దక్షిణాదిలో విడుదలైన హ్యుందాయ్ వెర్నా: ధరలు ఇలా ఉన్నాయి!

Written By:

2017 హ్యుందాయ్ వెర్నా బెంగళూరు వేదిక దక్షిణ భారత మార్కెట్లోకి విడుదలయ్యింది. మూడవ తరానికి చెందిన, సరికొత్త హ్యుందాయ్ వెర్నా ప్రారంభ వేరియంట్ ధర రూ. 7.99 లక్షలు ఎక్స్-షోరూమ్ బెంగళూరుగా ఉంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
దక్షిణాదిలో విడుదలైన హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా పెట్రోల్ మరియు డీజల్ వేరియంట్లతో ఆటోమేటిక్ మరియు మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్నాయి. మరియు రెండు ఇంజన్ ఆప్షన్‌లను ఆరు విభిన్న వేరియంట్లలో ఎంచుకోవచ్చు.

Recommended Video - Watch Now!
Tata Nexon Review: Specs
దక్షిణాదిలో విడుదలైన హ్యుందాయ్ వెర్నా

న్యూ వెర్నా సెడాన్ మీద మూడేళ్లు లేదా అన్‌లిమిటెడ్ కిమీటర్ల వారంటీతో పాటు మూడు సంవత్సరాల పాటు ఉచిత రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కల్పిస్తోంది. న్యావిగేషన్ సిస్టమ్‌లో ఉన్న మ్యాప్స్ మూడు అప్‌డేట్స్ ఉచితంగా పొందవచ్చు.

దక్షిణాదిలో విడుదలైన హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా డీజల్ ఇంజన్ వివరాలు

వెర్నాలో ఉన్న 1.6-లీటర్ సామర్థ్యం గల నాలుగు సిలిండర్ల డీజల్ ఇంజన్ గరిష్టంగా 126బిహెచ్‌పి పవర్ మరియు 260ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సరికొత్త హ్యుందాయ్ వెర్నా డీజల్ వేరియంట్ లీటర్‌కు 24.76 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

దక్షిణాదిలో విడుదలైన హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా పెట్రోల్ ఇంజన్ వివరాలు

హ్యుందాయ్ వెర్నాలోని 1.6-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 121బిహెచ్‌పి పవర్ మరియు 151ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. సరికొత్త హ్యుందాయ్ వెర్నా పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 17.7 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

దక్షిణాదిలో విడుదలైన హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా పెట్రోల్ వేరియంట్ల ధరలు:

వేరియంట్లు ధరలు
వెర్నా ఇ రూ. 7,99,900 లు
వెర్నా ఇఎక్స్ రూ. 9,06,900 లు
వెర్నా ఇఎక్స్ ఆటోమేటిక్ రూ. 10,22,900 లు
వెర్నా ఎస్ఎక్స్ రూ. 9,49,900 లు
వెర్నా ఎస్ఎక్స్(ఒ) రూ. 11,08,900 లు
వెర్నా ఎస్ఎక్స్(ఒ) ఆటోమేటిక్ రూ. 12,23,900 లు
దక్షిణాదిలో విడుదలైన హ్యుందాయ్ వెర్నా

హ్యుందాయ్ వెర్నా డీజల్ వేరియంట్ల ధరలు

వేరియంట్లు ధరలు
వెర్నా ఇ రూ. 9,19,900 లు
వెర్నా ఇఎక్స్ రూ. 9,99,900 లు
వెర్నా ఇఎక్స్ ఆటోమేటిక్ రూ. 11,39,900 లు
వెర్నా ఎస్ఎక్స్ రూ. 11,11,900 లు
వెర్నా ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ రూ. 12,61,900 లు
వెర్నా ఎస్ఎక్స్(ఒ) రూ. 12,39,900 లు
దక్షిణాదిలో విడుదలైన హ్యుందాయ్ వెర్నా

వెర్నా లోని రెండు ఇంజన్ ఆప్షన్స్ 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌తో లభ్యమవుతాయి. 2017 హ్యుందాయ్ వెర్నా సెడాన్ పొడవు 4,440ఎమ్ఎమ్, వెడల్పు 1,729ఎమ్ఎమ్, ఎత్తు 1,465ఎమ్ఎమ్, వీల్ బేస్ 2,600 ఎమ్ఎమ్ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 165ఎమ్ఎమ్‌గా ఉంది.

2017 హ్యుందాయ్ వెర్నా డిజైన్, ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఫీచర్లు, భద్రత ఫీచర్లు, ఫోటోలతో పాటు మరిన్ని వివరాలు కోసం... మరియు మీకు నచ్చిన నగరంలో హ్యుందాయ్ కార్ల ధరలు ఇక్కడ తెలుసుకోండి...

English summary
Read In Telugu: Hyundai Verna Launched In Bangalore Launch Price Mileage Specifications Images
Story first published: Wednesday, August 23, 2017, 18:40 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark