డాట్సన్ రెడి-గో 1.0 విడుదల: ధర, ఇంజన్, మైలేజ్, ఫోటోలు మరియు ఫీచర్ల కోసం...

Written By:

జపాన్ దిగ్గజం డాట్సన్ ఇండియన్ మార్కెట్లోకి తమ రెడి-గో కారును 1.0-లీటర్ వేరియంట్లో విడుదల చేసింది. సరికొత్త ఇంజన్‌తో విడుదలైన రెడి-గో ఇది వరకే 800సీసీ ఇంజన్‌తో లభించేది.

డాట్సన్ తొలుత విడుదల చేసిన గో మరియు గో ప్లస్ కార్లు ఆశించిన మేర ఫలితాలు సాధించలేదు. అయితే సరికొత్త డిజైన్‌తో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోకి విడుదలైన రెడి-గో 800సీసీ భారీ సేల్స్ సాధించింది. దీంతో రెడి-గో కారును మరింత శక్తివంతమైన వెర్షన్‌లో 1.0-లీటర్‌తో విపణిలోకి నేడు(26 జూన్, 2017) విడుదలయ్యింది.

డాట్సన్ రెడి-గో 1.0 విడుదల

డిజైన్ పరంగా ఈ వెర్షన్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు, అదే కండలు తిరిగిన డిజైన్ మరియు అధిక గ్రౌండ్ క్లియరెన్స్‌తో అచ్చం రెడి-గో బేస్ వెర్షన్‌నే పోలి ఉంటుంది. అయితే రియర్ డిజైన్‌లో రెడి-గో పేరు ప్రక్కన 1.0 అనే బ్యాడ్జ్ కలదు. ఇంటీరియర్ మొత్తాన్ని ఆల్ బ్లాక్ థీమ్‌తో అందించారు.

Recommended Video - Watch Now!
2017 Datsun redi-GO 1.0 Litre Review | In Telugu - DriveSpark తెలుగు
డాట్సన్ రెడి-గో 1.0 విడుదల

సరికొత్త రెడి-గో 1.0-లీటర్ ఇంటీరియర్‌లో డిస్క్ డ్రైవ్ మ్యాజిక్ సిస్టమ్, యుఎస్‌బి సపోర్ట్ మరియు ఏయుఎక్స్ పోర్ట్ ఉన్నాయి. కీ లెస్ ఎంట్రీ మరియు సెంటర్ కన్సోల్‌కు ప్రక్కపైవున ఉన్న చిన్న బటన్ ద్వారా ఆపరేట్ చేయగల సెంట్రల్ లాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. అయితే కేవలం డ్రైవర్ కోసం మాత్రమే ఎయిర్ బ్యాగ్ అందించారు.

డాట్సన్ రెడి-గో 1.0 విడుదల

డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ వెర్షన్‌లో 999సీసీ సామర్థ్యం గల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం గల పవర్ ఫుల్ రెడి-గో 67బిహెచ్‌పి పవర్ మరియు 91ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

డాట్సన్ రెడి-గో 1.0 విడుదల

800సీసీ ఇంజన్ గల రెడి-గో తో పోల్చుకుంటే 1.0 లీటర్ వెర్షన్ 14బిహెచ్‌పి పవర్ మరియు 19ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఏఆర్ఏఐ సర్టిఫికేట్ ప్రకారం, రెడి-గో 1.0-లీటర్ మైలేజ్ 22.5కిలోమీటర్లుగా ఉంది. అయితే డాట్సన్ 1.0 కారుకు స్వయంగా టెస్ట్ డ్రైవ్ నిర్వహించినపుడు మైలేజ్ 19 నుండి 20కిలోమీటర్లుగా ఉంది.

డాట్సన్ రెడి-గో 1.0 విడుదల

డాట్సన్ రెడి-గో ధరల వివరాలు...

డాట్సన్ రెడి-గో వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ధరలు(దేశవ్యాప్తంగా)
రెడి-గో డి(800సీసీ) రూ. 2.41 లక్షలు
రెడి-గో ఎ(800సీసీ) రూ. 3.02 లక్షలు
రెడి-గో టి(800సీసీ) రూ. 3.24 లక్షలు
రెడి-గో టి(ఒ)(800సీసీ) రూ. 3.34 లక్షలు
రెడి-గో ఎస్(800సీసీ) రూ. 3.49 లక్షలు
రెడి-గో స్పోర్ట్ (800సీసీ) రూ. 3.63 లక్షలు
రెడి-గో టి(ఒ)(1000సీసీ) రూ. 3.57 లక్షలు
రెడి-గో ఎస్(1000సీసీ) రూ. 3.72 లక్షలు
డాట్సన్ రెడి-గో 1.0 విడుదల

రెడి-గో 1.0 లీటర్ ఇంజన్‌తో రెండు వేరియంట్లలో మాత్రమే విడుదల చేసిది. టి(ఒ) ధర రూ. 3.57 లక్షలు మరియు ఎస్ వేరియంట్ ధర రూ. 3.72 లక్షలుగా ఉంది. ఈ రెండు వేరియంట్లు ప్రస్తుతం మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తున్నాయి. త్వరలో వీటిని ఆటోమేటిక్ వెర్షన్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

డాట్సన్ రెడి-గో 1.0 విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

విశాలవంతమైన ఇంటీరియర్, బాక్సీ డిజైన్, హై గ్రౌండ్ క్లియరెన్స్, చాక్యచక్యంగా నిర్ణయించిన ధర, మంచి మైలేజ్‌తో పాటు శక్తివంతమైన ఇంజన్‌తో రావడంతో డాట్సన్ రెడి-గో 1.0లీటర్ వెర్షన్ ధరకు తగ్గ విలువలను కలిగి ఉంది మరియు కొత్తగా కారును కొనుగోలు చేయడానికి బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.

Also Read:డాట్సన్ రెడి-గో 1.0-లీటర్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

English summary
Read In Telugu: Datsun redi-GO 1.0-Litre Launched In India: Priced At Rs 3.57 Lakh
Story first published: Wednesday, July 26, 2017, 19:03 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark