మహీంద్రా జివో అతి చిన్న ట్రాక్టర్ విపణిలోకి విడుదల

Written By:

మహీంద్రా అండ్ మహీంద్రా వ్యవసాయ పరికరాలు విభాగం(FES)జివో అనే అతి చిన్న ట్రాక్టర్‌ను విడుదల చేసింది. సబ్ 25బిహెచ్‌పి కెటగిరీలో అతి చిన్న ట్రాక్టర్లను ఉత్పత్తి చేసేందుకు జివో ఫ్లాట్‌ఫామ్‌ను మహీంద్రా విడుదల చేసింది.

మహీంద్రా జివో ట్రాక్టర్

మహీంద్రా జివో ట్రాక్టర్లు వరుస దుక్కులు చేసుకునేందుకు మరియు ఉద్యాన పంటలలో సేద్యానికి చక్కగా ఉపయోగపడుతాయి. మహీంద్రా జివో ట్రాక్టర్ అన్ని చక్రాలకు పవర్ ఉత్పత్తి చేసేందుకు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ అందివ్వడం జరిగింది.

Recommended Video - Watch Now!
TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మహీంద్రా జివో ట్రాక్టర్

ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉన్న ట్రాక్టర్‌ గరిష్టంగా 24బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది మరియు పిటిఒ షాఫ్ట్‌కు 22బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది. మహీంద్రా జివో ట్రాక్టర్ ధర రూ. 4 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

మహీంద్రా జివో ట్రాక్టర్

మహీంద్రా జివో ట్రాక్టర్‌ను విభిన్న అవసరాలకు వినియోగించుకోవచ్చు. భూమిని దున్నడం, అంతర పంటల వ్యవసాయానికి, పంటలు జాగ్రత్తలు మరియు ఉద్యాన పంటల సేద్యానికి ఈ ట్రాక్టర్ చక్కగా సరిపోతుంది. ఈ శ్రేణిలో జివో ట్రాక్టర్ అత్యుత్తమ మైలేజ్ మరియు 25బిహెచ్‌పి అత్యుత్తమ పవర్ ఉత్పత్తి చేస్తుంది.

మహీంద్రా జివో ట్రాక్టర్

డ్రైవర్ సౌకర్యానికి పెద్ద పీట వేస్తూ ఈ ట్రాక్టర్‌ను రూపొందించారు. చిన్న స్టీరింగ్ వీల్, సులభంగా ఆపరేట్‌ చేయగల పెడల్స్, మరియు టైర్ల మీద ఉన్న పెద్ద మడ్ గార్డుల మీద గేర్ లీవర్‌ను మరియు ఇతర లీవర్లను అందివ్వడం జరిగింది. సస్పెన్ సీటు, గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్స్ మరియు ఆకర్షణీయమైన డీకాల్స్ ఉన్నాయి.

మహీంద్రా జివో ట్రాక్టర్

మహీంద్రా జివో ట్రాక్టర్‌లో ఉన్న ప్రధానమైన ఫీచర్లు:ఇందులో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల మహీంద్రా డిఐ ఇంజన్, ఆటోమేటిక్ డెప్ట్ అండ్ డ్రాఫ్ట్ కంట్రోల్ (ADDC), అధిక గ్రౌండ్ క్లియరెన్స్, 2-స్పీడ్ పిటిఒ మరియు ట్రాక్టర్ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

మహీంద్రా జివో ట్రాక్టర్

మహీంద్రా జివో 245 ఫోర్ వీల్ డ్రైవ్ రెండు విభిన్న కలర్ ఆప్షన్‌లలో లభించును. అవి డ్యూయల్ టోన్ రెడ్ మరియు సిల్వర్ షీట్ మెటల్ కలర్స్. ట్రాక్టర్‌లో డిజి సెన్స్(DiGiSENSE) పరిజ్ఞానం కలదు. ఇది ట్రాక్టర్ యొక్క పనితీరు మరియు ట్రాక్టర్ గురించి పూర్తి సమాచారాన్ని డ్రైవర్‌కు సూచిస్తుంది.

మహీంద్రా జివో ట్రాక్టర్

జివో ట్రాక్టర్ ద్వారా మహీంద్రా హార్టికల్చర్ మరియు వరుస పంటల వ్యవసాయానికి అవసరమైన ట్రాక్టర్ల సెగ్మెంట్లోకి ప్రవేశించింది. త్వరలో 20బిహెచ్‌పి పవర్ సామర్థ్యంతో 2-వీల్ డ్రైవ్ సిస్టమ్ గల ట్రాక్టర్ జివో ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించి వచ్చే అక్టోబర్ లేదా డిసెంబర్ నాటికి విడుదల చేయనుంది.

మహీంద్రా జివో ట్రాక్టర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రపాయం!

జివో ట్రాక్టర్ల ఫ్లాట్‌ఫామ్ విడుదలతో మహీంద్రా చిన్న ట్రాక్టర్ల సెగ్మెంట్లోకి ప్రవేశించింది. చిన్న పరిమాణంలో ఉన్న అధిక పవర్ ఉత్పత్తి చేయగల ట్రాక్టర్లకు వ్యవసాయ రంగంలో అధిక డిమాండ్ ఉంది మరియు బడ్జెట్ ధరలో ట్రాక్టర్లు కోరుకునే రైతులకు జివో ట్రాక్టర్ ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు.

English summary
Read In Telugu: Mahindra Launches Jivo Small Tractor Platform
Story first published: Monday, August 14, 2017, 10:29 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark