మైలేజ్ పరంగా సిటి మరియు సియాజ్‌లకు గట్టి షాక్ ఇచ్చిన 2017 వెర్నా

Written By:

హ్యుందాయ్ అతి త్వరలో విడుదల చేయనున్న నెక్ట్స్ జనరేషన్ వెర్నా మైలేజ్ వివరాలు లీక్ అయ్యాయి. హ్యుందాయ్ వెర్నా ప్రొడక్ట్ కస్టమర్ మోడ్యూల్ ఆధారంగా హ్యుందాయ్ వెర్నా మైలేజ్ వివరాలు వెల్లడయ్యాయి.

ఈ మ్యాన్యువల్‌లో హ్యుందాయ్ వెర్నా మైలేజ్ దీనికి పోటీనిస్తున్న ప్రముఖ కార్లు హోండా సిటి మరియు మారుతి సుజుకి సియాజ్ మైలేజ్ వివరాలతో పోల్చడం జరిగింది.

హ్యుందాయ్ వెర్నా మైలేజ్

2017 హ్యుందాయ్ వెర్నాలో 1.6-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటికి మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

Recommended Video - Watch Now!
2018 Hyundai Verna Indian Model Unveiled | In Telugu - DriveSpark తెలుగు
హ్యుందాయ్ వెర్నా మైలేజ్

హ్యుందాయ్ వెర్నా 1.6-లీటర్ పెట్రోల్ మ్యాన్యువల్ వేరియంట్ మైలేజ్ 17.70 కిమీలు మరియు పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్ 15.92 కిమీలుగా ఉంది. మరియు హ్యుందాయ్ వెర్నా 1.6-లీటర్ డీజల్ మ్యాన్యువల్ వేరియంట్ మైలేజ్ 24.75 కిమీలు మరియు డీజల్ ఆటోమేటిక్ వేరియంట్ మైలేజ్ 21.02కిమీలగా ఉంది.

హ్యుందాయ్ వెర్నా మైలేజ్

మునుపటి హ్యుందాయ్ వెర్నాతో పోల్చుకుంటే సరికొత్త 2017 వెర్నా మైలేజ్ స్వల్పంగా పెరిగింది. దీంతో వెర్నాకు పోటీగా ఉన్న సిటి మరియు సియాజ్ సెడాన్ కార్ల కన్నా కొద్ది మేర అధిక మైలేజ్ ఇవ్వగలదని నిరూపించుకుంది.

హ్యుందాయ్ వెర్నా మైలేజ్

హ్యుందాయ్ మోటార్స్ సరికొత్త వెర్నా సెడాన్ కారును ఆగష్టు 22, 2017 న దేశీయ విపణిలోకి విడుదల చేయనుంది. ఆన్‌లైన్‌లో మరియు డీలర్ల వద్ద రూ. 25,000 ల ప్రారంభ ధరతో దీని మీద ఇది వరకే ముందస్తు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

హ్యుందాయ్ వెర్నా మైలేజ్

సరికొత్త 2017 హ్యుందాయ్ వెర్నా మైలేజ్ వివరాలు

వేరియంట్లు ఏఆర్ఏఐ మైలేజ్
హ్యుందాయ్ వెర్నా 1.6 పెట్రోల్ మ్యాన్యువల్ 17.70 కిమీ/లీ
హ్యుందాయ్ వెర్నా 1.6 పెట్రోల్ ఆటోమేటిక్ 15.92 కిమీ/లీ
హ్యుందాయ్ వెర్నా 1.6 డీజల్ మ్యాన్యువల్ 24.75కిమీ/లీ
హ్యుందాయ్ వెర్నా 1.6 డీజల్ ఆటోమేటిక్ 21.02 కిమీ/లీ

English summary
Read In Telugu: 2017 Hyundai Verna Mileage Figures Revealed
Story first published: Saturday, August 19, 2017, 11:12 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark