ఏబిఎస్ గల భారత దేశపు అత్యంత సరసమైన ఐదు కార్లు

Written By:

అక్టోబర్ 2018 నుండి ఇండియన్ మార్కెట్లోని అన్ని కార్లు మరియు వాహనాలలో యాంటి లాక్ బ్రేకింగ్ (ఏబిఎస్) ఫీచర్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాహనాలలో ఏబిఎస్ ఉండటం వలన ప్రమాదాల రేటు చాలా వరకు తగ్గిపోయిందని కొన్ని అధ్యయనాలలో తేలింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఏబిఎస్ ఫీచర్ గల ఐదు బెస్ట్ కార్లు

కొన్ని కార్ల తయారీ సంస్థలు తమ కార్లలో ప్రభుత్వ నిర్ణయంతో పనిలేకుండా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నాయి. వాటిలో ధరకు తగ్గ విలువలతో, ఏబిఎస్ ఫీచర్ ఇముండిపుతో సామాన్యులు ఎంచుకోగలిగే వీలున్న అత్యంత సరసమైన ఐదు కార్లను డ్రైవ్‌స్పార్క్ తెలుగు నేటి కథనంలో అందిస్తోంది.

1. మారుతి సుజుకి సెలెరియో

1. మారుతి సుజుకి సెలెరియో

మారుతి సుజుకి 2014 ఇండియన్ ఆటో ఎక్స్ పో ద్వారా అత్యంత సరసమైన ధరతో పోటీదారులను దిమ్మతిరిగే ధరతో బి సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్ శ్రేణిలోకి సెలెరియో ఆటోమేటిక్ ప్రదర్శించింది. మూడు ఇంధన ఆప్షన్లు - పెట్రోల్, డీజల్ మరియు సిఎన్‌జి లు మారుతికి మంచి అమ్మకాలు సాధించిపెడుతున్నాయి.

ఏబిఎస్ ఫీచర్ గల ఐదు బెస్ట్ కార్లు

సాంకేతికంగా సెలెరియో హ్యాచ్‌బ్యాక్‌ను 800సీసీ మరియు 998సీసీ సామర్థ్యం ఉన్న ఇంజన్ వేరియంట్లతో ఎంచుకోవచ్చు. వీటిని 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ యూనిట్ ఛాయిస్‌లలో కూడా ఎంచుకోవచ్చు.

ఏబిఎస్ ఫీచర్ గల ఐదు బెస్ట్ కార్లు

భద్రతలో కీలకమైన యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను సెలిరియోలో ఎంచుకోవచ్చు. పర్యావరణానికి అనుకూలమైన సిఎన్‌జి ఆప్షన్‌ను సెలెరియో విఎక్స్ఐ(ఒ) వేరియంట్లో కలదు. సెలెరియో ధరల శ్రేణి రూ. 4.04 నుండి 5.25 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

2. మహీంద్రా కెయువి100

2. మహీంద్రా కెయువి100

క్రీడా శైలిలో ఎస్‌యూవీ వాహనాలకు ప్రసిద్దిగాంచిన మహీంద్రా అండ్ మహీంద్రా గత ఏడాది జనవరిలో సబ్ నాలుగు మీటర్ల కాంపాక్ట్ క్రాసోవర్ సెగ్మెంట్లోకి కెయువి100 ను విడుదల చేసింది. ఇది ప్రస్తుతం మారుతి అందుబాటులోకి తెచ్చిన ఇగ్నిస్ క్రాసోవర్‌కు పోటీనిస్తోంది. ఎక్స్‌యూవీ500 డిజైన్ లక్షణాలతో మోనోకోక్యూ ఛాసిస్‌తో మహీంద్రా కెయువి100 ను అత్యంత సరసమైన ధరతో విడుదల చేసింది.

ఏబిఎస్ ఫీచర్ గల ఐదు బెస్ట్ కార్లు

సాంకేతికంగా మహీంద్రా అండ్ మహీంద్రా కెయువి100లో 82బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 77బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ డీజల్ ఇంజన్ అందించింది.

ఏబిఎస్ ఫీచర్ గల ఐదు బెస్ట్ కార్లు

యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను కలిగి ఉన్న కెయువి100 ధరల శ్రేణి రూ. 4.58 లక్షల నుండి 7.29 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

3. మారుతి సుజుకి ఇగ్నిస్

3. మారుతి సుజుకి ఇగ్నిస్

మారుతి సుజుకి ఈ మధ్యనే దేశవ్యాప్తంగా ఉన్న నెక్సా విక్రయ కేంద్రాలలోకి ఇగ్నిస్ క్రాసోవర్‌ను విడుదల చేసింది. దీనిని సిగ్మా, డెల్టా, జెటా మరియు ఆల్ఫా వేరియంట్లలో పరిచయం చేసింది. నాలుగు వేరియంట్లను 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ వేరియంట్లో విడుదల చేసింది.

ఏబిఎస్ ఫీచర్ గల ఐదు బెస్ట్ కార్లు

5-స్పీడ్ మ్యాన్యువల్ లేదంటే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఎంచుకునే వీలున్న ఇగ్నిస్ వేరియంట్లలో ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్, స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్, ఎలక్ట్రిక్ పవర్ ద్వారా ఆపరేట్‌ చేయగలిగే అవుట్‌సైడ్ రియర్ వ్యూవ్ మిర్రర్స్ వంటి ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు ఉన్నాయి.

ఏబిఎస్ ఫీచర్ గల ఐదు బెస్ట్ కార్లు

మారుతి సుజుకి ఇగ్నిస్‌లో స్టాండర్డ్‌‌గా యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్‌ను అందిస్తోంది. ఇగ్నిస్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 4.59 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 7.08 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.

4. ఫోర్డ్ ఫిగో

4. ఫోర్డ్ ఫిగో

ఫోర్డ్ మోటార్స్ తొలిసారిగా తమ ఫిగో హ్యాచ్‌బ్యాక్‌ను 2010 లో దేశీయ విపణలోకి విడుదల చేసింది. అయితే పోటీ తీవ్రమైన నేపథ్యంలో ఇంజన్, డిజైన్ మరియు ఫీచర్ల జోడింపుతో అప్‌గ్రేడ్స్ నిర్వహించి మళ్లీ విడుదల చేసింది. అలాగే దీనికి కొనసాగింపుగా ఫిగో ఆస్పైర్ సెడాన్‌ను కూడా విడుదల చేసింది.

ఏబిఎస్ ఫీచర్ గల ఐదు బెస్ట్ కార్లు

సాంకేతికంగా నూతన ఫోర్డ్ ఫిగో హ్యచ్‌కబ్యాక్‌‌లో 99బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ డీజల్, 87బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ పెట్రోల్ మరియు 111బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది.

ఏబిఎస్ ఫీచర్ గల ఐదు బెస్ట్ కార్లు

ఫిగో లోని ఆంబియంట్ వేరియంట్ ఆప్షనల్‌గా ఏబిఎస్ కలిగి ఉంది. మరియు మిగతా అన్ని వేరియంట్లలో కూడా స్టాండర్డ్‌గా ఏబిఎస్ ఫీచర్ కలదు. అతి తక్కువ ధరతో ఆరు ఎయిర్ బ్యాగులను కలిగి హ్యాచ్‌బ్యాక్ ఫిగో. ఫిగో ఆంబియంట్ వేరియంట్ ధర రూ. 4.94 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 7.43 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.

 5. టాటా టియాగో

5. టాటా టియాగో

టాటా మోటార్స్ అభివృద్ది చేసిన నూతన డిజైన్ ఫ్లాట్‌ఫామ్ ఇంపాక్ట్ ను వేదికగా చేసుకుని రూపొందించిన మొదటి ఉత్పత్తి టియాగో హ్యాచ్‌బ్యాక్. గత ఏడాది టాటా మోటార్స్ టియాగోను రూ. 3.20 లక్షల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది.

ఏబిఎస్ ఫీచర్ గల ఐదు బెస్ట్ కార్లు

సాంకేతికంగా 84బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ లీటర్‌కు 23.84కిలోమీటర్ల మైలేజ్ మరియు ఇందులోని 1.05-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ లీటర్‌కు 27.28కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. రెండు ఇంజన్ వేరియంట్లు కూడా 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానాన్ని కలిగి ఉన్నాయి.

ఏబిఎస్ ఫీచర్ గల ఐదు బెస్ట్ కార్లు

సెలెరియో మరియు ఐ10 లకు పోటీనిస్తున్న టియాగోలో విశాలమైన క్యాబిన్ స్పేస్‌తో పాటు, హార్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఏయుఎక్స్-ఇన్, యుఎస్‌బి పోర్ట్, జూకి యాప్ వంటివి ఉన్నాయి. టాటా టియాగోలోని ఎక్స్‌జడ్ వేరియంట్లో ఏబిఎస్ అందించింది.

  • టియాగో ఎక్స్‌జడ్ పెట్రోల్ ధర రూ. 4.98 లక్షలు
  • టియాగో ఎక్స్‌జడ్ డీజల్ ధర రూ. 5.77 లక్షలు(ఎక్స్ షోరూమ్ ఢిల్లీ)
ఏబిఎస్ ఫీచర్ గల ఐదు బెస్ట్ కార్లు

ఆరు ఎయిర్ బ్యాగులు గల అత్యంత చౌకైన కారు... ఇండియన్ మార్కెట్లో తక్కువ ధరలో ఆరు ఎయిర్ బ్యాగులను కలిగి ఉండే కారు ఏదో తెలుసా..? దాని గురించి పూర్తి వివరాలు...

ఏబిఎస్ ఫీచర్ గల ఐదు బెస్ట్ కార్లు

వెహికల్ సేఫ్టీలో కేంద్రం మరో కీలకమైన నిర్ణయం

అన్ని కార్లు మరియు బస్సుల్లో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్) కల్పించాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసేలోపు ఆ యా వాహన తయారీ సంస్థలు తమ కార్లు మరియు బస్సుల్లో ఏబిఎస్‌ను అందించాల్సి ఉంటుంది

మారుతి సుజుకి 2017 స్విప్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను అతి త్వరలో చేయనుంది. ఇప్పుడు మీ వద్ద ఉన్న స్విఫ్ట్ డిజైన్ పరంగా దీనితో పోటీపడుతుందా...?

English summary
Five Most Affordable Cars in India with ABS
Story first published: Friday, February 24, 2017, 16:02 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark