రూ. 1.12 లక్షలకే ఒక్కసారి ఛార్జింగ్‌తో 85కిమీలు మైలేజ్‌నిచ్చే ఆటో విడుదల

Written By:

మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియన్ ఆటో రిక్షా మార్కెట్లోకి ఇ-ఆల్ఫా మిని ఎలక్ట్రిక్ ఆటోలను విడుదల చేసింది. ఉద్గార రహిత ఎకో ఫ్రెండ్లీ మహీంద్రా ఇ-ఆల్ఫా మిని ఎలక్ట్రిక్ ఆటో ధర రూ. 1.12 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

 మహీంద్రా ఇ-ఆల్ఫా మిని ఎలక్ట్రిక్ ఆటోలు

మహీంద్రా ఫ్యూచర్ రవాణా లక్ష్యంతో ఈ ఎలక్ట్రిక్ ఆటోను ఆవిష్కరించింది. ఇండియన్ రోడ్లను తట్టుకునేలా, పూర్తి స్థాయి మూడు చక్రాల ఆటో రిక్షాను డ్రైవర్‌తో పాటు నలుగురు ప్రయాణికులు కూర్చునే విధంగా డిజైన్ చేసింది.

 మహీంద్రా ఇ-ఆల్ఫా మిని ఎలక్ట్రిక్ ఆటోలు

సాధారణ డీజల్ ఇంజన్‌లో పోటీపడే విధంగా అదే ధృడమైన బాడీ, ఆకర్షణీయమైన ఇంటీరియర్, విశాలమైన క్యాబిన్ కలదు మరియు ప్రయాణికుల సౌకర్యానికి పెద్ద పీట వేస్తూ సుపీరియర్ సస్పెన్షన్ సిస్టమ్ మహీంద్రా ఇందులో అందించింది.

Recommended Video - Watch Now!
Toyota Etios Safety Experiential Drive in Bengaluru | In Telugu - DriveSpark తెలుగు
 మహీంద్రా ఇ-ఆల్ఫా మిని ఎలక్ట్రిక్ ఆటోలు

సాంకేతికంగా మహీంద్రా ఇ-ఆల్ఫా మిని ఆటోలో 120ఏహెచ్ బ్యాటరీ కలదు. శక్తివంతమైన మోటార్ మరియు కంట్రోలర్లను అందివ్వడం జరిగింది. మహీంద్రా ఇ-ఆల్ఫా మిని ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్టంగా 85కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది మరియు గరిష్టంగా గంటకు 25కిమీల వేగాన్ని అందుకుంటుంది.

 మహీంద్రా ఇ-ఆల్ఫా మిని ఎలక్ట్రిక్ ఆటోలు

మహీంద్రా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాకుండా ప్రధానమైన కొన్ని ఎంచుకోదగ్గ నగరాలలో మాత్రమే వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఢిల్లీ మరియు కేంద్ర రాజధాని పరిధితో పాటు కలకత్తా, లక్నోలో ఇవి లభ్యమవుతున్నాయి. ఇతర నగరాల్లో త్వరలో వీటిని ప్రవేశపెట్టనున్నట్లు మహీంద్రా పేర్కోంది.

 మహీంద్రా ఇ-ఆల్ఫా మిని ఎలక్ట్రిక్ ఆటోలు

ఎలక్ట్రిక్ ఆటో రిక్షా విడుదల వేదిక మీద మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ ప్రెసిడెంట్, రాజన్ వాధేరా మాట్లాడుతూ,"భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తులను అందస్తున్న ఏకైక సంస్థగా మహీంద్రా నిలిచింది. వివిధ రకాల రవాణా సాధనాలను ఎలక్ట్రిక్ వెర్షన్‌లో ప్రవేశపెడుతూ విజయనాన్ని అందుకుంటున్నట్లు తెలిపాడు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ది చేయనున్నట్లు కూడా వెల్లడించాడు."

 మహీంద్రా ఇ-ఆల్ఫా మిని ఎలక్ట్రిక్ ఆటోలు

మహీంద్రా ఇ-ఆల్ఫా మినీ ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేసే వారికి రెండేళ్లపాటు వారంటీ, తక్కువ డౌన్ పేమెంట్ స్కీమ్, ఆకర్షణీయమైన సులభ వాయిదాలు, మరియు ఒక్కసారి ఉచితంగా బ్యాటరీ మార్పిడి వంటి ఆఫర్లను మహీంద్రా అందిస్తోంది.

 మహీంద్రా ఇ-ఆల్ఫా మిని ఎలక్ట్రిక్ ఆటోలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో మహీంద్రా విసృత శ్రేణి ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. మహీంద్రా ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది చేసుకుంటోంది. భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనుంది.

English summary
Read In Telugu: Mahindra Launches e-Alfa Mini Electric Rickshaw In India; Priced At Rs 1.12 Lakh
Story first published: Saturday, September 9, 2017, 17:14 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark