జీఎస్టీ ఎఫెక్ట్: 2018 జనవరి నుండి భారీగా పెరగనున్న లగ్జరీ కార్ల ధరలు

Written By:

కేంద్ర ప్రభుత్వం ద్వారా చోటు చేసుకుంటున్న అనుకోని పరిణామాల నేపథ్యంలో లగ్జరీ కార్ల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. పరిస్థితులను అంచనా వేసిన పలు వాహన తయారీ సంస్థలు 2018 నుండి తమ వాహనాల ధరలు పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. లగ్జరీ కార్ల సంస్థలు కూడా ఇదే బాట పట్టనున్నాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
లగ్జరీ కార్ల మీద జీఎస్టీ

లగ్జరీ కార్ల మీద సెస్సును 15 నుండి 25 మేరకు పెంచాలనే బిల్లును లోక్ సభ ఆమోదించింది. ఈ 25 శాతం సెస్ పెంపు, నాలుగు మీటర్ల కన్నా పొడవున్న వాహనాల మీద వర్తించే 28 శాతం జీఎస్టీతో కలుపుకొని అమల్లోకి రానుంది.

Recommended Video - Watch Now!
Cars Discontinued In India 2017 - DriveSpark
లగ్జరీ కార్ల మీద జీఎస్టీ

దేశవ్యాప్తంగా వస్తు మరియు సేవల పన్ను అమలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాల నష్టపోయిన రెవెన్యూ లోటును భర్తీ చేయడానికి లగ్జరీ కార్ల మీద జీఎస్టీ సెస్ పెంపుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

లగ్జరీ కార్ల మీద జీఎస్టీ

ఇప్పుడు కొత్తగా ఆమోదం పొందిన జీఎస్టీ సవరణ బిల్లు, నాలుగు మీటర్లలోపు పొడవున్న కార్ల మీద సెప్టెంబరు 2017లో జీఎస్టీ కౌన్సిల్ జారీ చేసిన ఆర్డినెన్స్‌ స్థానాన్ని భర్తీ చేయనుంది.

లగ్జరీ కార్ల మీద జీఎస్టీ

తొలుత జారీ అయిన ఆర్డినెన్స్ ప్రకారం, జీఎస్టీ కౌన్సిల్ కార్ల మీద 15 శాతంగా ఉన్న సెస్సును 17 శాతానికి లేదా 22 శాతానికి పెంచింది. అదే విధంగా ఎస్‌యూవీల మీద 22శాతం వరకు పెరిగింది. తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న జీఎస్టీ మీద అదనంగా మరో 25 శాతం సెస్ భారం పడనుంది.

Trending On DriveSpark Telugu:

12 ఏళ్ల సుదీర్ఘ స్విఫ్ట్ ప్రయాణానికి వీడ్కోలు పలికిన మారుతి

ఇంజన్ ఆయిల్ మార్చకుండా 80,000 మైళ్లు నడిపాడు...

2017లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన స్కూటర్లు మరియు బైకులు

లగ్జరీ కార్ల మీద జీఎస్టీ

జీఎస్టీ సెస్ పెంపు నిర్ణయం ప్రకారం లగ్జరీ కార్ల ధరలు ఇక మీదట విపరీతంగా పెరగనున్నాయి. అయితే, ఈ సెస్ కార్ బాడీ స్టైల్ ఆధారంగా నిర్ణయించబడుతుందో లేకపోతే సెగ్మెంట్ల వారీగా అమల్లోకి వస్తుందో తెలియాల్సి ఉంది.

లగ్జరీ కార్ల మీద జీఎస్టీ

25 శాతం సెస్ పెంపు ఖచ్చితంగా ఇండియన్ లగ్జరీ కార్ల పరిశ్రమ మీద తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. జీఎస్టీ అమలును అన్ని కార్ల కంపెనీలు స్వాగతించాయి. అయితే, ఇష్టమొచ్చినట్లు సెస్ పెంచుతూనే ఉంది.

లగ్జరీ కార్ల మీద జీఎస్టీ

విపణిలో ఉన్న దిగ్గజ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలైన, మహీంద్రా, మారుతి సుజుకి, స్కోడా, ఫోర్డ్, జీప్, వోక్స్‌వ్యాగన్, టాటా మోటార్స్, ఇసుజు, నిస్సాన్ మరియు టయోటా కంపెనీలు ఇప్పటికే తమ కార్ల మీద వచ్చే జనవరి 2018 నుండి ధరలు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Luxury Cars To Cost More In India — Here’s Why
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark