TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
విపణిలోకి విడుదలైన ఫెరారి జిటిసి4 లుస్సో: ధర రూ. 5.2 కోట్లు
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ దిగ్గజం ఫెరారి నేడు(02 ఆగష్టు, 2017) ఇండియన్ మార్కెట్లోకి జిటిసి 4 లుస్సో కారును రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ముంబాయ్ వేదకగా విడుదలైన దీని గరిష్ట ధర రూ. 5.2 కోట్లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.
ఫెరారి ఎఫ్ఎఫ్ స్థానాన్ని భర్తీ చేస్తూ, జిటిసి4 లుస్సో మరియు జిటిసి4 లుస్సో టి కార్లను విపణిలోకి ప్రవేశపెట్టింది.
- ఫెరారి జిటిసి4 లుస్సో టి ధర రూ. 4.2 కోట్లు
- ఫెరారి జిటిసి4 లుస్సో ధర రూ. 5.2 కోట్లుగా ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి.


సరికొత్త ఫెరారి జిటిసి4 లుస్సో కారులో 6.3-లీటర్ సామర్థ్యం ఉన్న వి12 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 681బిహెచ్‌పి పవర్ మరియు 697ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. జిసిటి4 లుస్సో కేవలం 3.4 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 335కిలోమీటర్లుగా ఉంది.
ఫెరారి జిటిసి4 లుస్సో టి సూపర్ కారులో 3.9-లీటర్ సామర్థ్యం గల ట్విన్ టుర్బో వి8 ఇంజన్ 602బిహెచ్‌పి పవర్ మరియు 760ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. జిటిసి4 లుస్సో టి కేవలం 3.5 సెకండ్ల వ్యవధిలోనే 0 నుండి 100కిమీల వేగాన్ని అందుకుంటుంది మరియు దీని గరిష్ట వేగం గంటకు 320కిలోమీటర్లుగా ఉంది.
ఈ రెండు కార్లలో ఫోర్ వీల్ స్టీరింగ్ మరియు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. అయితే, వీటిలో జిటిసి3 లుస్సో టి కారులో రియర్ వీల్ డ్రైవ్ కలద. శక్తివంతమైన జిటిసి4 లుస్సో కారులో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంది.
జిటిసి4 లుస్సో సిరీస్ కార్లు ఎఫ్ఎఫ్ సూపర్ కారుతో రూపొందించబడ్డాయి. ఫ్రంట్ డిజైన్‌లో పెద్ద పరిమాణంలో ఉన్న ఎయిర్ ఇంటేకర్, రీడిజైన్ చేయబడిన హెడ్ ల్యాంప్స్, ఆకర్షణీయమైన వీల్ ఆర్చెస్, రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్, సరికొత్త రియర్ డిఫ్యూసర్, క్వాడ్ ఎగ్జాస్ట్ మరియు టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.
ఫెరారి జిటిసి4 లుస్సో సిరీస్ ఇంటీరియర్‌లో లెథర్ అప్‌హోల్‌స్ట్రే, సెంటర్ కన్సోల్, 10.25-అంగుళాల పరిమాణం ఉన్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలదు. ఆపిల్ కార్ ప్లే మరియు శాటిలైట్ న్యావిగేషన్ వ్యవస్థలు ఉన్నాయి.
ప్రస్తుతం ఫెరారి లైనప్‌లో 4-సీటింగ్ లేఔట్లో ఈ రెండు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరియు వి8 ఇంజన్‌తో వచ్చిన తొలి ఫోర్ సీటర్ సూపర్ కారు కూడా ఇదే.