ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో రాణించడం కోసం ఫోర్డ్, మహీంద్రా కుమ్మక్కు

Written By:

మహీంద్రా అండ్ మహీంద్రా ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి కోసం చెన్నైలోని ఫోర్డ్ ప్లాంటును వినియోగించుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. వాహన పరిశ్రమలో ఎలాంటి సంస్థతోనైనా చాకచక్యంగా భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకోవడంలో మహీంద్రా తర్వాతే మరైదనా అని చెప్పవచ్చు. పూర్తిగా కార్యరూపం దాల్చని ఈ ఒప్పందం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

చెన్నైలోని ఫోర్డ్ ప్లాంటు యొక్క వార్షిక సామర్థ్యం రెండు లక్షల యూనిట్లుగా ఉంది. అయితే ఫోర్డ్ ప్రస్తుతం ఏడాదికి గరిష్టంగా లక్షా ఇరవై వేల యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది.

ఫోర్డ్ ఇండియాకు గుజరాత్‌లో ఉన్న సనంద్ ప్లాంటులో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.4 లక్షల యూనిట్లుగా ఉంది. అయితే ఇందులో కేవలం 60 శాతం మాత్రమే వినియోగించుకుంటున్నట్లు తెలిసింది.

ఫోర్డ్ యొక్క రెండు ప్లాంట్లలో కూడా ప్రస్తుతం వినియోగంలో లేని మిగతా ఉత్పత్తి సామర్థ్యాన్ని అందుబాటులోకి తెచ్చి, అందులో మహీంద్రా అండ్ మహీంద్రా ప్యాసింజర్ కార్ల తయారీ చేపట్టాలనే నిర్ణయంలో ఉంది. తద్వారా ఫోర్డ్ కు స్వల్ప ఆధాయం కలిసొచ్చే అవకాశం ఉంది.

మహీంద్రా ఫోర్డ్‌తో జట్టుకడితే మహీంద్రా మంచి అవకాశం లభించనుంది. ప్రస్తుతం దేశానికి పశ్చిమ దిశనున్న రాష్ట్రంలో మహీంద్రాకు ప్రొడక్షన్ ప్లాంటు కలదు. ఇప్పుడు ఫోర్డ్‌తో కలిస్తే దక్షిణ భారతదేశంలో మహీంద్రా మరింత బలం చేకూరే అవకాశం ఉంది. అంతే కాకుండా మరో ఉత్పత్తి ప్లాంటు నిర్మాణం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. కాబట్టి ఈ రెండింటి భాగస్వామ్యం ఇరు సంస్థలకు లాభదాయకమే.

దేశీయ దిగ్గజ ఆన్‌లైన్ వార్తా వేదిక టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం మేరకు, ఇరు సంస్థల్లోని ప్రధాన అధికారులు ఈ ఒప్పందంపై చర్చించినట్లు తెలిసింది. ముందుగా ఇందుకు మహీంద్రా అండ్ మహీంద్రా మొగ్గుచూపగా, ఈ ఒప్పందం ఇరు సంస్థలకు లాభదాయకమైన నేపథ్యంలో ఈ రెండింటి మద్య డీల్ ఖాయం కానున్నట్లు సమాచారం.

మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా మాట్లాడుతూ, ఎలాంటి సమయంలోనైనా, డిఫరెంట్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్(OEM)తో చర్చించడానికి సిద్దంగా ఉన్నాము. అవకాశాలకు అనుగుణంగా, ప్రొడక్షన్ ఫ్లాట్‌ఫామ్‌లను పంచుకోవడంలో, డీలర్ల నెట్‌వర్క్ లను వినియోగించుకోవడంలో మహీంద్రా ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది. ఇది ఫోర్డ్‌తో గానీ మరే ఇతర సంస్థతో ఇదే ధోరణితో ఉంటామని వెల్లడించారు.

మహీంద్రా అండ్ మహీంద్రాకు ఇప్పుడు మంచి అమ్మకాలు సాధించిపెడుతున్న వాటిలో ఎక్స్‌యూవీ500 మొదటి స్థానంలో ఉంది. ట్రూ బ్లూ ఎస్‌యూవీగా భావించే ఇది మీకు నచ్చిందా... మరెందుకు ఆలస్యం క్రింద గల ఫోటోల మీద ఓ లుక్కేసుకోండి....

 

 

English summary
Mahindra & Ford May Tie-Up To Build Passenger Vehicles
Story first published: Monday, March 6, 2017, 10:35 [IST]
Please Wait while comments are loading...

Latest Photos