హ్యుందాయ్ టుసాన్ మీద లక్ష రుపాయలు తగ్గిన ధర

Written By:

వాహన పరిశ్రమలోకి విడుదలకు కాక ముందే కస్టమర్లలో కొన్ని వాహనాలు భారీ అంచనాలను సృష్టిస్తాయి. డిజైన్, ఇంజన్, ఫీచర్లు మరియు ధర వంటి అంశాలలో దీనిని మించిన మోడల్ లేదనే విధంగా కార్ల కంపెనీలు హైప్ క్రియేట్ చేస్తాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హ్యుందాయ్ టుసాన్

అలాంటి వాటికి జీప్ కంపాస్ చక్కటి ఉదాహరణగా అని చెప్పవచ్చు. నిజమే, ఈ సెగ్మెంట్లో ఉన్న దాదాపు అన్ని మోడళ్లకు విపరీతమైన పోటీని సృష్టించింది. ప్రత్యేకించి హ్యుందాయ్ టుసాన్ మీద భారీ ప్రభావం ఏర్పడింది.

Recommended Video
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
హ్యుందాయ్ టుసాన్

ఎంతలా అంటే, జీప్ కంపాస్ పోటీని ఎదుర్కోలేక హ్యుందాయ్ మోటార్స్ టుసాన్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ ధరలో రూ. 1 లక్ష రుపాయల వరకు తగ్గించింది. పైన తెలిపిన అంశాలతో టుసాన్ జీప్ కంపాస్‌తో సరితూగకపోవడం మరియు కంపాస్ మీద వస్తోన్న భారీ బుకింగ్స్ నేపథ్యంలో హ్యుందాయ్ మోటార్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

హ్యుందాయ్ టుసాన్

జూలై 2017 లో విడుదలైన జీప్ కంపాస్ ఊహించిన ధరలతో మార్కెట్ మొత్తాన్ని ఒక్క ఊపు ఊపేసింది. క్లాస్ లీడింగ్ ఫీచర్లు, అద్భుతమైన భద్రత ఫీచర్లు, లగ్జరీ ఫీల్ కలిగించే ఇంటీరియర్ మరియు జీప్ బ్రాండ్ వంటి లక్షణాలతో పాటు మిడ్ సైజ్ ఎస్‌యూవీ ఎంచుకునే కస్టమర్లను టార్గెట్ చేస్తూ జీప్ కంపాస్‌ను విపణిలోకి ప్రవేశపెట్టింది.

హ్యుందాయ్ టుసాన్

జీప్ ఇండియా విభాగం జూలై నెలలో 935 యూనిట్లు మరియు ఆగష్టులో 2,020 యూనిట్ల కంపాస్ ఎస్‌యూవీలను డెలివరీ చేసింది. ఇవే నెలల్లో 116 మరియు 251 యూనిట్ల టుసాన్ ఎస్‌యూవీలను మాత్రమే హ్యుందాయ్ విక్రయించింది.

హ్యుందాయ్ టుసాన్

సరిగ్గా పండుగ సీజన్ మొదలైన నేపథ్యంలో హ్యుందాయ్ టుసాన్ మీద ధర తగ్గించింది. ఈ నిర్ణయం ఇటు కస్టమర్లను ఆకట్టుకోవడం మరియు అటు కంపాస్ పోటీని ఎదుర్కోవడంలో సహకరించనుంది.

హ్యుందాయ్ టుసాన్

ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, హ్యుందాయ్ కూడా మంచి బ్రాండ్ వాల్యూ కలిగి ఉంది. ఇక పోతే టుసాన్ ఎస్‌యూవీ పెట్రోల్ మరియు డీజల్ రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది, కాకపోతే ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ మాత్రమే ఇందులో రాలేదు.

హ్యుందాయ్ టుసాన్

ధరల విషయంలో చూస్తే, హ్యుందాయ్ టుసాన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 18.13 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 23.86 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

హ్యుందాయ్ టుసాన్

అయితే, జీప్ కంపాస్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 14.95 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 20.65 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి. జీప్ కంపాస్ టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌లో కూడా ఎంచుకోవచ్చు.

హ్యుందాయ్ టుసాన్

కంపాస్ మీద వస్తున్న డిమాండుకు అనుగుణంగా జీప్ ఇండియా ప్రొడక్షన్‌ను మరింత పెంచింది. కానీ, హ్యుందాయ్ మోటార్స్ గత ఏడాది తయారైన టుసాన్ స్టాక్ క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే డిస్కౌంట్ ప్రకటించింది. హ్యుందాయ్ టుసాన్ మీద డిస్కౌంట్‌కు సంభందించిన పూర్తి వివరాలకు సమీప హ్యుందాయ్ డీలర్‌ను సంప్రదించగలరు.

English summary
Read In Telugu: Jeep Compass Effect Hyundai Tucson Gets 1 Lakh Discount
Story first published: Thursday, September 14, 2017, 14:08 [IST]
Please Wait while comments are loading...

Latest Photos