2016 వోల్వో ఎస్90 విపణిలోకి విడుదల: ధర రూ. 53.5 లక్షలు

Written By:

స్వీడిష్‌కు చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో దేశీయ విపణిలోకి తమ ఎస్90 లగ్జరీ సెడాన్ కారును ప్రవేశపెట్టింది. వోల్వో ఫ్లాగ్‌షిప్ సెడాన్ ధరను రూ. 535.5 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా సంస్థ నిర్ణయించింది.

2016 వోల్వో ఎస్90

గతంలో మంచి విజయాన్ని అందుకున్న ఎస్80 సెడాన్‌కు కొనసాగింపుగా ఈ ఎస్90 విడుదలైంది. ఎస్80 ఆధారిత ఎస్‌పిఎ (స్కేలబుల్ ప్రొడక్ట్ ఆర్కిటెక్చర్ ఆధారంగా) వేదిక మీద ఎస్‌యువి రూపంలో ఎస్90 ని నిర్మించారు.

2016 వోల్వో ఎస్90

సాంకేతికంగా ఇందులో శక్తివంతమైన 2.0-లీటర్ల సామర్థ్యం ఉన్న ట్విన్-టుర్బోఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు.

2016 వోల్వో ఎస్90

వోల్వో ఎస్90 లోని శక్తివంతమైన డీజల్ ఇంజన్ సుమారుగా 187.4బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

2016 వోల్వో ఎస్90

ట్రాన్స్‌మిషన్ పరంగా ముందువైపున్న ఇంజన్ నుండి పవర్ మరియు టార్క్ వెనుక చక్రాలకు సరఫరా చేయడానికి 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసారు.

2016 వోల్వో ఎస్90

2016 వోల్వో ఎస్90 లో ఎకో, కంఫర్ట్ మరియు డైనమిక్ అనే మూడు విభిన్నమైన డ్రైవింగ్ పద్దతులు కలవు. డ్రైవింగ్ పద్దతి ప్రకారం ఇంజన్ పనితీరు మరియు ఎయిర్ సస్పెన్షన్ వంటి వాటిని అవసరానికి తగ్గట్లుగా ఎంచుకోవచ్చు.

2016 వోల్వో ఎస్90

కొలతల పరంగా ఎస్90 4,963ఎమ్ఎమ్ పొడవు, 1,890ఎమ్ఎమ్ వెడల్పు మరియు 1,443ఎమ్ఎమ్ ఎత్తు కలదు. అదే విధంగా 2,941ఎమ్ఎమ్ పొడవైన వీల్ బేస్, 11.4మీటర్ల టర్నింగ్ రేడియస్ కలదు. 2,360 కిలోల ఎస్90 లో 60 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంకు కలదు.

2016 వోల్వో ఎస్90

పదునైన లక్షణాలతో ముందు వైపు డిజైన్ చేయబడింది. మరియు ఎన్నో తరాల నుండి వస్తోన్న తమ పుటాకార ఫ్రంట్ గ్రిల్ ను మరింత ఆకర్షణీయంగా అందించారు.

2016 వోల్వో ఎస్90

ఎక్స్‌సి90 ఎస్‌యువి తరహాలో ఉన్న ఎస్90 సెడాన్ హెడ్ ల్యాంప్ మధ్యలో సుత్తి ఆకారంలో ఉన్న పగటి పూట వెలిగే లైట్లను అందించారు.

2016 వోల్వో ఎస్90

అత్యంత విలాసవంతమైన ఈ ఎస్90 లోని వెనుక వైపు డిజైన్‌కు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆంగ్లపు సి-ఆకారంలో ఉన్న టెయిల్ ల్యాంప్ కలదు. రెండు టెయిల్ లైట్లకు మధ్య నెంబర్ ప్లేట్ పై భాగంలో వోల్వో అనే పదాన్ని గుర్తించవచ్చు.

2016 వోల్వో ఎస్90

ఇంటీరియర్‌లో వాల్‌నట్ వుడ్ మరియు లెథర్‌తో రూపొందించబడిన డ్యాష్ బోర్డ్ కలదు. డ్యాష్ బోర్డ్ మధ్యలో 9-అంగుళాల పరిమాణం గల తాకే తెర ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు.

2016 వోల్వో ఎస్90

శాటిలైట్ న్యావిగేషన్, ఆపిల్ కార్ ప్లే, క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, తో పాటు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కు అనుసంధానం చేయబడిన 1400డబ్ల్యూ 19 స్పీకర్లు కలవు.

2016 వోల్వో ఎస్90

లగ్జరీ ఫీల్ కలుగజేసే నప్పా లెథర్ సీట్లు కలవు, వీటిని అవసరాన్ని బట్టి వేడిగా మరియు చల్లగా మార్చుకోవచ్చు. ముందు వైపున్న సీట్లను ఎలక్ట్రిక్ పవర్ ద్వారా ఆటోమేటిక్‌గా అడ్జెస్ట్‌ చేసుకోవచ్చు.

వోల్వో ఎస్90 సెడాన్‌లోని భద్రత ఫీచర్లు

వోల్వో ఎస్90 సెడాన్‌లోని భద్రత ఫీచర్లు

  • సాధారణ ఎయిర్ బ్యాగులు,
  • యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్,
  • ఎలక్ట్రానిక్ బ్రేక్ పోర్స్ డిస్ట్రిబ్యూషన్,
  • అన్ని సీట్లకు ప్రిటెన్షనర్ గల సీట్ బెల్ట్‌లు కలవు,
  • పెద్ద జంతువులను గుర్తించే పరిజ్ఞానం,
  • మరియు ఇతర సిటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
2016 వోల్వో ఎస్90

ఇండియన్ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన మొదటి సెమి-అటానమస్ కారు ఈ ఎస్90 సెడాన్. అటానమస్‌కు సంభందించిన లేన్ అసిస్ట్ ఫీచర్ కలదు. దీని ద్వారా రోడ్డుకు ఇరువైపులా ఉన్న రహదారి లైన్లను అనుసరిస్తూ ముందుకు వెళుతుంది. పొరబాటున కూడా లైన్ దాటి బయటకు వెళ్లదు.

2016 వోల్వో ఎస్90

కంప్లిట్లి బిల్ట్ యూనిట్‌గా మార్కెట్లోకి ప్రవేశించిన వోల్వో ఎస్90 కార్లను బుక్ చేసుకునే వారికి డిసెంబర్ నుండి డెలివరీలను ఇవ్వనున్నారు.

2016 వోల్వో ఎస్90

వోల్వో ఎస్90 సెడాన్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్, బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ మరియు ఆడి ఏ6 వంటి ఉత్పత్తులకు గట్టి పోటీని ఇవ్వనుంది.

 
Read more on: #వోల్వో #volvo
English summary
Read In Telugu: Volvo S90 Launched In India; Priced At Rs. 53.5 Lakh
Story first published: Friday, November 4, 2016, 16:59 [IST]
Please Wait while comments are loading...

Latest Photos