మారుతి సుజుకి వితారా బ్రిజా రికార్డ్ సేల్స్

Written By:

మారుతి సుజుకి చిన్న కార్ల అమ్మకాల్లో మంచి విజయాన్ని సాధించేది అయితే వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి విడుదలతో ఆ మాట కాస్త మారిపోయింది. పెద్ద కార్లను కూడా సునాయసంగా అమ్మేయగల సత్తాను మారుతి తమ బ్రిజాతో చాటుకుంది.

మారుతి సుజుకి ఇండియన్ కాంపాక్ట్ ఎస్‌యువి మార్కెట్లోకి విడుదల చేసిన మొదటి ఎస్‌యువి వితారా బ్రిజా కాంపాక్ట్‌ ఎస్‌యువిని విడుదల నుండి ఇప్పటి వరకు 83,000 మంది ఎంచుకున్నారు.

ఇప్పుడు వితారా బ్రిజా ను ఎంచుకునే వారికి ఏడు నెలల వెయిటింగ్ పీరియడ్‌తో డెలివరీ ఇవ్వనుంది. విడుదలయ్యి సుమారుగా 8 నెలలు పూర్తయినా డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు.

మారుతి సుజుకి వితారా బ్రిజాకు సంభందించి 1.72 లక్షల బుకింగ్స్ నమోదు చేసుకుంది. వెయిటింగ్ పీరియడ్ పెరిగినప్పటికీ కస్టమర్లు దీనినే ఎంచుకుంటున్నారు. దీని ప్రత్యామ్నాయంగా ఉన్న ఇతర కాంపాక్ట్ ఎస్‌యువిలను ఎంచుకోవడానికి నిరాకరిస్తున్నారనే చెప్పవచ్చు.

తాజాగా మారుతి సుజుకి వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్‌యువి 2017 ఏడాదికి గాను ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డ్‌ను కూడా గెలుపొందింది.

భారీ డిమాండ్‌ను కలిగి ఉన్న వితారా బ్రిజాలోని వేరియంట్లను బట్టి కూడా వెయిటింగ్ పీరియడ్‌లో తేడా ఉన్నట్లు మారుతి ప్రకటించింది. ప్రస్తుతం బ్రిజా వాహనానికి ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు మహీంద్రా టియువి300 వంటి వాటికి గట్టి పోటీగా నిలిచింది.

టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కాంపాక్ట్ ఎస్‌యువి జాబితాలో ఇప్పుడు మారుతి సుజుకి వితారా బ్రిజా స్థానం సంపాదించింది. మరియు మారుతిని ఎప్పటిలాగే అత్యుత్తమ కార్ల అమ్మకాలు సాగించే ప్యాసింజర్ కార్ల తయారీ జాబితాలో మొదటి స్థానంలో నిలపడంలో వితారా బ్రిజా దోహదపడిందని మారుతి ఓ ప్రకటనలో తెలిపింది.

మారుతి సుజుకి ఈ వితారా బ్రిజా కాంపాక్ట్‌ ఎస్‌యువిని కేవలం డీజల్ వేరియంట్లో మాత్రమే పరిచయం చేసింది. మారుతి దీనిని త్వరలో పెట్రోల్ వేరియంట్‌ను ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌తో విడుదల చేయనుంది.

ప్రస్తుతం మారుతి విక్రయాల్లో లభిస్తున్న వితారా బ్రిజాలోని 1.3-లీటర్ల సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ గరిష్టంగా 88.5బిహెచ్‌పి పవర్ మరియు 200ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

మారుతి సుజుకి ఈ అప్ కమింగ్ బ్రిజా పెట్రోల్ వేరియంట్లో సుమారుగా 100బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్‌ను అందివ్వనుంది. దీని 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా పరిచయం చేయనుంది.

అంతే కాకుండా ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్న ఆధారం లేని కథనం ప్రకారం ఇందులో 1.0-లీటర్ సామర్థ్యం గల బూస్టర్ జెట్ ఇంజన్‌ను కూడా అందించే పనిలో మారుతి నిమగ్నమయినట్లు తెలిసింది.

 

English summary
Maruti Suzuki Vitara Brezza Achieves 83,000 Unit Sales
Story first published: Friday, December 23, 2016, 16:51 [IST]
Please Wait while comments are loading...

Latest Photos