సిఎన్‌జి వేరియంట్లో విడుదల కానున్న హ్యుందాయ్ ఎక్సెంట్

Written By:

హ్యుందాయ్ మోటార్స్ రానున్న సెప్టెంబర్‌లో ఇండియన్ మార్కెట్లోకి తమ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్ కారును సిఎన్‌జి వేరియంట్లో విడుదల చేయనుంది. ఫ్యాక్టరీలోని సిఎన్‌జి కిట్‌ను పెట్రోల్ వేరియంట్లలో అమర్చనుంది.

హ్యుందాయ్ ఎక్సెంట్ సిఎన్‌జి వేరియంట్

ఇండియన్ ట్యాక్సీ సెగ్మెంట్లో హ్యుందాయ్ ఎక్సెంట్ కాంపాక్ట్ సెడాన్‌‌కు మంచి డిమాండ్ ఉంది. ఎక్సెంట్ సిఎన్‌జి వేరియంట్లలో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న కప్పా డ్యూయల్ విటివిటి ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ గల ఇది గరిష్టంగా 82బిహెచ్‌పి పవర్ మరియు 114ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Recommended Video - Watch Now!
2018 Hyundai Verna Indian Model Unveiled | In Telugu - DriveSpark తెలుగు
హ్యుందాయ్ ఎక్సెంట్ సిఎన్‌జి వేరియంట్

సరికొత్త ఎక్సెంట్ ప్రైమ్ సిఎన్‌జి వేరియంట్ విడుదలను హ్యుందాయ్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మరియు సిఇఒ వై.కే. కూ స్పష్టం చేశాడు. వచ్చే సెప్టెంబర్‌లో ఎక్సెంట్ ప్రైమ్ కారును సరికొత్త సిఎన్‌జి వేరియంట్లో ప్రవేశపెట్టనుంది వివరించాడు.

హ్యుందాయ్ ఎక్సెంట్ సిఎన్‌జి వేరియంట్

హ్యుందాయ్ తమ ఎక్సెంట్ ప్రైమ్ సిఎన్‌జి వేరియంట్ విడుదలకు షెడ్యూల్ ఖరారు చేసి, ట్యాక్సీ సెగ్మెంట్లో మంచి ఫలితాలు సాధిస్తున్న స్విఫ్ట్ డిజైర్ టూర్ మరియు టయోటా ఎటియోస్ లకు పోటీని తీవ్రతరం చేసింది.

హ్యుందాయ్ ఎక్సెంట్ సిఎన్‌జి వేరియంట్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హ్యుందాయ్ ఎక్సెంట్ మంచి విక్రయాలే సాధిస్తోంది. నెలకు సుమారుగా 2,000 నుండి 3,000 యూనిట్ల మధ్య ఎక్సెంట్ కార్లు అమ్ముడుపోతున్నాయి. ఇక సిఎన్‌జి వేరియంట్ ఎక్సెంట్ విడుదలైతే అమ్మకాలు మరింత పుంజుకోనున్నాయి.

English summary
Read In Telugu: Hyundai Xcent CNG Variant To Be Launched In India In September
Story first published: Tuesday, August 29, 2017, 17:39 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark