దేశవ్యాప్తంగా ప్రతి రోజు మారనున్న ఇంధన ధరలు: పూర్తి వివరాలు

జూన్ 16, 2017 నుండి దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇంధన ధరలు ప్రతి రోజూ మారనున్నాయి. ఫ్యూయల్ స్టేషన్‌కు వెళ్లే ప్రతి రోజూ ఇక మీదట కొత్త ధరలను గమనించవచ్చు.

By Anil

దేశీయ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం మేరకు, పెట్రోల్ మరియు డీజల్ ధరలు రోజు వారీగా సరణలకు గురికానున్నాయి. ఈ నూతన విధానం జూన్ 16, 2017 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. మే 1, 2017 నుండి దేశవ్యాప్తంగా ఉన్న ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా పరీశించిన తరువాత సత్పలితాలవ్వడంతో దీని అమలు చేపట్టారు.

దేశవ్యాప్తంగా ప్రతి రోజు మారనున్న ఇంధన ధరలు

చమురు సంస్థలు పైలట్ ప్రాజెక్ట్‌ క్రింద దేశీయంగా ఐదు నగరాలైన ఉదయ్ పూర్, జంషెడ్‌పూర్, పుదుచ్చేరి, చంఢీఘర్ మరియు విశాఖపట్నం లలో రోజు వారీగా ఇంధన ధరలను సవరించారు. దేశవ్యాప్తంగా దీనిని జూన్ 16, 2017 న అమల్లోకి తీసుకురానున్నారు.

దేశవ్యాప్తంగా ప్రతి రోజు మారనున్న ఇంధన ధరలు

దీని గురించి ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ స్పందిస్తూ, "ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులలో పెట్రోల్ మరియు డీజల్ ధరల్లో ఉన్న అస్థిరతను తగ్గించడానికి రోజు వారీగా పెట్రోల్ మరియు డీజల్ ధరల సవరణలు చేయడానికి నిర్ణయించినట్లు" పేర్కొంది.

దేశవ్యాప్తంగా ప్రతి రోజు మారనున్న ఇంధన ధరలు

రోజు వారీగా ఇంధన ధరలను సవరించడానికి శక్తివంతమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చమురు సంస్థలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ప్రతి రోజు ఇంధన ధరలు సవరణ జరిగిన అనంతరం ఏ రోజుకారోజు పేపర్లు, రిటైల్ సెంటర్లలో, మెసేజ్ మరియు మొబైల్ అప్లికేషన్ ద్వారా తెలియజేస్తామని తెలిపాయి.

దేశవ్యాప్తంగా ప్రతి రోజు మారనున్న ఇంధన ధరలు

ప్రస్తుతం, పెట్రోల్ మరియు డీజల్ ధరలు మార్కెట్లకు అనుగుణంగా మారుతున్నాయి. దేశీయ చమురు రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ మరియు హిందుస్తాన్ పెట్రోలియం కార్పేరేషన్ లిమిటెడ్ ప్రతి రోజూ ఇంధన ధరల సవరణ చేపడతాయి.

దేశవ్యాప్తంగా ప్రతి రోజు మారనున్న ఇంధన ధరలు

అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు మరియు డాలరుతో రుపాయి మారకం రేటు ఆధారంగా ఇంధన ధరల సవరణ చేపట్టనున్నారు. ఈ మూడు చమురు కంపెనీలు దేశవ్యాప్తంగా 95 శాతం పెట్రోల్ పంప్ స్టేషన్లను కలిగి ఉన్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu Fuel Price To Change Daily
Story first published: Thursday, June 8, 2017, 18:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X