అమ్మో అమియో కారు వచ్చేసింది: విడుదల వివరాలు

By Anil

వోక్స్‌వ్యాగన్ ఇండియా భారతీయ మార్కెట్లోకి సరికొత్త కాంపాక్ట్ సెడాన్ కారు అమియోను విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన ఒక ఈవెంట్‌‌లో వోక్స‌వ్యాగన్ వారు దీనిని ఆవిష్కరించారు. అయితే ఫిబ్రవరి మూడవ తేది నుండి ప్రారభం కానున్న 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో దీనిని ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

వోక్స్‌వ్యాగన్ అమియో కాంపాక్ట్ సెడాన్ కారు గురించి మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

అమియో డిజైన్

అమియో డిజైన్

అమియో కారు డిజైన్ గురించి చెప్పాలంటే కార్బన్ పేపర్ మీద పోలో కారును అచ్చు వేసినట్లు ఉంటుంది దీని డిజైన్, కాకపోతే వెనుక వైపున బూట్‌స్పేస్ తగిలించారు.

అమియో

అమియో

వో‌క్స్‌వ్యాగన్ మోటార్స్ వారు ఈ కారుకు పెట్టిన పేరు లాటిన్ నుండి సేకరించినట్లు తెలిపారు. అమియో అంటే ఎంటో తెలుసా ? అమియో అనగా లాటిని భాషలో ఐ లవ్ అనే అర్థ వస్తుందని తెలిపారు. దీనిని బయట ఎక్కడైనా వాడేరు సుమా !

అమియో సాంకేతిక వివరాలు

అమియో సాంకేతిక వివరాలు

అమియో రెండు ఇంజన్‌లతో విడుదల చేశారు. అవి 1.2-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్

టార్క్

టార్క్

వోక్స్‌వ్యాగన్‌ వారి అమియ సెడాన్ కారులో గల పెట్రోల్ వేరియంట్ దాదాపుగా 175 ఎన్ఎమ్ టార్క్ మరియు డీజల్ వేరియంట్ కారు 230 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయును

 ఇంధన సామర్థ్యం

ఇంధన సామర్థ్యం

అమియో కాంపాక్ట్ సెడాన్‌లో గల పెట్రోల్ వేరియంట్ దాదాపుగా లీటర్‌కు 16.47 కిలోమీటర్లు మరియు డీజల్ వేరియంట్ కారు లీటర్‌కు దాదాపుగా 20.14 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తాయి.

ట్రాన్స్‌మిషన్ మరియు గేర్‌బాక్స్

ట్రాన్స్‌మిషన్ మరియు గేర్‌బాక్స్

వోక్స్‌వ్యాగన్ అమియో కాంపాక్ట్ సెడాన్ కారు 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్ బాక్స్‌ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

 ఇంటీరియర్

ఇంటీరియర్

ఇంటీరియర్ డిజైన్ పరంగా చూస్తే పోలో కారులోని డ్యూయల్ టోన్ కలిగిన బ్లాక్ మరియు బీజీ కాంబినేషన్‌తో అందించారు, సెంట్ర్ కన్సోల్ మీద సిల్వర్ పూత పూశారు. మరియు వివిధ రకాల వ్యవస్థలను నియంత్రించే మూడు స్పోక్స్ గల స్టీరింగ్ వీల్ కల్పించారు.

 అమియో ఫీచర్లు

అమియో ఫీచర్లు

  • రెయిన్ సెన్సింగ్ వైఫర్లు
  • ఆటో డిమ్మింగ్
  • క్రూయిజ్ కంట్రోల్
  • వెనుక వైపున నుండి ఎ/సి విడుదల చేసే అవుట్ లెట్స్
  • అమియో ఫీచర్లు

    అమియో ఫీచర్లు

    • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్
    • ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్
    • ముందు వైపున రెండు ఎయిర్ బ్యాగులు
    • తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్
    • అమియో ఫీచర్లు

      అమియో ఫీచర్లు

      • కూల్డ్ గ్లూవ్స్
      • ముందు వైపు ముంజేతులకు విశ్రాంతిని కలిగించే సపోర్ట్
      • హిల్ హోల్డ్ కంట్రోల్
      • ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్
      •  పోటి

        పోటి

        వోక్స్‌వ్యాగన్ వారు ఈ అమియో కాంపాక్ట్ సెడాన్ కారును మార్కెట్లోకి విడుదల చేస్తే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్, హ్యుందాయ్ జెంట్ మరియు హోండా అమేజ్ వంటి కార్లకు పోటిగా నిలుస్తుంది.

        అందుబాటులోకి

        అందుబాటులోకి

        వోక్స్‌వ్యాగన్ ఇండియా ఈ అమియో కాంపాక్ట్ సెడాన్ కారును మార్కెట్లోకి 2016 ఏడాది మలిసగంలో ప్రవేశపెట్టనున్నారు.

        అమియో కారును విడుదల చేసిన వోక్స్‌వ్యాగన్: వివరాలు
        • రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ విడుదల: పూర్తి వివరాలు
        • చాటుగా వచ్చింది..! దొరికిపోయింది...!!
        • బజాజ్ వి బైకు ఫోటోలు

Most Read Articles

English summary
Volkswagen Ameo Revealed In India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X