రెండు నెలల్లోనే రికార్డ్ స్థాయి బుకింగ్స్ సాధించిన హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ మోటార్స్ తాజాగా విడుదల చేసిన వెర్నాకు మంచి ఆదరణ లభిస్తోంది. రెండు నెలల వ్యవధిలోనే 20,000 లకి పైగా బుకింగ్స్ మరియు 1.5 లక్షల ఎంక్వైరీలు నమోదైనట్లు హ్యుందాయ్ వెల్లడించింది.

By Anil

హ్యుందాయ్ మోటార్స్ తాజాగా విడుదల చేసిన వెర్నాకు మంచి ఆదరణ లభిస్తోంది. రెండు నెలల వ్యవధిలోనే 20,000 లకి పైగా బుకింగ్స్ మరియు 1.5 లక్షల ఎంక్వైరీలు నమోదైనట్లు హ్యుందాయ్ వెల్లడించింది.

హ్యుందాయ్ వెర్నా

సెప్టెంబర్ మరియు ఆక్టోబర్ 2017 నెలల్లో కొరియన్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్స్ విడుదల చేసిన వెర్నా మిడ్ సైజ్ సెడాన్‌కు మంచి డిమాండ్ లభిస్తోంది. మొత్తం కొనుగోలుదారుల్లో 20 శాతం తొలిసారిగా కారును కొనుగోలు చేసే వారుండగా, 25 శాతం కస్టమర్లు ఆటోమేటిక్ వెర్షన్ వెర్నా కార్లను ఎంచుకుంటున్నట్లు తెలిసింది.

Recommended Video

[Telugu] Volkswagen Passat Launched In India - DriveSpark
హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ మోటార్స్ తమ మిడ్ సైజ్ సెడాన్ వెర్నా కారులో ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్‌లో భారీ మార్పులు చేర్పులు చేసి కొత్త వెర్నాగా లాంచ్ చేసింది. దీని విడుదలతో ఇదే సెగ్మెంట్లో ఉన్న హోండా సిటి మరియు మారుతి సియాజ్ కార్ల నోరు మూయించిందని చెప్పవచ్చు.

హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా 2.6-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. పెట్రోల్ వేరియంట్ 121బిహెచ్‌పి పవర్ మరియు 151ఎన్ఎమ్ టార్క్ అదే విధంగా డీజల్ వేరియంట్ 126బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

హ్యుందాయ్ వెర్నా

క్లాసీ లుక్, ప్రీమియమ్ ఫీల్ కల్పించే ఇంటీరియర్ మరియు సెగ్మెంట్ లీడర్ లక్షణాలు కలిగి ఉండటంతో వెర్నాను డీసెంట్ కస్టమర్లే అధికంగా ఎంచుకుంటున్నారు.

Trending On DriveSpark Telugu:

నవంబర్ 7 న వస్తున్న సుజుకి ఇంట్రూడర్ 150

టాటా టిగోర్ ఆటోమేటిక్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు

నవంబర్ 2017 లో విడుదల కానున్న కొత్త కార్లు

Most Read Articles

English summary
Read In Telugu: Hyundai verna clocks 20,000 bookings in two months
Story first published: Thursday, November 2, 2017, 17:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X