ఆనంద్ మహీంద్రా వార్షిక వేతనం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...!!

Written By:

శక్తివంతమైన భారత పారిశ్రామిక వేత్తలలో ఒకరు ఆనంద్ మహీంద్రా. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో టూ వీలర్ల నుండి కార్లు, లారీలు, బస్సులు, నౌకలు చివరికి విమానాలను ఉత్పత్తి చేసే స్థాయికి మహీంద్రా సంస్థ ఎదిగింది. ఒక రంగానికే పరిమితమైన మహీంద్రా గ్రూపును ఎన్నో రంగాలకు విస్తరింపజేసిన ఘనత ఆనంద్ మహీంద్రాకే దక్కుతుంది. మరి ఆనంద్ మహీంద్రా వార్షిక వేతనం ఎంత ఉంటుందో తెలుసా....?

ఆనంద్ మహీంద్రా వార్షిక వేతనం

ఈయన జీతభత్యాల గురించి తెలుసుకోవడానికి మీకే కాదు మాకు కూడా ఎంతో కుతూహలంగా ఉంది. ఇవాళ్టి కథనంలో మహీంద్రా ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్‌తో పాటు మహీంద్రా గ్రూపులో పనిచేసే మేనేజర్ స్థాయి ఉద్యోగుల వరకు ఎలాంటి వేతనాలు ఉన్నాయో చూద్దాం రండి...

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఆనంద్ మహీంద్రా వార్షిక వేతనం

2016-17 ఆర్థిక సంవత్సరంలో మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా వార్షిక వేతనం 7.67 కోట్లుగా ఉంది. దీనికి ముందు ఆర్థక సంవత్సరపు వార్షిక వేతనంతో పోల్చితే ఆనంద్ మహీంద్రా గారి జీతం రమారమి 16.38 శాతం మేర పెరిగింది.

మహీంద్రా గ్రూపులోని ఇతర ఉద్యోగుల మధ్యస్థ వేతనంతో పోల్చితే ఆనంద్ మహీంద్రా గారి వేతనం 108.27 శాతంగా ఉంది.

ఆనంద్ మహీంద్రా వార్షిక వేతనం

మహీంద్రా గ్రూపులో ఆనంద్ మహీంద్రా తర్వాత ఉన్న కీలక వ్యక్తి మహీంద్రా మేనేజింగ్ డైరక్టర్ పవన్ గోయెంకా వార్షిక వేతనం 7.39 కోట్ల రుపాయలుగా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2016-17 లో పవన్ గోయెంకా జీతం 15.86 శాతం పెరిగింది.

ఆనంద్ మహీంద్రా వార్షిక వేతనం

మహీంద్రా గ్రూపులోని ఉద్యోగుల మధ్యస్థ వేతనంతో పవన్ గోయెంకా వేతాన్ని పోల్చితే, 2016-17 కాలానికి 104.43 శాతముగా ఉంది. అదే విధంగా మహీంద్రా సంస్థలో పనిచేసే ఉద్యోగుల సగటు వేతనం 7.08 లక్షలుగా ఉంది. మరియు గడిచిన ఆర్థిక సంవత్సరంలో వీరి సగటు వేతనం 0.43 శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడించాయి.

ఆనంద్ మహీంద్రా వార్షిక వేతనం

మేనేజర్ స్థాయి ఉద్యోగులు మరియు క్రింది స్థాయి ఉద్యోగుల వేతనాలు 2016-17 ఆర్థిక ఏడాదిలో తగ్గుముఖం పట్టాయి. వీరిలో మేనేజర్ క్రింది స్థాయి ఉద్యోగులు వేతనాలు 1.46 శాతం తగ్గగా, మేనేజర్ స్థాయి వేతానాలు 7.35 శాతం వరకు తగ్గుముఖం పట్టాయి.

ఆనంద్ మహీంద్రా వార్షిక వేతనం

వ్యక్తిగత పనితీరు, ద్రవ్యోల్బణం, పరిశ్రమ పోకడల ప్రభావం ఆధారంగా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ వేతనాలను నిర్ణయించినట్లు రిపోర్ట్‌లో వెల్లడైంది. తాజా ఆటోమొబైల్ న్యూస్ తెలుగులో పొందడానికి డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

English summary
Read In Telugu: Anand Mahindras Salary Up By 16.38 In FY17
Story first published: Tuesday, August 8, 2017, 11:04 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark