2018 ఫియట్ క్రొనోస్ సెడాన్ రివీల్: ఇంజన్, స్పెసిఫికేషన్స్, ఫీచర్లు మరియు ఫోటోలు

Written By:

ఇటాలియన్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ ఫియట్ ఎట్టకేలకు సరికొత్త 2018 క్రొనోస్ సెడాన్ కారును ఆవిష్కరించింది. 2017 చివరి నాటికి ఫియట్ తమ నూతన క్రొనోస్ సెడాన్ కారును దక్షిణ అమెరికా మరియు బ్రెజిల్ మార్కెట్లో విడుదల చేయనుంది.

2018 ఫియట్ క్రొనోస్ సెడాన్

ఫియట్ ఇటీవల రివీల్ చేసిన ఆగ్రో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా క్రొనోస్ సెడాన్‌ను అభివృద్ది చేసింది. అయితే, ఈ నూతన క్రొనోస్ సెడాన్‌లో డిజైన్, ఫీచర్లు మరియు హ్యాచ్‌బ్యాక్, సెడాన్ మధ్య తేడాను గమనించే విధంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

2018 ఫియట్ క్రొనోస్ సెడాన్

అచ్చం ఫియట్ ఆగ్రో హ్యాచ్‌బ్యాక్‌లోని హెడ్ లైట్ మరియు బానెట్‌ను పోలిన ఫ్రంట్ డిజైన్ క్రొనోస్ సెడాన్‌లో కలదు. అయితే ఫ్రంట్ గ్రిల్ పూర్తిగా రీడిజైన్ చేయబడింది. విశాలమైన ఎయిర్ డ్యామ్ మరియు ఇరువైపులా ఫాగ్ ల్యాంప్స్ పొదిగించబడిన నూతన ఫ్రంట్ బంపర్‌ ఇందులో ఉంది.

2018 ఫియట్ క్రొనోస్ సెడాన్

ఫియట్ క్రొనోస్ రియర్ డిజైన్ స్పోర్ట్స్ స్టైలిష్ రూపాన్ని సొంతం చేసుకుంది. సరికొత్త ఆకారంలో ఉన్న ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్, నూతన డిజైన్ ఎలిమెంట్లో ఉన్న బూట్ లిప్ స్పాయిలర్, పెద్ద పరిమాణంలో ప్లాస్టిక్ తొడుగులు ఉన్న బంపర్ మరియు ఇరువైపులా రిఫ్లెక్టర్లు ఉన్నాయి.

2018 ఫియట్ క్రొనోస్ సెడాన్

ఫియట్ క్రొనోస్ సెడాన్‌లో విశాలమైన బూట్ స్పేస్ ఉంది. ఇది వోక్స్‌వ్యాగన్ తాజాగా ఆవిష్కరించిన వర్చస్ సెడాన్‌కు గట్టి పోటీనివ్వనుంది. వోక్స్‌వ్యాగన్ వర్చస్ సెడాన్‌ను కూడా తమ నెక్ట్స్ జనరేషన్ పోలో హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా డెవలప్ చేశారు.

2018 ఫియట్ క్రొనోస్ సెడాన్

బ్రెజిల్ మార్కెట్లో అందుబాటులోకి రానున్న ఫియట్ క్రొనోస్ సెడాన్‌లో 10.5బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.3-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ మరియు 137బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 1.8-లీటర్ కెపాసిటి గల ఫ్లెక్స్ ఫ్యూయల్ (ఎలాంటి ఇంధనంతోనైనా నడుస్తుంది) ఇంజన్‌లు రానున్నాయి. ఇవి 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానున్నాయి.

2018 ఫియట్ క్రొనోస్ సెడాన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఫియట్ తాజాగ ఆవిష్కరించిన క్రొనోస్ సెడాన్ ఎంతో కాలంగా విపణిలో ఉన్న లీనియా స్థానాన్ని భర్తీ చేయనుంది. ఇండియన్ మార్కెట్లోని సెడాన్ సెగ్మెంట్లో ఇది కీలకపాత్ర పోషించనుంది. ఫ్రెష్ డిజైన్ మరియు ప్రీమియమ్ ఫీచర్లున్న క్రొనోస్ మారుతి సుజుకి సియాజ్, వోక్స్‌వ్యాగన్ వెంటో, హ్యుందాయ్ వెర్నా మరియు హోండా సిటి వంటి కార్లకు పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: 2018 Fiat Cronos Sedan Unveiled; Is This The Next-Gen Linea For India?
Story first published: Thursday, November 30, 2017, 10:15 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark