టెస్టింగ్ పూర్తి చేసుకున్న హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

Written By:

హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ పలు రకాల పరీక్షల పూర్తి చేసుకున్న తరువాత ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ARAI) కార్యాలయం వద్ద ఆటోమొబైల్ మీడియా కంటికి చిక్కింది.

హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

పూనేలోని ARAI కార్యాలయంలో నిర్ధారణ ప్రక్రియ కోసం హాజరైనట్లు తెలిసింది. ఇండియన్ మార్కెట్లోని ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లోని బాలెనో మరియు హోండా జాజ్ కార్లకు గట్టి పోటీనివ్వగల ఈ ఐ20 ఫేస్‌లిఫ్ట్ కారును ఓ యూట్యూబ్ ఛానెల్ తమ కెమెరాతో క్లిక్ మినిపించింది.

Recommended Video - Watch Now!
High Mileage Cars In India - DriveSpark
హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

కొరియాకు చెందిన అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ఢిల్లీ వేదికగా జరగనున్న 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో షోలో ఆవిష్కరించనుంది.

హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

సరికొత్త హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్‌లో నూతన క్యాస్కేడింగ్ ఫ్రంట్ గ్రిల్ కలదు. పలుచటి సిల్వర్ పెయింట్ స్కీమ్ మరియు 10-స్పోక్ డార్క్ అల్లాయ్ వీల్స్ గుర్తించవచ్చు. సరికొత్త పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు మరియు బంపర్ మీద కాకుండా ఇరువైపులా ఉన్న టెయిల్ లైట్లకు మధ్యలో నెంబర్ ప్లేట్‌కు చోటు కల్పించింది. వీటితో పాటు టెయిల్ ల్యాంప్ గ్రాఫిక్స్ గల నూతన టెయిల్ లైట్లు ఉన్నాయి.

హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

ఎక్ట్సీరియర్‌తో పాటు ఇంటీరియర్‌లో కూడా కొన్ని ప్రధానమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే మరియు ఇతర కనెక్టివిటి ఫీచర్లను సపోర్ట్ చేయగల అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇందులో రానుంది.

హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

సాంకేతికంగా ఐ20 ఫేస్‌లిఫ్ట్‌లో అదే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది. అంతే కాకుండా, సరికొత్త 1.4-లీటర్ కెపాసిటి గల పెట్రోల్ ఇంజన్ 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రానుంది.

Trending On DriveSpark Telugu:

ఈ దారులు వెంబడి వెళితే వెనక్కి రావడం అసాధ్యం

17.5 గంటల పాటు నాన్ స్టాప్ గా ప్రయాణించే విమానం...

2017లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన స్కూటర్లు మరియు బైకులు

హ్యుందాయ్ ఎలైట్ ఐ20 హ్యాచ్‌బ్యాక్ 1.4-లీటర్ డీజల్ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ‌తో లభించనుంది. ప్రస్తుతం, హ్యుందాయ్ ఐ20 ధరల శ్రేణి రూ. 5.29 లక్షల నుండి రూ. 9.15 లక్షల ధరల శ్రేణిలో లభిస్తోంది. ఫేస్‌లిఫ్ట్ ఐ20 కూడా ఇదే ధరల శ్రేణితో లభ్యం కానుంది.

హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ మోటార్స్ ఇటీవల కొత్త తరం వెర్నా కారును లాంచ్ చేసింది. విడుదలైన కొంత కాలానికే విపరీతమైన ఆదరణ లభించడంతో మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు అదే ప్రేరణతో స్వల్ప డిజైన్ మార్పులతో ఐ20 ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌ను రీలాంచ్ చేయడానికి సిద్దమైంది.

Picture credit: Automobile Enthusiast's

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Hyundai i20 Facelift Spotted At ARAI In Pune
Story first published: Thursday, December 28, 2017, 17:42 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark