2017 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల ప్రారంభ ధర రూ. 68.05 లక్షలు

Written By:

ల్యాండ్ రోవర్ ఇండియన్ మార్కెట్లోకి 2017 డిస్కవరీ లగ్జరీ ఎస్‌యూవీని విడుదల చేసింది. మూడవ తరానికి చెందిన, ఏడు మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ప్రీమియమ్ ఎస్‌యూవీని రూ. 68.05 లక్షల ప్రారంభ ధరతో విపణిలోకి ప్రవేశపెట్టింది.

2017 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల

2017 ల్యాండ్ రోవర్ డిస్కవరీ మొత్తం పది విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో ఐదు పెట్రోల్ వేరియంట్లు మరియు ఐదు డీజల్ ఇంజన్ వేరియంట్లు ఉన్నాయి. డిస్కవరీ టాప్ ఎండ్ డీజల్ వేరియంట్ ధర రూ. 1.03 కోట్లుగా ఉంది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
2017 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల

థర్డ్ జనరేషన్ ల్యాండ్ రోవర్ డిస్కవరీ తొలుత 2014 న్యూయార్క్ ఆటో షో వేదిక మీద డిస్కవరీ విజన్ కాన్సెప్ట్ పేరుతో ప్రదర్శించబడింది. పాత బాక్స్ స్టైల్ డిజైన్‌ను కొనసాగిస్తూనే ల్యాండ్ రోవర్ తమ నూతన డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా దీనిని రూపొందించింది.

2017 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల

2017 ల్యాండ్ రోవర్ డిస్కవరీ పెట్రోల్ వేరియంట్లో 3.0-లీటర్ సామర్థ్యం గల వి6 టుర్బో-పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 335బిహెచ్‌పి పవర్ మరియు 450ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

2017 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల

అదే విధంగా డిస్కవరీ లోని డీజల్ ఆప్షన్‌లో 3.0-లీటర్ సామర్థ్యం గల వి6 టుర్బో-డీజల్ ఇంజన్ కలదు, ఇది 255బిహెచ్‌పి పవర్ మరియు 600ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ రెండు ఇంజన్‌లను ల్యాండ్ రోవర్ తమ ఇంజీనియమ్ ఇంజన్ ఫ్యామిలీ నుండి సేకరించింది.

2017 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల

పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభించే 2017 డిస్కవరీ ఎస్‌యూవీలలో 8-స్పీడ్ జడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు ఫోర్ వీల్ డ్రైవ్ అందివ్వడం జరిగింది. అయితే ల్యాండ్ రోవర్ వారి టెర్రైన్ రెస్పాన్ సిస్టమ్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను ఆప్షనల్‌గా మాత్రమే లభిస్తోంది. ఈ సిస్టమ్‌లో వివిధ డ్రైవింగ్ మోడ్‌ల వద్ద ఆల్ డ్రైవ్ సెలక్ట్ చేసుకునే అవకాశం ఉంది.

2017 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల

2017 డిస్కవరీ ఎస్‌యూవీ ఇంటీరియర్‌లో అనేక లగ్జరీ ఫీచర్లు ఉన్నాయి. 10-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్‌ ఇన్‌కంట్రోల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆరు స్పీకర్లు గల ఆడియో సిస్టమ్, డ్యూయల్ ప్యానరోమిక్ సన్ రూఫ్, ప్యార్లర్ పార్క్ అసిస్ట్, డ్రైవర్ కోసం హెడ్స్ అప్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ల్పే, వివేకవంతమైన సీట్ ఫోల్డ్ టెక్నాలజీ మరియు 360-డిగ్రీల కెమెరా వంటి అనేక ఫీచర్లను అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా అందివ్వడం జరిగింది.

2017 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల

2017 ల్యాండ్ రోవర్ డిస్కవరీ వేరియంట్ల వారీగా ధరలు

పెట్రోల్ మోడల్ ధర
3.0-లీటర్ పెట్రోల్ ఎస్ రూ. 68.05 లక్షలు
3.0-లీటర్ పెట్రోల్ ఎస్ఇ రూ. 71.15 లక్షలు
3.0-లీటర్ పెట్రోల్ హెచ్ఎస్ఇ రూ. 74.23 లక్షలు
3.0-లీటర్ పెట్రోల్ హెచ్ఎస్ఇ లగ్జరీ రూ. 78.91 లక్షలు
3.0-లీటర్ పెట్రోల్ ఫస్ట్ ఎడిషన్ రూ. 84.43 లక్షలు
2017 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల
డీజల్ మోడల్ ధర
3.0-లీటర్ డీజల్ ఎస్ రూ. 78.37 లక్షలు
3.0-లీటర్ డీజల్ ఎస్ఇ రూ. 785.30 లక్షలు
3.0-లీటర్ డీజల్ హెచ్ఎస్ఇ రూ. 89.54 లక్షలు
3.0-లీటర్ డీజల్ హెచ్ఎస్ఇ లగ్జరీ రూ. 95.47 లక్షలు
3.0-లీటర్ డీజల్ ఫస్ట్ ఎడిషన్ రూ. 1.03 కోట్లు
2017 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల

2017 ల్యాండ్ రోవర్ డిస్కవరీ టాప్ ఎండ్ వేరియంట్లో ఇన్‌కంట్రోల్ టచ్ ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 17-స్పీకర్లు గల మెరేడియన్ ఆడియో సిస్టమ్, హీటెడ్ సీట్లు, తొమ్మిది యుఎస్‌బి పోర్ట్‌లు, నాలుగు 12వి ఛార్జింగ్ పాయింట్లు, ఇన్-కార్ 3జీ వై-ఫై హాట్‌స్పాట్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

2017 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల

2017 ల్యాండ్ రోవర్ డిస్కవరీ లగ్జరీ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లో ఉన్న వోల్వో ఎక్స్‌సి90, ఆడి క్యూ5, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3 మరియు మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఇ వంటి లగ్జరీ ఎస్‌యూవీలకు గట్టి పోటీనివ్వనుంది.

అయితే ధర పరంగా పోల్చితే ఆడి క్యూ7 మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 లగ్జరీ ఎస్‌యూవీలు బరిలో ఉన్నాయి.

2017 ల్యాండ్ రోవర్ డిస్కవరీ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ల్యాండ్ రోవర్‌కు ఇండియన్ మార్కెట్‌ అత్యంత ముఖ్యమైనది. ల్యాండ్ రోవర్ కేవలం టాటా మోటార్స్ సబ్సిడరీ సంస్థ అనే కారణం మాత్రమే కాదు, ల్యాండ్ రోవర్ ఉత్పత్తులకు దేశీయంగా మంచి కస్టమర్లు ఉన్నారు. ఎలాంటి ఎస్‌యూవీ ఎంచుకున్నా వాటి ధర దాదాపు కోటి రుపాయల వరకు ఉంటుంది.

డిస్కవరీ అనే పేరుతో దేశీయంగా ఎన్నో వాహనాలను విక్రయించిన ల్యాండ్ రోవర్ అతి త్వరలో వెలార్ పేరుతో సరికొత్త లగ్జరీ ఎస్‌యూవీని విడుదల చేసింది.

English summary
Read In Telugu: 2017 Land Rover Discovery Launched In India With Prices Starting At Rs 68.05 Lakh
Story first published: Wednesday, August 9, 2017, 16:07 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark