మేడిన్ ఇండియా చొరవతో స్థానికంగా తయారైన జాగ్వార్ ఎఫ్-పేస్ విడుదల

Written By:

స్థానికంగా తయారైన జాగ్వార్ ఎఫ్-పేస్ లగ్జరీ ఎస్‌యూవీ ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయ్యింది. సరికొత్త మేడిన్ ఇండియా జాగ్వార్ ఎఫ్-పేస్ ప్రారంభ ధర రూ. 60.02 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

మేడిన్ ఇండియా జాగ్వార్ ఎఫ్-పేస్

ఇండియాలో తయారయ్యే జాగ్వార్ ఎఫ్-పేస్ 2.0-లీటర్ ప్రెస్టేజ్ వేరియంట్ ధర దిగుమతి చేసుకునే వేరియంట్ కన్నా రూ. 20 లక్షల వరకు తక్కువగా ఉంది. ఎఫ్-పేస్ ఎస్‌యూవీని పూనేలోని ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేయాలని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా నిర్ణయం తీసుకుంది.

Recommended Video - Watch Now!
[Telugu] 2018 Bentley Continental GT Revealed - DriveSpark
మేడిన్ ఇండియా జాగ్వార్ ఎఫ్-పేస్

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా 2018 మోడళ్ల ఉత్పత్తిని ప్రారంభించింది. ప్రస్తుతం జాగ్వార్ ఎఫ్-పేస్‌లో 20డి ఆల్ వీల్ డ్రైవ్ ప్రెస్టేజ్ వేరియంట్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. ఎఫ్-పేస్ లభించే ఏకైక వేరియంట్ కూడా ఇదే.

మేడిన్ ఇండియా జాగ్వార్ ఎఫ్-పేస్

జాగ్వార్ ఎఫ్-పేస్ 30డి మోడల్ ఇండియన్ మార్కెట్ నుండి వైదొలగింది. అయితే, భవిష్యత్తులో మార్కెట్ అనుకూలతను బట్టి మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. తాజాగా విడుదలైన జాగ్వార్ ఎఫ్-పేస్ లగ్జరీ ఎస్‌యూవీ లైనప్‌లోని ఆడి క్యూ5 మరియు బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్5 మోడళ్లతో గట్టి పోటీని ఎదుర్కోనుంది.

మేడిన్ ఇండియా జాగ్వార్ ఎఫ్-పేస్

జాగ్వార్ ఎఫ్-పేస్ 20డి వేరింయట్‌లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ అభివృద్ది చేసిన 2.0-లీటర్ టుర్బో ఛార్జ్‌డ్ నాలుగు సిలిండర్ల ఇంజీనియమ్ డీజల్ ఇంజన్ కలదు. ఇంజన్ ఉత్పత్తి చేసే 179బిహెచ్‌పి పవర్ మరియు 430ఎన్ఎమ్ టార్క్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ గుండా నాలుగు చక్రాలకు అందుతుంది.

మేడిన్ ఇండియా జాగ్వార్ ఎఫ్-పేస్

జాగ్వార్ ఎఫ్-పేస్ 20డి ప్రెస్టేజ్ వేరియంట్లో జాగ్వార్ డ్రైవ్ కంట్రోల్, ఎల్ఇడి హెడ్ లైట్లు, టెయిల్ లైట్లు, 380 వి మెరిడియన్ సౌండ్ సిస్టమ్, 12.3-అంగుళాల పరిమాణం ఉన్న ఇంస్ట్రుమెంట్ డిస్ల్పే, వై-ఫై హాట్‌స్పాట్ & ప్రొ సర్వీసెస్, ఆక్టివిటి కీ మరియు 10.2-అంగుళాల పరిమాణం గల టచ్ స్క్రీన్ వంటి ఫీచర్లు తప్పనిసరిగా ఉన్నాయి.

మేడిన్ ఇండియా జాగ్వార్ ఎఫ్-పేస్

జాగ్వార్ ల్యాండ్ రోవర్ నుండి ఇండియాలో తయారవుతున్న ఆరవ మోడల్ ఎఫ్-పేస్. సరికొత్త మేడిన్ ఇండియా జాగ్వార్ ఎఫ్-పేస్ 20డి ప్రెస్టీజ్ 2.0 డీజల్ ఎస్‌యూవీని www.findmeacar.in వైబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

మేడిన్ ఇండియా జాగ్వార్ ఎఫ్-పేస్

జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ అండ్ ప్రెసిడెంట్ రోహిత్ సూరి మాట్లాడుతూ, "2016 అక్టోబర్ నెలలో ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసినప్పటి నుండి జాగ్వార్ ఎఫ్-పేస్ మీద విపరీతమైన ఆదరణ లభించింది. అనతి కాలంలో ఎంతో మంది కస్టమర్ల ఫేవరెట్ ఎస్‌యూవీగా స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు మేడిన్ ఇండియా ఎఫ్-పేస్ ద్వారా మరింత కస్టమర్లను చేరుకోనున్నట్లు వివరించాడు."

మేడిన్ ఇండియా జాగ్వార్ ఎఫ్-పేస్

ఎఫ్-పేస్ ఎస్‌యూవీని స్థానికంగా ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడిన్ ఇండియా విధానంలో జాగ్వార్ భాగమవుతున్నందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు. స్థానికంగా తయారైన ఎఫ్-పేస్ ధర చాలా వరకు తగ్గడంతో సరికొత్త మైలురాయిని సాధించడం ఖాయమనిపిస్తోంది.

మేడిన్ ఇండియా జాగ్వార్ ఎఫ్-పేస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

జాగ్వార్ ఎఫ్-పేస్ 20డి ఎస్‌యూవీని స్థానికంగా ఉత్పత్తి చేయాలని జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా తీసుకున్న నిర్ణయంతో దీని ధర భారీగా దిగి వచ్చింది. దిగుమతి చేసుకునే ఎఫ్-పేస్ కంటే మేడిన్ ఇండియా మోడల్ ధర 20 లక్షల రుపాయల వరకు తగ్గింది.

English summary
Read In Telugu: Locally Manufactured Jaguar F-Pace Launched In India, Priced At INR 60.02 Lakh.
Story first published: Wednesday, November 15, 2017, 11:34 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark