలు మరింత పుంజుకున్నాయి.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

రెనో ఇండియా క్విడ్ ఆటోమేటిక్ వేరియంట్లో ఏఎమ్‌టి గేర్ సెలక్టర్ కోసం రోటరీ డయల్ ను పరిచయం చేసింది. ఫ్రెంచ్ కు చెందిన రెనో తమ క్విడ్ లోని ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఎఫ్1 నిపుణుల చేత అభివృద్ది చేయించింది. ఈ చిన్న కారులో డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఈ సెగ్మెంట్లో మొదటి సారిగా లోడ్ లిమిటర్స్ గల ప్రి-టెన్షనర్ల సీట్ బెల్టులు కలవు.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

సాంకేతికంగా రెనో ఇండియా ఈ క్విడ్ ఆటోమేటిక్ వేరియంట్లో 1.0-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్‍‌ను అందించింది. ఇది గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. క్విడ్ లోని టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ పరిచయం చేయబడింది.

క్విడ్ ఆటోమేటిక్ ధర రూ. 4.25 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

టయోటా ఫార్చ్యూనర్

టయోటా ఫార్చ్యూనర్

టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా తమ నెక్ట్స్ జనరేషన్ ఫార్చ్యూనర్ ప్రీమియమ్ ఎస్‌యువిని నవంబర్ 2016 న దేశీయ విపణిలోకి విడుదల చేసింది. అప్‌డేటెడ్ ఫార్చ్యూనర్ లో బోల్డ్ డిజైన్‌తో పాటు రెండు కొత్త ఇంజన్‌లను కూడా టయోటా పరిచయం చేసింది. దేశీయంగా ఫార్చ్యూనర్ ని పరిచయం చేసినప్పటి నుండి లక్ష యూనిట్లను విక్రయించింది.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

భద్రత పరంగా ఇందులో ఏడు ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటి కంట్రోల్, మరియు ఆఫ్ రోడింగ్ కోసం డౌన్ హిల్ అసిస్ట్ కంట్రోల్, ఆక్టివి ట్రాక్షన్ కంట్రోల్, మరియు ఎలక్ట్రానిక్ డ్రైవ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కలవు.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

సాంకేతికంగా ఇందులో 164బిహెచ్‌పి పవర్ మరియు 245ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే 2.7-లీటర్ పెట్రోల్ మరియు 177బిహెచ్‌పి పవర్ మరియు 360ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 2.8-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ ఆప్షన్లు కలవు.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

సరికొత్త టయోటా ఫార్చ్యూనర్‌లోని రెండు ఇంజన్ వేరియంట్లకు 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. మరియు డీజల్ వేరియంట్లో 4-వీల్ డ్రైవ్ సిస్టమ్ కూడా కలదు.

టయోటా ఫార్చ్యూనర్ ధరలు రూ. 25.92 లక్షల నుండి 31.12 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

2016 లో విడుదలైన అత్యుత్తమ కార్లు

భారత దేశపు తొలి బయో డీజల్ బస్సులను ప్రారంభించిన KSRTCP:

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భారత దేశపు మొట్ట మొదటి బయో డీజల్ బస్సులను ప్రారంభించింది.

 
English summary
Best New Cars Launched In 2016 — Significant Impact In Indian Auto Industry
Please Wait while comments are loading...

Latest Photos