దేశీయంగా అతి త్వరలో విడుదల కానున్న ఎస్‌యువిలు

ఇండియన్ మార్కెట్లోని ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి విడుదల కానున్న ఉత్తేజభరితమైన వాహనాల జాబితా, వాటి విడుదల తేదీలు మరియు అంచనా ధరల వివరాలు...

By Anil

స్పోర్ట్స్ వినియోగ వాహనాల(SUV)కు దేశీయంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. పాశ్చాత్య దేశాల్లో ముందుకు ప్రారంభమైన ఎస్‌యువి వాహనాల అమ్మకాలు ఇప్పుడు దేశీయంగా కూడా అవతరించి అమ్మకాల్లో కొత్త ఎత్తులను తాకుతోంది. యువత ఎక్కువ వీటిని ఎంచుకుంటున్నారు.

టాటా నెక్సాన్

టాటా నెక్సాన్

టాటా మోటార్స్ ఎస్‌యువి సెగ్మెంట్లోని కాంపాక్ట్ ఎస్‌యువి రూపంతో నెక్సాన్ ను అభివృద్ది చేసి ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించంది. దేశీయ పరిజ్ఞానంతో ఎదుగుతున్న టాటా మోటార్స్ నూతన ఒరవడితో ప్యాసింజర్ కార్ల డిజైనింగ్, అభివృద్ది, ప్రొడక్షన్ మరియు అమ్మకాల్లో కొత్త అంచులను తాకుతోంది.

దేశీయంగా విడుదల కానున్న ఎస్‌యువిలు

సబ్ నాలుగు మీటర్ల పొడవుతో రూపొందుతున్న నెక్సాన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి వితారా బ్రిజా, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 వంటి ఉత్పత్తులకు గట్టి పోటీని సృష్టించనుంది.

దేశీయంగా విడుదల కానున్న ఎస్‌యువిలు

టాటా మోటార్స్ సాధ్యమైనంత వరకు ఈ నెక్సాన్‌లో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న రివట్రాన్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్‌ను అందించే అవకాశం ఉంది. వీటికి మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం జరగనుంది.

  • విడుదల అంచనా: 2016 ఏడాది చివరి నాటికి లేదా 2017 ప్రారంభానికి
  • ధర అంచనా: 7 లక్షల నుండి ప్రారంభం కావచ్చు.
  • మారుతి సుజుకి ఇగ్నిస్

    మారుతి సుజుకి ఇగ్నిస్

    పోటీ దారులను వెనక్కి నెట్టి మరీ తమ వితారా బ్రిజాతో విజయాన్ని రుచించింది మారుతి సుజుకి. భారత దేశపు అతి పెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఎస్‌యువి సెగ్మెంట్లో కూడా తనకుతానుగా లీడర్ అని నిరూపించుకుంది.

    దేశీయంగా విడుదల కానున్న ఎస్‌యువిలు

    కాంపాక్ట్ ఎస్‌యువితో మంచి విజయాన్ని సాధించిన మారుతి ఇప్పుడు ఇగ్నిస్ క్రాసోర్ ఎస్‌యువి విడుదలకు సిద్దమవుతోంది. మొదటిసారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఇగ్నిస్ క్రాసోవర్ ఎస్‌యువిని ప్రదర్శించింది. చూడటానికి హ్యాచ్‍‌‌బ్యాక్ తరహాలో ఉన్నా లక్షణాలన్నీ ఎస్‌యువి తరహాలో ఉన్నాయి.

    దేశీయంగా విడుదల కానున్న ఎస్‌యువిలు

    మారుతి సుజుకి ఈ ఇగ్నిస్ క్రాసోవర్ ఎస్‌యువిలో 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న బూస్టర్ జెట్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న ఇంజన్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది.

    • విడుదల అంచనా: 2017 మధ్య బాగానికి
    • ధర అంచనా: 5 లక్షల నుండి ప్రారంభం
    • హ్యుందాయ్ కార్లినో

      హ్యుందాయ్ కార్లినో

      మారుతి సుజుకి తర్వాత భారతీయ మార్కెట్‌ను ఎప్పటికప్పుడు అంచనా వేయడంలో హ్యుందాయ్ మోటార్స్ దిట్ట అని చెప్పవచ్చు. అందుకోసం గత 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదక మీద కార్లినే అనే వాహనాన్ని కార్లినో కాన్సెప్ట్ పేరుతో ప్రదర్శించింది.

      దేశీయంగా విడుదల కానున్న ఎస్‌యువిలు

      దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ ప్రస్తుతం మారుతి వారి వితారా బ్రిజా మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వాహనాలకు పోటీగా క్రెటా ఎస్‌యువిని అందుబాటులో ఉంచింది. ఇప్పుడు హ్యుందాయ్ అభివృద్ది చేస్తున్న కార్లినో కూడా క్రెటా ఆధారంతో అభివృద్ది అవుతోంది.

      దేశీయంగా విడుదల కానున్న ఎస్‌యువిలు

      క్రెటా మరియు ఎలైట్ ఐ20 లోని ఫీచర్లతో ఇది పరిచయం కానుంది. సాంకేతిక వివరాలు విడుదల కానప్పటికీ ఇది 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న ఇంజన్‌లతో పరిచయమయ్యే అవకాశం ఉంది.

      • విడుదల అంచనా: 2018 నాటికి
      • ధర అంచనా: 6-7 లక్షల నుండి ప్రారంభం
      • శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యువి

        శాంగ్‌యాంగ్ టివోలి కాంపాక్ట్ ఎస్‌యువి

        శాంగ్‌యాంగ్ సంస్థ దేశీయంగా కార్యకలాపాలు సాగించేందుకు దేశీయ ఎస్‌యువి దిగ్గజం మహీంద్రాతో చేతులు కలిపింది. మహీంద్రా ఆసరాతో శాంగ్‌యాంగ్ టివోలి అనే ఎస్‌యువిని విడుదల చేయడానికి సుముఖత చూపుతోంది. గతంలో శాంగ్‌యాంగ్ రెక్ట్సాన్ ఎస్‌యువిని అందుబాటులో ఉంచింది.

        దేశీయంగా విడుదల కానున్న ఎస్‌యువిలు

        శాంగ్‌యాంగ్ ఈ టివోలి ఎస్‌యువిని ఎక్స్100 వేదిక మీద అభివృద్ది చేసింది. కాంపాక్ట్ ఎస్‌యువిలో ఉండాల్సిన అన్ని ప్రముఖ ఫీచర్లను ఇందులో పరిచయం చేయనుంది. దేశీయంగా విడుదలయితే హ్యుందాయ్ క్రెటా మరియు రెనో డస్టర్ ఎస్‌యువిలకు గట్టి పోటీనే సృష్టించనుంది.

        దేశీయంగా విడుదల కానున్న ఎస్‌యువిలు

        శాంగ్‌యాంగ్ ఆధారిత మహీంద్రా టివోలి కాంపాక్ట్ ఎస్‌యువి 1.5-లీటర్ డీజల్ మరియు 1.5-లీటర్ పెట్రోల్ శ్రేణి ఇంజన్‌లతో పరిచయం అయ్యే అవకాశం ఉంది.

        • విడుదల అంచనా: 2017 నాటికి
        • ధర అంచనా: 8-10 లక్షలతో ప్రారంభం
        • జీప్ కాంపాక్ట్ ఎస్‌యువి

          జీప్ కాంపాక్ట్ ఎస్‌యువి

          భారీ ప్రణాళికలతో జీప్ సంస్థ ఎట్టకేలకు దేశీయ ఆటోమొబైల్ తీరాన్ని తాకింది. అమెరికా ఆధారిత సంస్థ జీప్ ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం కుడి చేతి వైపు డ్రైవింగ్ సిస్టమ్‌ను అందించి తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది.

          దేశీయంగా విడుదల కానున్న ఎస్‌యువిలు

          జీప్ సంస్థకు చెందిన రెనిగేడ్ వేదిక ఆధారంగా జీప్ సంస్థ యొక్క బ్రాండ్ ఇమేజ్‌ను సూచించే విధంగా సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యువి రూపం ఉండనుంది. అంతర్జాతీయ ప్రదర్శనకు సిద్దంగా ఉన్నారు. ముందు బ్రెజిల్ మార్కెట్లో విడుదలయ్యి ఆ తరువాత దేశీయ మార్కెట్లను తాకనుంది.

          దేశీయంగా విడుదల కానున్న ఎస్‌యువిలు

          జీప్ కాంపాక్ట్ ఎస్‌యువికి చెందిన సాంకేతిక వివరాలను చాలా సీక్రెట్‌గా ఉంచింది. అయితే ఇది దేశీయ విపణిలోకి వస్తే హ్యుందాయ్ క్రెటా, రెనో డస్టర్ మరియు ఈ శ్రేణిలో పోటీగా ఉన్న ఇతర ఉత్పత్తులకు పోటీని ఇవ్వనుంది.

          • విడుదల అంచనా: 2017 నాటికి
          • ధర అంచనా: 10 నుండి 12 లక్షల మధ్య ధరతో
          • దేశీయంగా విడుదల కానున్న ఎస్‌యువిలు

            2020 నాటికి అంతర్జాతీయంగా మూడవ అతి పెద్ద ప్యాసింజర్ కార్ల మార్కెట్‌గా అవతరించనుంది. 2020 నాటికి వీటితో పాటు మరిన్ని ఎస్‌యువి వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం కొత్త రానున్న వాహనాలు మరియు అమ్మకాలను గమనిస్తే భారతీయ కార్ల భవిష్యత్ కొద్ది కొద్దిగా ఎస్‌యువిల వశం కానుంది.

            దేశీయంగా విడుదల కానున్న ఎస్‌యువిలు

            • నెక్ట్స్ జెనరేషన్ క్రెటా 7 సీటింగ్ సామర్థ్యంతో: హ్యుందాయ్
            • ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో విడుదలవుతున్న కార్లు, వాటి వివరాలు
            • మహీంద్రా నుండి సరికొత్త అర్మాడా ఎమ్‌యువి

Most Read Articles

English summary
Upcoming Compact SUVs In India — Make An Informed Choice!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X