లక్ష రుపాయల నెంబర్ కోసం 18 లక్షలు వెచ్చించాడు

Written By:

అత్యంత విలాసవంతమైన లగ్జరీ బైకులు మరియు కార్లను కొనుగోలు చేసే వారు, ఆ బండ్లకు అంతే ఖరీదైన ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకోవడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ మాటలను బలపరిచే సంఘటన తిరువనంతపురంలోని ఆర్‌టిఓ కార్యాలయంలో చోటు చేసుకుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఖరీదైన రిజిస్ట్రేషన్ నెంబర్

తిరువనంతపురానికి చెందిన ఓ ఫార్మసీ కంపెనీ యాజమాని మార్చి 20, 2017 న జరిగిన వేలంలో ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను రికార్డు ధర రూ. 18 లక్షల రుపాయలతో సొంతం చేసుకున్నాడు.

ఖరీదైన రిజిస్ట్రేషన్ నెంబర్

కెఎస్ బాలగోపాల్ అనే వ్యక్తి కొనుగోలి చేసిన ల్యాండ్ క్రూయిజర్ వెహికల్ కోసం కెఎల్ 01 సిబి 1 (KL 01 CB 1) రిజిస్ట్రేషన్ నెంబర్‍‌ను సొంతం చేసుకున్నాడు. ఈ వాహనం ధర సుమారు కోటి రుపాయలకు పైగా ఉంది.

ఖరీదైన రిజిస్ట్రేషన్ నెంబర్

ఈ నెంబర్ కోసం తిరువనంతపురం ఆర్‌టిఓ కార్యాలయంలో బాలగోపాల్‌తో పాటు మరో ఇద్దరు లగ్జరీ కార్ల ఓనర్లు మరియు ఓ సూపర్ బైక్ యాజమాని పాల్గొన్నాడు. ఈ నెంబర్ ధర ప్రారంభ వేలం ధర రూ. 1 లక్షగా నిర్ణయిస్తే, చివరికి 18 లక్షలకు అమ్ముడుపోయింది.

ఖరీదైన రిజిస్ట్రేషన్ నెంబర్

వేలం పాటలో ప్రముఖ అధికారులు సౌత్ జోన్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ సికె అశోకన్, ఇద్దరు అసిస్టెంట్ కమీషనర్లు మరియు తిరువనంతపురం ఆర్‌టిఓ బి మురళీకృష్టన్ పాల్గొన్నారు. ఈ మొత్తాన్ని వీడియోలో పథిలపరిచారు.

ఖరీదైన రిజిస్ట్రేషన్ నెంబర్

ఆర్‌టిఓ అధికారిక కార్యాలయం నుండి అందిన సమాచారం మేరకు, మొత్తం 27 ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లకు వేలం నిర్వహించారు. వీటి కోసం 210 మంది దరఖాస్తు చేసుకోగా, వాటిలో కేవలం సిబి శ్రేణి నెంబర్ల కోసం 67 మంది దరఖాస్తులు వచ్చాయి.

English summary
Man Spends Rs 18 Lakh For Fancy Registration Number — The Heights Of Vanity?
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark