చరిత్రను తిరగరాసిన మీరాబాయి చానుకు మహీంద్రా టియువి300 ప్రకటించిన ఆనంద్ మహీంద్రా

అమెరికాలో జరిగిన 2017 అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో 48 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన అనంతం ఆనంద్ మహీంద్రా గారు మీరాబాయి చానును అభినందిస్తూ ఆమెకు టియువి300 వాహనాన్ని ప్రకటించాడు.

By Anil

ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకాన్ని సాధించింది ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌గా నిలిచిన మీరాబాయి భారత దేశం మొత్తాన్నీ గర్వపడేలా చేసింది. కరణం మళ్లీశ్వరి తరువాత ఈ పోటీల్లో భారత్‌కు పసిడి పతకం తీసుకొచ్చిన మీరాబాయి చానుకు ఆనంద్ మహీంద్రా ఓ కానుకను ప్రకటించాడు.

ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌కు మహీంద్రా టియువి300 బహుకరించిన ఆనంద్ మహీంద్రా

జాతీయ మరియు అంతర్జాతీయ క్రీడలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారికి మరియు దేశాన్ని గర్వపడేలా చేస్తూ పతకాలను సాధిస్తున్న క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, వారికి ఎప్పుడూ బహుమతులు మరియు వివిధ కానుకలు ప్రకటించే మహీంద్రా అండ్ మహీంద్రా అండ్ ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా గారు మీరాబాయి చానుకు మహీంద్రా టియువి300 వాహనాన్ని బహుకరించనున్నట్లు ప్రకటించాడు.

ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌కు మహీంద్రా టియువి300 బహుకరించిన ఆనంద్ మహీంద్రా

అమెరికాలో జరిగిన 2017 అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో 48 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన అనంతం ఆనంద్ మహీంద్రా గారు మీరాబాయి చానును అభినందిస్తూ, మహీంద్రా అండ్ మహీంద్రా ఆ ధీరవనిత కోసం శక్తివంతమైన కాంపాక్ట్ ఎస్‌యూవీ టియువి300 ను సిద్దం చేసినట్లు తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు.

ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌కు మహీంద్రా టియువి300 బహుకరించిన ఆనంద్ మహీంద్రా

2017 వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్‌లో పసిడి పతాకం సాధించిన మీరాబాయి జాతీయ పోటీలలో 194 కిలోల బరువెత్తి దేశీయంగా సరికొత్త రికార్డ్ చేసింది. 1995 తరువాత ప్రపంచ వెయింట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ సాధించిన తొలి పసిడి పతకం ఇదే.

ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌కు మహీంద్రా టియువి300 బహుకరించిన ఆనంద్ మహీంద్రా

గతంలో 1994-1995 లలో తెలుగు తేజం కరణం మళ్లీశ్వరి చైనాలో జరిగిన అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో విజేతగా నిలిచి భారత్‌కు స్వర్ణ పతకాన్ని సాధించి పెట్టింది. కరణం మళ్లీశ్వరి తరువాత మళ్లీ భారత్‌కు కీర్తిని తెచ్చిపెట్టింది మీరాబాయి చాను.

ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌కు మహీంద్రా టియువి300 బహుకరించిన ఆనంద్ మహీంద్రా

అంతర్జాతీయంగా భారత్‌ను గర్వపడేలా చేసిన విజేతలకు ఆనంద్ మహీంద్రా గారు బ్రాండ్ న్యూ వెహికల్స్‌ను బహుకరించడం ఇదేమీ తొలిసారి కాదు. ఇటీవల బ్యాట్మింటన్ ఛాంపియన్ కిదాంబి శ్రీకాంత్‌కు ఆనంద్ మహీంద్రా గారు టియువి300 వాహనాన్ని బహుకరించారు.

ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌కు మహీంద్రా టియువి300 బహుకరించిన ఆనంద్ మహీంద్రా

దే విధంగా రెజ్లింగ్ ఛాంపియన్ సాక్షి మాలిక్, బ్యాడ్మింటన్ ఛాంపియన్ విపి సింధు మరియు పారా ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మరియప్పన్ తంగవేలు వంటి విజేతలకు మహీంద్రా థార్ ఆఫ్ రోడింగ్ వాహనాలను బహుకరించాడు.

ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌కు మహీంద్రా టియువి300 బహుకరించిన ఆనంద్ మహీంద్రా

మహీంద్రా విక్రయిస్తున్న రెండు సబ్ నాలుగు మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీలలో టియువి300 ఒకటి, మరొకటి మహీంద్రా నువోస్పోర్ట్. ల్యాండర్ ఫ్రేమ్ మీద నిర్మించిన ఇది డీజల్ వెర్షన్‌లో లభ్యమవుతోంది.

ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌కు మహీంద్రా టియువి300 బహుకరించిన ఆనంద్ మహీంద్రా

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి సుజుకి వితారా బ్రిజా మరియు టాటా నెక్సాన్ వంటి ఎస్‌యూవీలు ఉన్నాయి.

ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌కు మహీంద్రా టియువి300 బహుకరించిన ఆనంద్ మహీంద్రా

సాంకేతికంగా మహీంద్రా టియువి300 ఎస్‌యూవీలో 1.5-లీటర్ కెపాసిటి గల మూడు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. ఇది రెండు రకాలుగా పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది అవి, 80బిహెచ్‌పి మరియు 230ఎన్ఎమ్ మరియు 98.6బిహెచ్‌పి-240ఎన్ఎమ్.

ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌కు మహీంద్రా టియువి300 బహుకరించిన ఆనంద్ మహీంద్రా

మహీంద్రా టియువి300 లను 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో ఎంచుకోవచ్చు. రియర్ వీల్ డ్రైవ్ మరియు 7-సీటింగ్ కెపాసిటి ఇందులో ఉన్న రెండు ప్రత్యేకతలని చెప్పుకోవచ్చు.

ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌కు మహీంద్రా టియువి300 బహుకరించిన ఆనంద్ మహీంద్రా

మహీంద్రా టియువి300 ప్రారంభ ధర రూ. 7.71 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. మహీంద్రా దీనిని పొడవాటి వెర్షన్‌లో అభివృద్ది చేసింది. ఈ వెర్షన్‌ను మహీంద్రా టియువి300 ప్లస్ అనే పేరుతో త్వరలో పరిచయం చేయనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Anand Mahindra to gift TUV300 compact SUV to Mirabai Chanu, the world weightlifting champion
Story first published: Monday, December 4, 2017, 13:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X